E-Paper
Advertisement

రైలులో దొంగల బీభత్సం.. ఏకంగా ఫస్ట్ ఏసీ కోచ్‌లోనే చోరీ.. రూ.2.5 లక్షల బంగారం మాయం!

రైలులో దొంగల బీభత్సం.. ఏకంగా ఫస్ట్ ఏసీ కోచ్‌లోనే చోరీ.. రూ.2.5 లక్షల బంగారం మాయం!
Advertisement

First AC Coach Theft: రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఏకంగా ఫస్ట్ క్లాస్ ఏసీ కూపేలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు చెందిన రూ. 2.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 25,000 నగదు చోరీకి గురి కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి బాధితురాలు పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఏసీ కోచ్ లలో ప్రయాణికుల పరిస్థితే ఇలా ఉంటే.. జనరల్ బోగీల్లో వారి భద్రత ఏంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

బాధితురాలు ఏం చెప్పారంటే?

ఆనంద్ విహార్ టెర్మినల్ – న్యూ జల్పాయిగురి ఎక్స్‌ప్రెస్ (15726)లో ఈ చోరీ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు లక్నో స్టేషన్ సమీపంలో ఉండగా అపరిచిత వ్యక్తి ఫస్ట్ ఏసీ క్యాబిన్‌లోకి ప్రవేశించి ఈ చోరీకి పాల్పడ్డాడు. ‘నా వద్ద ఉన్న రూ. 2.5 లక్షల నగలు, రూ. 25,000 నగదు చోరీకి గురయ్యాయి. నా బిడ్డకు ఏ హానీ జరగకపోవడం ఒక్కటే ఉపశమనం. రైల్వే భద్రతా ఏర్పాట్లు తీవ్రంగా నిరాశపరిచాయి’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను సహాయం కోసం నాలుగుసార్లు ఎమర్జెన్సీ చైన్ లాగినప్పటికీ రైల్వే పోలీస్ కానీ, టీటీఈ కానీ రాలేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో స్పందించాల్సిన రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమె ఆరోపించారు.

Advertisement

స్పందించిన లక్నో రైల్వే పోలీసు

సామాజిక మాధ్యమాల్లో సదరు వీడియో వైరల్ కావడం, విమర్శలు వెల్లువెత్తుతుండటంతో లక్నో రైల్వే పోలీసులు స్పందించారు. ఘటనపై తగిన చర్యలకు ఉపక్రమించామని.. మరిన్ని వివరాలు సమర్పించేందుకు తమ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయాలని ఎక్స్ వేదికగా సూచించింది. అయితే ఈ చోరీపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ఫిర్యాదు తమకు అందలేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. బాధితురాలిని సంప్రదించి.. చోరీకి సంబంధించిన మరిన్ని వివరాలు తీసుకునేందుకు జీఆర్పీ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: దీపావళి గిఫ్ట్స్ అదుర్స్.. నెటిజన్స్ ఫిదా.. ఇలాంటి కంపెనీలో జాబ్ రావాలి సామీ!

నెటిజన్ల ఆగ్రహం.. భద్రతపై ప్రశ్నలు

మరోవైపు అత్యంత సురక్షితమైనదిగా భావించే ఫస్ట్ ఏసీ కూపేలోనే ఇలాంటి చోరీలు జరగడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రూ. 4,000 నుండి రూ. 5,000 వరకు ప్రీమియం ఛార్జీలు చెల్లించి ప్రయాణించినా భద్రత ఉండదా?’ అని ప్రశ్నిస్తున్నారు. అయితే కొంతమంది బాధితురాలికి మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమె చేసిన పనిని తప్పుబడుతున్నారు. రైలు ప్రయాణాల్లో డబ్బు, నగలు తీసుకెళ్లడం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మెుత్తం మీద ఫస్ట్ ఏసీ కూపేలో జరిగిన ఈ చోరీ ఘటన.. రైల్వేలో భద్రతపరమైన లోపాలను మరోమారు తెరపైకి తెచ్చినట్లైంది.

Also Read: పావురాల బెడద ఎక్కువైందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.. దెబ్బకి భయంతో పారిపోతాయ్!

Tags

Related News

ఆకాశం నుంచి మాంసం ముక్కల వాన.. భయంతో జనాలు పరుగులు, ఎక్కడంటే?

తెలంగాణ, ఏపీ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. దీపావళి రద్దీకి ప్రత్యేక రైళ్లు!

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ రైలు.. 20 అద్భుతమైన ఫీచర్లు ఇవే?

ఈ నేషనల్ హైవే ఒకప్పుడు మరణాలకు కేరాఫ్.. నిత్యం రక్తంతో ఎరుపెక్కేది!

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

ఆ రోడ్డు మీద నిలబడి.. ఏం కోరుకున్నా జరిగిపోద్ది, కానీ.. మీ ఆత్మను సైతాన్‌కు రాసివ్వాలట!

మా దేశానికి రండి మా పౌరులను ప్రేమించండి.. లవ్ చేయాలనుకునేవారికి ఉచిత ఫారిన్ ట్రిప్..

Big Stories

Advertisement
×