Spain Train Accident: స్పెయిన్‌లోని సెంట్రల్ రీజియన్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వేగంగా వెళ్తున్న రెండు హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో కనీసం 39 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని స్థానిక మీడియా పేర్కొంది.
టోలెడో ప్రావిన్స్‌లో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ‘రెంఫే’ (Renfe), ‘ఇరియో’ (Iryo) అనే రెండు సంస్థలకు చెందిన హైస్పీడ్ రైళ్లు ఒకే దిశలో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఢీకొన్నాయి. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక రైలు, ముందు వెళ్తున్న రైలు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ముందున్న రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి.
🇪🇸 More footage emerging from the deadly train disaster in Spain.
Reports indicate that over 39 people were killed and dozens injured after two high-speed trains collided near Toledo.
The footage shows severely damaged carriages and rescue teams working through the wreckage. The death toll could rise further.— DDF NEWS (@ddfmarketing1) October 28, 2026
Also Read: పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్.. ఒకేసారి రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే.. నెలకు వచ్చే వడ్డీ ఎంత?
కాగా, ప్రమాదం పట్ల స్పెయిన్ రైల్వే సిస్టమ్ ఆపరేటర్ ‘ఏడీఐఎఫ్’ తక్షణమే స్పందించింది. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు ప్రకటించింది. ప్రస్తుతం మ్యాడ్రిడ్ – సియుడాడ్ రియాల్ – అందలూసియా మధ్య రైళ్ల సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు ఈ విషాదకర ఘటనపై స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘టోలెడోలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారికి నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’ అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
Also Read: జడ్జి కొడుకు యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. కొచ్చి పోలీస్ కమిషనర్‌పై వేటు.. కారణం ఏంటంటే?