Jailer 2 Shooting Locations: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన షూటింగ్ ప్రదేశాలు కూడా సినీ అభిమానులు, పర్యాటకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. సౌత్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేశారు. సిటీ వాతావరణం నుంచి పచ్చని కొండలు, జలపాతాలు, సముద్ర తీరాల వరకు విభిన్న ప్రాంతాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
తమిళనాడు రాజధాని చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా జరిగింది. అక్కడి ఈవీపీ ఫిల్మ్ సిటీ, ఆదియారం ఫిల్మ్ సిటీ వంటి ప్రాంతాల్లో షూట్ చేశారు. రాయపేటలోని సత్యం సినిమాస్, ఈస్ట్ కోస్ట్ రోడ్ పరిసరాల్లోనూ కూడా షూట్ చేశారు.ఇక కోయంబత్తూరు సమీపంలోని అనైకట్టి ప్రాంతం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ఇక్కడి వరహనాడు వ్యవసాయ క్షేత్రం పరిసరాల్లోనూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తేని ప్రాంతాన్ని కూడా కొన్ని అవుట్ డోర్ షెడ్యూల్స్ కోసం ఉపయోగించారు.
కేరళలో ప్రకృతి అందాల నడుమ చిత్రీకరణ
కేరళలోని పచ్చని కొండలు, జలపాతాలు, ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా అతిరప్పిల్లి జలపాతం పరిసరాలు చిత్రీకరణకు ఉపయోగించారు. భారీ నీటి ప్రవాహం, చుట్టూ విస్తరించిన అడవులు యాక్షన్ సన్నివేశాలకు అద్భుతమైన నేపథ్యాన్ని అందించాయి. అట్టపాడి ప్రాంతంలోనూ షూటింగ్ జరిగింది. గొంజియూర్ సమీపంలోని ప్రాంతాలు ఈ చిత్రీకరణలో ఉన్నాయి. కొజికోడ్‌లోని చెరువన్నూర్ ప్రాంతంలో ఉన్న సుదర్శన్ బంగ్లాలో కూడా షూట్ చేశారు. పాలక్కాడ్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.
తమిళనాడు, కేరళతో పాటు కర్ణాటకలోనూ కీలక షూటింగ్ షెడ్యూల్స్ నిర్వహించారు. అయితే, ఆయా ప్రాంతాలకు సంబంధించిన నిర్దిష్ట ప్రదేశాలకు సంబంధించిన వివరాలు అంతంగా అందుబాటులో లేవు. గోవాలోని తీర ప్రాంతాలు, సముద్ర తీరాల నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు.
‘జైలర్ 2’ షూటింగ్ తో వైరల్ అయిన ఈ ప్రాంతాలు సినిమా అభిమానులకే కాకుండా ప్రయాణాలను ఇష్టపడేవారికీ చాలా నచ్చుతున్నాయి. తిరప్పిల్లి జలపాతం, అట్టపాడి కొండ ప్రాంతాలు, గోవా సముద్ర తీరాలు ప్రకృతి ప్రేమికులకు మంచి ట్రావెల్ డెస్టినేషన్స్ గా మారువుతున్నాయి. దృశ్యాలు, పట్టణ నేపథ్యాల కలయికతో ‘జైలర్ 2’ షూటింగ్ ప్రదేశాలపై టూరిస్టులలో ఆసక్తి పెరుగుతోంది. మీకూ ఈ సినిమాలోని లొకేషన్స్ నచ్చితే ట్రావెల్ ప్లాన్ చేసేయండి.
Read Also: ప్రకృతితో కలిసి ప్రయాణం.. భారత్ లో చూడాల్సిన 7 విస్టాడోమ్ రైల్వే రూట్స్ ఇవే!