Railway Bulk Booking Rules 2026: కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొలిగ్స్ తో కలిసి రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. ఎక్కువ మంది ఒకేసారి టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలుగా గ్రూప్ బుకింగ్ రూల్స్ లో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా బల్క్ రిజర్వేషన్ల కింద బుక్ చేసుకునే బెర్తుల సంఖ్యపై గతంలో ఉన్న పరిమితిని తొలగించింది. దీంతో ఎక్కువ మంది కలిసి వెళ్లే వారికి రిజర్వేషన్లు పొందడం మరింత ఈజీ నుంది.
సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) తాజాగా కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. గతంలో గ్రూప్ రిజర్వేషన్లకు సంబంధించి నిర్దిష్ట సంఖ్యలో బెర్తులు మాత్రమే ఆమోదించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్లు (CRS), స్టేషన్ మేనేజర్లు (SM) గ్రూప్ బుకింగ్ రిక్వెస్టులను ఆమోదించవచ్చు. అయితే, దీనర్థం అడిగినన్ని బెర్తులు ఆటోమేటిక్‌గా కేటాయిస్తారని కాదు. అందుబాటులో ఉన్న బెర్తులు, నిబంధనలు, అధికారుల ఆమోదం ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయి.
ఈ కొత్త రైల్స్ తో ఒకేసారి పెద్ద సంఖ్యలో వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహ వేడుకలకు వెళ్లే కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థుల విహార యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు, స్పోర్ట్స్ కోసం వెళ్లే జట్లు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే టీమ్స్ కు ఎంతో మేలు కలుగుతుంది. ఈ సౌకర్యం అన్ని క్లాస్ లకు ఉపయోగకరంగా ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) ప్రారంభమయ్యే రోజున ఉదయం 9 గంటల నుంచి మెయిన్ రిజర్వేషన్ కేంద్రాల్లో గ్రూప్ బుకింగ్ అభ్యర్థనలు తీసుకుంటారు. సాధారణ ప్రయాణికులకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన గంట తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకోసం ప్రయాణికులు సంబంధిత రైల్వే అధికారులను నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది.
గ్రూప్ బుకింగ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ప్రయాణానికి గల కారణాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అలాగే గ్రూపులోని ప్రతి ప్రయాణికుడి పూర్తి పేరు, వయస్సు, లింగం, చిరునామా లాంటి వివరాలను సమర్పించాలి. ప్రయాణ ఉద్దేశ్యం చెప్పకపోయినా, ప్రయాణికుల వివరాలు పూర్తిగా లేకపోయినా అప్లికేషన్లను రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయుల (NRI) రిజర్వేషన్లకు మాత్రం ప్రస్తుత ప్రత్యేక నిబంధనలే వర్తిస్తాయి.
ఈ మార్పులను సౌత్ వెస్ట్రన్ రైల్వే ప్రకటించింది. దీని హెడ్ ఆఫీస్ కర్ణాటకలోని హుబ్లీలో ఉంది. కమర్షియల్ సర్క్యులర్ నెం. 37/2026, రేట్ అడ్వైస్ నెం. 11/2026 ద్వారా కొత్త గైడ్ లైన్స్ ను జారీ చేశారు. ఇకపై పెద్ద బృందాలుగా రైలు ప్రయాణాలు చేసే వారికి ఈ నిర్ణయం ఉపయోగకరంగా మారనుంది.
South Western Railway Simplifies Rules for Bulk / Group Booking
ನೈಋತ್ಯ ರೈಲ್ವೆಯಿಂದ ಗುಂಪು ಬುಕಿಂಗ್ ನಿಯಮಗಳ ಸರಳೀಕರಣ pic.twitter.com/F5Y02AzNdW— South Western Railway (@SWRRLY) November 19, 2026
Read Also: అక్వాన్ తుఫాను ఎఫెక్ట్.. 69 రైళ్లు రద్దు.. మీ ట్రైన్ కూడా ఉందా?