South India’s Romantic Road Trip: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు మ్యాజిక్ చేస్తున్నాయి. పర్యటక ప్రదేశాలు మరింత అందాన్ని అద్దుకున్నాయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చల్లని గాలులు వీస్తుంటే, ప్రకృతి దృశ్యాలు పచ్చని తివాచీ పరుచుకుని కనువిందు చేస్తున్నాయి. కొండల మీద నుంచి జాలువారే జలపాతాలు ఆహా అనిపిస్తున్నాయి. ఈ సమయంలో చాలా మందికి రోడ్ ట్రిప్ వెళ్లాలని భావిస్తారు. అలాంటి వారి కోసం సౌత్ లో ఉన్న రొమాంటిక్ రోడ్ ట్రిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సౌత్ ఇండియాలో రొమాంటిక్ రోడ్ ట్రిప్స్
రుతుపవనాల వేళ జీవితంలో మర్చిపోలేని రోడ్ ట్రిప్ వేయాలంటే కేరళ, కర్ణాటక పరిధిలోని పలు ప్రాంతాలు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వయనాడ్-కూర్గ్-కబిని లూప్ అద్భుతమైన దృశ్యాలు, తక్కువ రద్దీతో కొత్త జంటలకు మరింత రొమాంటిక్ గా ఉంటుంది. ఈ మూడు డెస్టినేషన్స్ వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నా, గంటల వ్యవధిలో చుట్టేయొచ్చు. పొగమంచుతో కూడిన ఉదయాలు, వంపు తిరిగిన ఫారెస్ట్ రోడ్లు ఆహా అనిపిస్తాయి. వయనాడ్–కూర్గ్–కబిని లూప్ సౌత్ ఇండియాలో అందమైన, హనీమూన్- ఫ్రెండ్లీ ట్రైల్. గంటల వ్యవధిలో ఈ గమ్యస్థానాను చేరుకోవచ్చు. కేరళలోని వయనాడ్, కర్ణాటకలోని కూర్గ్, కేరళ-కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉన్న కబిని కలుపుతూ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ప్రతి స్టాప్ పూర్తిగా భిన్నమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి.
వయనాడ్: జలపాతాలు, పచ్చదనం, ఫారెస్ట్ స్టేలు ఆహా అనిపిస్తాయి.
కూర్గ్: కాఫీ తోటలు, హోమ్ స్టేలు, చల్లని వాతావరణం మైమరిచిపోయేలా చేస్తుంది.
కబిని: వన్యప్రాణుల సఫారీలు, నదీతీర సూర్యాస్తమయాలు, విలాసవంతమైన లాడ్జీలు ఆకట్టుకుంటాయి.
వయానాడ్ లో అందమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చు. మీన్ ముట్టి జలపాతాలకు ట్రెక్కింగ్ కు వెళ్లొచ్చు. పూకోడ్ సరస్సు దగ్గర పిక్నిక్ ఎంజాయ్ చెయ్యొచ్చు. అడవి మధ్యలో ఉన్న ప్రైవేట్ ట్రీహౌస్ లో ఉండవచ్చు. ఇక వయనాడ్ నుంచి కూర్గ్ కు వెళ్లొచ్చు. ఇది కర్ణాటకలోని ఎంతోఅందమైన ప్రదేశం. ఇక్కడి కాఫీకి దేశం అంతా ఫిదా అవుతుంది. కాఫీ తోటల్లో నడుస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. స్పైస్ గార్డెన్లను సందర్శించవచ్చు. కూర్గ్ చల్లగా, నిశ్శబ్దంగా ఎంతో ప్రశాంతతను అందిస్తుంది. కూర్గ్ నుంచి కబిని వెళ్లవచ్చు. కూర్గ్ పొగమంచు కొండల తర్వాత, లగ్జరీ, వన్యప్రాణులను చూసి ఎంజాయ్ చేసేందుకు కాబినికి వెళ్లండి. నాగర్ హోళే జాతీయ ఉద్యానవనానికి దగ్గరగా నది ఒడ్డున ఉన్న కాబినిలో ఏనుగులు, మొసళ్లను చూసేలా బోట్ సఫారీలు ఉంటాయి. బ్యాక్ వాటర్స్ ను చూసేలా బాల్కనీలతో కూడిన అటవీ లాడ్జీలు మరింత బాగుంటాయి. పక్షుల గానం, సూర్యాస్తమయ దృశ్యాలు కనువిందు చేస్తాయి.
మూడు ప్రాంతాలను కవర్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది?
వయనాడ్, కూర్గ్, కాబిని చుట్టేయడానికి సాధారణంగా 7 నుంచి 9 రోజులు పడుతుంది. వయనాడ్‌లో 2–3 రాత్రులు అటవీ బసలు, ట్రెక్కింగ్ కోసం కేటాయించాలి. కూర్గ్ లో 2–3 రాత్రులు కాఫీ, ప్రశాంతత, చల్లని వాతావరణం కోసం ఇవ్వాల్సి ఉంటుంది. కబినిలో 2–3 రాత్రులు సఫారీలు, నదీ తీర విలాసాల కోసం కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ తక్కువగా సమయం ఉంటే, ఏవైనా రెండు డెస్టినేషన్స్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. వయనాడ్ లో బొంగులో చికెన్ చాలా ఫేమస్. అరటి ఆకులలో వడ్డించే ఆహారం చాలా టేస్టీగా ఉంటుంది. కూర్గ్ లో అక్కి రోటీతో పాండి కర్రీ చాలా బాగుటుంది. శాఖాహారుల కోసం పుట్టగొడుగుల మిరియాల ఫ్రై నచ్చుతుంది. ఫిల్టర్ కాఫీ ఆహా అనిపిస్తుంది. కబిని హోమ్‌స్టేలలో తాజాగా తయారుచేసిన రివర్ ఫిష్ ఫ్రై, రైస్ సాంబార్, సైడ్ డిష్‌లతో థాలీ భోజనం చాలా బాగుటుంది.
వయనాడ్–కూర్గ్–కబిని రోడ్ ట్రిప్ కు ఎలా వెళ్లాలి?
ఈ ట్రిప్ కోసం ముందుగా కాలికట్ (కోజికోడ్) విమానాశ్రయం లేదా మైసూర్ కు వెళ్లాలి. ఆ తర్వాత వయనాడ్ → కూర్గ్ → కాబినికి లేదంటే కాబిని, కూర్గ్, వయనాడ్ వెళ్లొచ్చు. ఇద్దరికి 7–9 రోజుల ట్రిప్ కు అన్ని సదుపాయాలతో సుమారు రూ. 80,000 కంటే తక్కువ ఖర్చు అవుతుంది.
Read Also: దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇదే, రోజూ ఎన్ని రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయంటే?