E-Paper
Advertisement

రైల్వే ప్రయాణికులకు బిగ్ అప్‌ డేట్.. ఆగస్టు నుంచి ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొత్త కోచ్‌లు!

రైల్వే ప్రయాణికులకు బిగ్ అప్‌ డేట్.. ఆగస్టు నుంచి ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొత్త కోచ్‌లు!
Advertisement

Indian Railway Adds Temporary Coaches: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు మార్గాల్లో నడిచే ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా అదనపు కోచ్‌లను జోడిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రిజర్వేషన్ కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ చివరి వరకు ఈ అదనపు కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ రైల్వే ప్రకటించింది.

ఏ రైళ్లకు అదనపు కోచ్ లు యాడ్ చేస్తారంటే?

*నాగర్‌ కోయిల్–కోయంబత్తూరు సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్ (22667/22668)లో ఒక అదనపు స్లీపర్ క్లాస్ కోచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. నాగర్‌ కోయిల్ నుంచి బయలుదేరే రైళ్లలో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 29 వరకు ఈ సౌకర్యం ఉంటుంది. అలాగే, కోయంబత్తూరు నుంచి బయలుదేరే సర్వీసుల్లో జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అదనపు స్లీపర్ కోచ్ అందుబాటులో ఉంటుంది.

Advertisement

*రామేశ్వరం–తిరుపతి ఎక్స్‌ ప్రెస్ (16780/16779)లో కూడా ఒక అదనపు ఏసీ 3 టైర్ కోచ్‌ను జోడిస్తున్నారు. రామేశ్వరం నుంచి బయలుదేరే రైళ్లలో ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 29 వరకు, తిరుపతి నుంచి బయలుదేరే సర్వీసుల్లో ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ కోచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు, అలాగే రామేశ్వరానికి ప్రయాణించే వారికి ఇది ఉపయోగపడనుంది.

*అటురామేశ్వరం–కన్యాకుమారి సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్ (22621/22622)లో కూడా ఒక అదనపు ఏసీ 3-టైర్ కోచ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రామేశ్వరం నుంచి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 28 వరకు, కన్యాకుమారి నుంచి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 29 వరకు నడిచే సర్వీసుల్లో ఈ కోచ్‌ను జోడించనున్నారు.

Advertisement

*ఇక చెన్నై సెంట్రల్–తిరుపతి సప్తగిరి ఎక్స్‌ ప్రెస్ (16057/16058)లో ప్రయాణించే వారికి కూడా రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చెన్నై సెంట్రల్, తిరుపతి నుంచి నడిచే అన్ని సర్వీసుల్లో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఒక అదనపు చైర్ కార్ కోచ్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ రూట్‌లో రోజువారీ ప్రయాణికులు, ఉద్యోగులు, భక్తులకు సీట్లు లభించే అవకాశాలు పెరుగుతాయి.

రద్దీ పెరగనున్న నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం

పండుగలు, సెలవులు, భక్తుల రద్దీ వంటి కారణాలతో ఈ మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అదనపు కోచ్‌లతో వెయిటింగ్ లిస్ట్ తగ్గడంతో పాటు మరింత మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే ఈ అదనపు కోచ్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చని రైల్వే అధికారులు చెప్పారు.

Read Also: వినాయక చవితి స్పెషల్ ట్రైన్లు వచ్చేశాయి.. వెంటనే రూట్లు, డేట్లు చెక్ చేసుకోండి!

Related News

కాంక్రీట్ జంగిల్ కాదు.. పక్షుల స్వర్గధామంగా మారుతున్న భాగ్యనగరం!

వినాయక చవితి స్పెషల్ ట్రైన్లు వచ్చేశాయి.. వెంటనే రూట్లు, డేట్లు చెక్ చేసుకోండి!

జంతు ప్రేమికులకు సైతం.. వాంతు తెప్పించే జీవులు.. వరల్డ్ టాప్-5 ‘అగ్లీ’ యానిమల్స్!

వైష్ణో దేవి యాత్రికులకు గుడ్ న్యూస్.. ఏకంగా 4 కొత్త వందే భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

స్పెషల్ సర్వీసుల పొడిగింపు.. ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

డిస్నీల్యాండ్ కు పోటెత్తుతున్న టూరిస్టులు, మ్యాటర్ ఏంటో తెలుసా?

ఆకాశంలో విమానం.. రెక్కపై బుసలు కొడుతున్న పాము.. నెట్టింట వీడియో వైరల్!

Big Stories

Advertisement
×