E-Paper
Advertisement

టాయ్ ట్రైన్‌ లో ప్రయాణం, టీ టేస్టీ.. డార్జిలింగ్ అందాలకు అమెరికా రాయబారి ఫిదా!

టాయ్ ట్రైన్‌ లో ప్రయాణం, టీ టేస్టీ.. డార్జిలింగ్ అందాలకు అమెరికా రాయబారి ఫిదా!
Advertisement

US Ambassador Sergio Gor’s Darjeeling Visit: భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ డార్జిలింగ్‌లో పర్యటించారు. సెప్టెంబర్ 10న రాజ్యసభ సభ్యుడు, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లాతో కలిసి ఒక రోజు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా డార్జిలింగ్ ప్రకృతి అందాలతో పాటు అక్కడి చరిత్ర, సంస్కృతి, ఆహారం, ప్రసిద్ధ తేయాకు ప్రత్యేకతలను తెలుసుకున్నారు. శ్రింగ్లా వ్యక్తిగత ఆహ్వానం మేరకు గోర్ డార్జిలింగ్‌కు వెళ్లారు. భారత్‌లో అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఇదే తొలిసారి. డార్జిలింగ్ తనకు ఎంతగానో నచ్చిందని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మాల్ రోడ్‌ లో సందడి!

Advertisement

పర్యటనలో భాగంగా గోర్, శ్రింగ్లా కలిసి డార్జిలింగ్‌లోని ప్రసిద్ధ మాల్ రోడ్‌ను సందర్శించారు. అక్కడ స్థానిక యువత, విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు ప్రాంతంలోని జీవనశైలి, సంస్కృతి గురించి కూడా తెలుసుకున్నారు. డార్జిలింగ్ పర్యటనలో మరో ముఖ్యమైన ఆకర్షణ టాయ్ ట్రైన్. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో గోర్ ప్రయాణించారు. కొండ ప్రాంతాల మధ్య సాగే ఈ రైలు ప్రయాణం ఆయనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది.

టీ ఎస్టేట్ సందర్శన

డార్జిలింగ్‌కు వెళ్లి అక్కడి టీ రుచి చూడకుండా పర్యటన పూర్తికాదన్నట్లుగా గోర్ ప్రముఖ మకైబారి టీ ఎస్టేట్‌ను కూడా సందర్శించారు. ఇది డార్జిలింగ్‌లోని చారిత్రాత్మక తేయాకు తోటల్లో ఒకటి. అక్కడ టీ తయారీ విధానం, తేయాకు సాగు గురించి తెలుసుకున్న ఆయన డార్జిలింగ్ టీని రుచి చూశారు. తర్వాత శ్రింగ్లా నివాసమైన ఇవాన్‌హోలో ఇద్దరూ కలిసి డార్జిలింగ్ మోమో, క్యాసిల్‌ టన్ ఫస్ట్ ఫ్లష్ టీని ఆస్వాదించారు. స్థానిక రుచులను పరిచయం చేయడం ద్వారా శ్రింగ్లా తన అతిథికి డార్జిలింగ్ ప్రత్యేకతలను మరింత దగ్గరగా చూపించారు.

Advertisement

 మళ్లీ తప్పకుండా వస్తా!

డార్జిలింగ్ పర్యటనపై సెర్గియో గోర్ సోషల్ మీడియాలో స్పందించారు. భారతదేశానికి తొలిసారి వచ్చినప్పుడు తనను ఆప్యాయంగా స్వాగతించిన వారిలో హర్ష్ వర్ధన్ శ్రింగ్లా కూడా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఆయన డార్జిలింగ్‌లోని తన ఇంటికి రావాలని ఆహ్వానించారని తెలిపారు. చివరకు ఆ ఆహ్వానం నెరవేరిందని, దేశంలోని అత్యంత అందమైన ప్రాంతాల్లో ఒకటైన డార్జిలింగ్‌లో శ్రింగ్లాతో కలిసి రోజంతా గడపడం ఆనందంగా ఉందని గోర్ పేర్కొన్నారు. డార్జిలింగ్ ప్రజల ఆతిథ్యం, చరిత్ర, ప్రకృతి అందాలు, ఆహారం తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. అవకాశం దొరికితే మళ్లీ ఇక్కడికి వస్తానని కూడా తెలిపారు.

ఈ పర్యటన కేవలం ఒక పర్యాటక సందర్శనకే పరిమితం కాలేదు. డార్జిలింగ్ ప్రజలు, స్థానిక సంస్కృతి, దేశంలోని భిన్న ప్రాంతాల ప్రత్యేకతలను అమెరికా రాయబారికి పరిచయం చేసే అవకాశం కూడా లభించింది. గోర్ పర్యటనతో భారత్-అమెరికా సంబంధాలు కేవలం దౌత్య చర్చలు, అధికారిక సమావేశాలకే పరిమితం కాకుండా దేశంలోని ప్రాంతీయ సంస్కృతులు, ప్రజలతోనూ మరింత దగ్గరవుతున్నాయనే సందేశం వెళ్లిందని శ్రింగ్లా చెప్పుకొచ్చారు.

Read Also: రైలు టికెట్ల కోసం పోటెత్తిన జనం.. IRCTC కొత్త రికార్డు!

Tags

Related News

కాన్వాయ్ వద్దని.. రైలు ఎక్కిన ఆస్ట్రేలియా హైకమిషనర్, నెట్టింట వీడియో వైరల్!

రైలు టికెట్ల కోసం పోటెత్తిన జనం.. IRCTC కొత్త రికార్డు!

కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ వందేభారత్‌ సహా 9 రైళ్లు రీషెడ్యూల్!

అర్జెంటీనాలో అకస్మాత్తుగా మాయమైన సముద్రం? అసలు కారణం ఇదేనట!

ఒక్క రోజే 20 లక్షలకు పైగా రైలు టికెట్ల బుకింగ్.. ఐఆర్‌సీటీసీ కొత్త రికార్డు

మీ రైలు ఎక్కడుంది? కోచ్ ఏ చోట ఆగుతుంది? ఈ యాప్‌ తో ఈజీగా తెలుసుకోవచ్చు!

ఇండియన్ బుల్లెట్ ట్రైన్ ట్రయల్స్ డేట్ ఫిక్స్.. ఇక హైస్పీడ్ జర్నీకి రెడీ!

Big Stories

Advertisement
×