E-Paper
Advertisement

Google – YouTube AI: గూగుల్ నుంచి అదిరిపోయే అప్ డేట్, ఇక ఫోటోలు కూడా వీడియోలు అయిపోతాయ్!

Google – YouTube AI: గూగుల్ నుంచి అదిరిపోయే అప్ డేట్, ఇక ఫోటోలు కూడా వీడియోలు అయిపోతాయ్!
Advertisement

Goodle New Generative AI Tools: గూగుల్ రీసెంట్ గా జెమినిలో ఫోటో-టు-వీడియో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో మ్యూజిక్ తో కూడిన 8 సెకెన్ల వీడియో క్లిప్ ను రూపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు, ఈ ఫీచర్ ను గూగుల్ ఫోటోస్ తో పాటు యూట్యూబ్ కు వర్తించేలా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీడియో జనరేషన్ మోడల్, Veo 2  సపోర్టు చేస్తుంది. అంతేకాదు, గూగుల్ రెండు ప్లాట్‌ ఫామ్‌ లకు సరిపడేలా క్రియేటివ్ జనరేటివ్ AI టూల్స్ ను పరిచయం చేస్తోంది. యూజర్లు మరింత అద్భుతంగా వీడియోలను క్రియేట్ చేయడానికి ఈ టూల్స్ ఉపయోగపడనున్నాయి.

ఫోటో-టు-వీడియో ఫీచర్‌ తో బోలెడు లాభాలు

Advertisement

ఫోటో-టు-వీడియో ఫీచర్‌ తో పాటు గూగుల్ ఫోటోస్ కొత్త రీమిక్స్ ఫీచర్‌ ను కూడా కలిగి ఉంటుంది. ఈ టూల్స్ సాయంతోయూజర్లు తమ ఫోటోలను స్కెచ్, కామిక్ శైలిలో యానిమేటెడ్ వీడియోలను రూపొందించుకోవచ్చు. అంతేకాదు,  యాప్‌ లో కొత్త క్రియేట్ ట్యాబ్ ఉంటుంది. దీని నుంచి వినియోగదారులు  తమ ఫోటోలను ఏఐ టూల్స్ తో డిఫరెంట్ గా రూపొందించుకోవచ్చు. ఈ ఏఐ టూల్స్ ను ఆండ్రాయిడ్ తో పాటు ఐవోఎస్ వినియోగదారులూ ఫోటోస్, యూట్యూబ్ లో యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది.  యూట్యూబ్ యాప్‌లో ‘జనరేటివ్ ఎఫెక్ట్స్’ అనే కొత్త వీడియో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇవి ఏఐ ప్లే గ్రౌండ్‌ లో క్రియేషన్ టూల్స్‌ తో కూడా వస్తాయి.

గూగుల్ ఫోటోస్ లో కొత్త జనరేటివ్ AI ఫీచర్లు

Advertisement

గూగుల్ ఫోటోలకు ఫోటో టు వీడియో కెపాసిటీని అందుబాటులోకి తీసుకొస్తుంది. యూజర్లు స్టిల్ ఫోటోల నుంచి చిన్న వీడియోలను క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ Veo 2 మోడల్ ద్వారా ఫోటోలకు సాఫ్ట్ యానిమేషన్లు, మూవింగ్స్ తీసుకురావానికి అనుమతిస్తుంది. ఇందుకోసం యూజర్లు ఫోటో గ్యాలరీ నుంచి ఒక ఫోటోను అప్‌ లోడ్ చేసి, రెండు ప్రాంప్ట్‌ లలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ టూల్ ఆరు సెకన్ల వీడియో క్లిప్‌ను అందిస్తుంది. దీనిని సేవ్ చేసుకుని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కు పంపుకునే అవకాశం ఉంది.

Read Also: ఐఫోన్ 17 ఎయిర్ వచ్చేస్తోంది, ఇండియాలో విడుదల ఎప్పుడంటే?

యూట్యూబ్ లో కొత్త జనరేటివ్ AI ఫీచర్లు  

గూగుల్ ఫోటోస్ మాదిరిగానే యూట్యూబ్ కు కూడా ఫోటో టు వీడియో ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు  స్టిల్ ఫోటోలకు జీవం పోయవచ్చు. “ఫోటో టు వీడియోతో మీరు ల్యాండ్‌ స్కేప్ ఫోటోలకు మూవింగ్స్ ను జోడించవచ్చు. రోజువారీ ఫోటోలను యానిమేట్ చేయవచ్చు, గ్రూప్ ఫోటోలకు జీవం పోయవచ్చు” అని గూగుల్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ లో అందుబాటులోకి వస్తోంది. త్వరలో మరిన్ని దేశాల్లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేలా గూగూల్ ప్రయత్నిస్తోంది.

Read Also: మార్కెట్లోకి టాటా నానో ఈవీ ఎంట్రీ, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే, ధర ఎంతో తెలుసా?

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×