టాటా నానో పెద్దగా పరిచయం అవసరం లేదు. టాటా సన్స్ అధినేత దిగవంత రతన్ టాటా కలల స్వప్నం. దేశంలోని పేదలు కూడా కారును వాడాలనే సంకల్పంతో ఈ కారును అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ. లక్షకే అందరికీ అందివ్వాలి అనుకున్నారు. అనుకున్నట్లుగానే కారును మార్కెట్లోకి తీసుకొచ్చారు. కానీ, ఆ స్థాయిలో ప్రజాదరణ దక్కించుకోలేదు. కొంతకాలం తర్వాత టాటా నానో మార్కెట్లో నుంచి కనిపించకుండాపోయింది. ఇప్పుడు టాటా నానోను తిరిగి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. గతంలో మాదిరిగా పెట్రో వెర్సన్ లో కాకుండా ఎలక్ట్రికల్ వెర్షన్ లో పరిచయం చేయబోతోంది. టాటా నానో EV సరసమైనది, పర్యావరణ అనుకూలమైనది, నగర డ్రైవింగ్‌కు సరైనదిగా ఉండబోతోంది. ఈ చిన్న కారు ఎలక్ట్రిక్ అవతార్ లో ఎన్ని ప్రత్యేకతలను కలిగి ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
టాటా నానో EV నుంచి ఏం ఆశింవచ్చు?
టాటా నానో EV చిన్నదైనా, సమర్థవంతమైన ఎలక్ట్రిక్ మోటార్ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది నగర ప్రయాణాలకు అనువైనది ఉంటుంది. తాజా నివేదికల ప్రకారం ఒక ఛార్జ్ మీద దాదాపు 150 నుండి 200 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని భావిస్తున్నారు. దీన్ని ఛార్జ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది హోమ్ ఛార్జింగ్ సెటప్ తో పాటు వేగవంతమైన ఛార్జింగ్ ఆప్షన్ కు సపోర్టు చేస్తుంది.
సరికొత్త డిజైన్ తో మరింత ఆకర్షణీయంగా..
టాటా నానో అందరికి పరిచయమే అయినప్పటికీ, కొత్త కారు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అందమైన, కాంపాక్ట్ లుక్ ను ఉంచినప్పటికీ, కొన్ఇన అప్ గ్రేడ్ లు ఉంటాయని భావిస్తున్నారు. సొగసైన హెడ్‌లైట్లు, రిఫ్రెష్ ఫ్రంట్ గ్రిల్, లోపల ఆధునిక డిజిటల్ డాష్ బోర్డ్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడానికి లేటెస్ట్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కారును చిన్నగా, పార్క్ చేయడానికి సులభంగా ఉండేలా డిజైన్ చేశారు.
సరసమైన ధరలో..
టాటా నానో EV అతిపెద్ద ఆకర్షణలలో ఒకటి ధర. టాటా మోటార్స్ సరసమైన కార్లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. నానో EV దేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా మారవచ్చని భావిస్తున్నారు. డబ్బు ఖర్చు చేయకుండా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారాలనుకునే వారికి గేమ్-ఛేంజర్ అవుతుంది. కచ్చితమైన ధర నిర్ధారించబడనప్పటికీ, ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి కావచ్చు. బహుశా ₹4 లక్షల నుంచి ₹6 లక్షల మధ్య ధర ఉంటుందని భావిస్తున్నారు.
Read Also: బడ్జెట్ రేట్ లో సూపర్ స్మార్ట్ ఫోన్, Realme C71 5G ట్రై చేయండి!
టాటా నానో EV ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఈ కారుకు సంబంధించిన అధికారిక లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. కానీ, కంపెనీ తన EV లైనప్ ను విస్తరిస్తున్నందున రాబోయే రెండు సంవత్సరాలలో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Read Also: ఐఫోన్ 17 ఎయిర్ వచ్చేస్తోంది, ఇండియాలో విడుదల ఎప్పుడంటే?