Fahadh Faasil:విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil). పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. మలయాళ నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫహద్ ఫాజిల్.. అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా ఈయనతో కలిసి నటించడానికి త్రిష (Trisha ), అలియాభట్ (Alia Bhatt) లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు అంటే ఇక ఆయన నటన సెలెబ్రిటీలను ఏ రేంజ్ లో మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు.
పేరుకే కీప్యాడ్.. అసలు ధర తెలిస్తే గుండె గుబేల్..
ఇకపోతే ఒక్కో సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈయన.. ఇటీవల కీప్యాడ్ ఫోన్ తో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇది చూసిన ఆడియన్స్.. కీప్యాడ్ ఫోన్ వాడడం ఏంటి ? అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత దాని ధర తెలిసి విస్తుపోయారు. ఇది పేరుకే కీప్యాడ్ ఫోన్ అయినా దాని ధర అక్షరాల రూ.10 లక్షలు. ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందింది. ‘వెర్టు’ అనే బ్రాండ్ కు చెందిన లగ్జరీ ఫోన్ ఇది. ఎందుకంత ప్రత్యేకత అంటే దీనిని పూర్తిగా చేతితోనే తయారు చేస్తారట. అంతేకాదు సెలబ్రిటీలకు.. రాయల్టీ మైంటైన్ చేసే వారికి.. ఎక్కువ నికర ఆస్తులు ఉన్న వారి కోసం మాత్రమే ఈ ఫోన్లను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇలా కీప్యాడ్ ఫోన్ ను వాడుతూ.. దాని ధరతో కూడా అందర్నీ ఆశ్చర్యపరిచారు ఫహద్ ఫాజిల్.
‘మారీశన్’ ప్రమోషన్స్ లో అసలు విషయం చెప్పిన ఫహద్..
ఇకపోతే ధర ఓకే కానీ అత్యాధునిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడకం లేనిదే పూట గడవదు. ఇలాంటి జనరేషన్లో కూడా ఈయన కీప్యాడ్ వాడడం ఏంటి అంటూ అందరూ పలు అనుమానాలు వ్యక్తం చేయగా.. అసలు విషయాన్నీ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా ఫహద్ ఫాజిల్ మలయాళం లో వడివేలుతో కలిసి నటించిన కామెడీ థ్రిల్లర్ మూవీ ‘మారీశన్’.. ఈనెల 25వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన కీప్యాడ్ ఫోన్ వాడకంపై స్పందించారు.
అందుకే కీప్యాడ్ ఫోన్ వాడుతున్నాను – ఫహద్ ఫాజిల్
ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ.. “గత ఏడాదికాలంగా నేను ఈ సాధారణ మొబైల్ ని వాడుతున్నాను. నాకు వాట్స్అప్ లేదు. సినిమా స్టోరీలకు సంబంధించి ఈమెయిల్ తోనే కాంటాక్ట్ అవుతూ ఉంటాను. ఒకప్పుడు సోషల్ మీడియా వినియోగించే వాడిని. అది కూడా కెరియర్ అప్డేట్ కోసం మాత్రమే.. నేను మంచి సినిమాలు అందిస్తున్న కారణంగా ఇప్పటి జనరేషన్ కి దూరమయ్యాను అనే ఆలోచన కూడా లేదు ” అంటూ తెలిపారు.
కీప్యాడ్ వాడకంపై ఫహద్ రియాక్షన్.. నెటిజన్స్ కామెంట్స్..
ఇక ఫహద్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. కీప్యాడ్ వాడకంపై నీ రియాక్షన్ అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి కొంతమంది సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే మీరు ఇలాంటి మొబైల్ వాడుతున్నారు కదా.. నిజంగా మీ వాడకం మామూలుగా లేదుగా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.. మొత్తానికైతే ఫహద్ ఫాజిల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.