Watch Funny Video: సోషల్ మీడియాలో బోలెడు వింత వీడియోలు దర్శనం ఇస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో అంత వైరల్ కావడానికి కారణం ఏంటంట.. అందులో ఓ సింహం ఆకు కూర తింటూ కనిపించింది. మీరూ నిజంగా షాకయ్యారు కదా.. అవును మీరు విన్నది నిజమే. సింహం ఆకు కూర రుచి చూసిన వీడియో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది.
మాంసాహారం నుంచి శాకాహారానికి షిఫ్ట్ అయిన సింహం
అడవికి రాజు అయిన మృగరాజు.. వేటాడి, వేడి వేడి మాంసాన్ని తినడం మనందరికీ తెలుసు. కుందేళ్లు, జింకలు, అడవి దున్నలు, మొసళ్లు సహా పలు జంతువులను సింహం వేటాడి, వెంటాడి పట్టుకుని హాయిగా మాంసాన్ని తినేస్తుంది. కానీ, తాజాగా వీడియోలో సదరు సింహం ఆకు కూరలను నోటితో కొరికి రుచి చూసింది. అయితే, దాని రుచి నచ్చకపోవడంతో ఛీత్కరించుకుంది. తాను తినాల్సి ఫుడ్ కాదని డిసైడ్ అయ్యింది. ముఖం అంతా అదోలా పెట్టుకుంది. “ఈ సింహ ఆకుకూరను కొరికి చూసి, జీవితంలో చేసిన తొలి తప్పుగా భావించింది. దాని ముఖం చూస్తే, ఎంత తప్పు చేసిందో అనేలా ఫీలవుతుంది. కచ్చితంగా అది కోరకున్న ఆహారం మాత్రం కాదని ఫీలవుతోంది” అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఫన్నీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “ఈ వీడియోను చూసి నేర్చు పాఠం.. రాజులు సలాడ్లు తినరు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మాంసాహారికి శాకాహారం అందించడం నిజంగా జంతువులను బాధపెట్టడమే అవుతుందని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. చాలా మంది నెటిజన్లు కూడా సింహం తప్పును చూసి జోకులు వేసుకుంటున్నారు. “ఈ సింహం శాకాహారిలా ఉందే, ఆకు కూరలను ఇష్టపడుతోంది” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “బహుశ మృగరాజుకు శాకాహారం రుచి విషంలా అనిపించినట్లు ఉంది. అందుకే ముఖం అయ్యింది. ఇది తినాల్సిన ఫుడ్ కాదని భావించింది” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
Read Also: 6 నిమిషాలు.. చీకటి గుప్పిట్లో ప్రపంచం, ఆగష్టు 2న ఏం జరగబోతోందంటే?
“శ్రావణమాసం కావడం వల్ల మృగరాజు కూడా మాంసాహారానికి దూరంగా ఉంటూ శాకాహారం తింటున్నట్లు కనపిస్తోంది” అని మరో వ్యక్తి జోక్ చేశాడు. “డాక్టర్ తన ఫేషెండ్ తో ఆహారాన్ని మార్చుకోవాలని చెప్పినప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు ఫుల్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: ఓర్నీ.. ఉద్యోగుల కోసం చీర్ లీడర్స్.. చైనా కంపెనీ ప్రయోగం అదుర్స్!