E-Paper
Advertisement

చలికాలంలో వెచ్చని వాతావరణం కావాలా?.. వింటర్ వెకేషన్‌కు ఈ 5 ప్రదేశాలు బెస్ట్

చలికాలంలో వెచ్చని వాతావరణం కావాలా?.. వింటర్ వెకేషన్‌కు ఈ 5 ప్రదేశాలు బెస్ట్
Advertisement

Warm places To visit In winter| చలిలో వణుకుతూ తిరగడం కంటే వెచ్చని ఎండలో బీచ్‌ల దగ్గర ప్రశాంతంగా గడపడం ఇష్టం. అలాంటి వారి కోసం మన దేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందమైన సముద్ర తీరాలు, చారిత్రక కట్టడాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆకట్టుకునే ఈ 5 ప్రదేశాలు మీ వింటర్ వెకేషన్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.

1. గోవా.. అందమైన బీచ్‌లో ఎండ

శీతాకాలంలో వెచ్చని వాతావరణాన్ని కోరుకునేవారికి గోవా మంచి ఆప్షన్. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడ పర్యటించడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. బాగా సందడి చేసే బాగా, కలంగుట్ బీచ్‌లతో పాటు ప్రశాంతమైన పాలొలెమ్, అంజునా బీచ్‌లను కూడా సందర్శించవచ్చు. వాటర్ స్పోర్ట్స్‌లో పాల్గొనడం, సముద్ర తీరంలో సేదతీరడం, సూర్యాస్తమయాలను చూడటం వంటివి ఎంజాయ్ చేయవచ్చు.

2. కేరళ వర్కలా.. సముద్ర అందాలు అదరహో

Advertisement

కేరళలోని వర్కలా ప్రకృతి ప్రేమికులకు మంచి పర్యాటక ప్రాంతం. ఇక్కడి ఎత్తైన కొండచరియల నుంచి అరేబియా సముద్ర అందాలను చూడవచ్చు. నార్త్ క్లిఫ్, సౌత్ క్లిఫ్ ప్రాంతాల్లో అందమైన కేఫ్‌లు, రుచికరమైన ఫుడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బీచ్‌లో సేదతీరుతూ సూర్యాస్తమయాన్ని చూడటం మంచి ఫీలింగ్ ఇస్తుంది.

3. అండమాన్‌.. నీలి సముద్రం, తెల్లని ఇసుక తీరాలు ప్రత్యేక ఆకర్షణ

సముద్ర అందాలను ఇష్టపడేవారికి అండమాన్ దీవులు అద్భుతమైన గమ్యస్థానం. హేవ్‌లాక్, నీల్ ఐలాండ్స్ పర్యాటకులు ఎంతగానో ఆకర్షిస్తాయి. ముఖ్యంగా రాధానగర్ బీచ్ అందాలు చూడదగినవి. స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ వంటి వాటర్ యాక్టివిటీస్‌ చేయండి. అయితే ఇక్కడికి వెళ్లే ముందు ప్రయాణం, వసతి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి.

Advertisement

Also Read: పెళ్లిరోజు రాత్రి మహారాణికి జరిగిన అవమానం..ఉదయ్‌పూర్ ‘రూఠీ రాణి మహల్’ ఆసక్తికర కథ

4. హంపి.. చారిత్రక కట్టడాలు

బీచ్‌ల కంటే చరిత్రపై ఆసక్తి ఉన్నవారు కర్ణాటకలోని హంపిని సందర్శించండి. ఇక్కడి విరూపాక్ష ఆలయం, విఠల దేవాఆలయం చాలా ఫేమస్. రాయితో చేసిన అద్భుతమైన రథం, మతంగ కొండ కూడా తప్పక చూడాల్సిన ప్రదేశాలు. పురాతన కట్టడాలు, భారీ రాతి నిర్మాణాలు చరిత్ర ప్రేమికులను ఆకట్టుకుంటాయి.

5. పుదుచ్చేరిలో ఫ్రెంచ్ అందాలు

ఫ్రెంచ్ తరహా నిర్మాణాలు, అందమైన వీధులు, ప్రశాంతమైన బీచ్‌లకు పుదుచ్చేరి ప్రసిద్ధి. ఇక్కడ ప్రొమెనేడ్ బీచ్, పారడైజ్ బీచ్, సెరినిటీ బీచ్‌లు చూడండి. ఫ్రెంచ్ క్వార్టర్‌లోని పసుపు, తెలుపు రంగుల భవనాలు ఫొటోలు దిగడానికి బాగుంటాయి. సమయం ఉంటే ఆరోవిల్‌ను కూడా సందర్శించండి.

Also Read: ఒంటరిగా ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ఇండియాలో 7 అద్భుతమైన ప్రాంతాలు.. మహిళలకు కూడా సేఫ్

చలికి దూరంగా ఇలా వింటర్ వెకేషన్ ప్లాన్ చేసుకోండి

ఈ చలికాలంలో చలిని తట్టుకుంటూ ఉండటం ఇష్టం లేకపోతే ఈ 5 ప్రదేశాల్లో నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోండి. ముందుగానే ప్రయాణం, వసతి ఏర్పాట్లు చేసుకుంటే మీ వింటర్ వెకేషన్‌ను హాయిగా ఆస్వాదించండి.

Related News

వందే భారత్‌లో క్యాష్ బ్యాగ్ మరిచిపోయిన ఫారినర్.. రైల్వే సిబ్బంది ఏం చేశారంటే?

రీల్స్ కోసం రైలు ఎక్కాడు.. కరెంట్ తగిలి కాలిపోయాడు!

వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఇక నాలుగు రకాల వంటకాలే.. ఎందుకంటే?

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి కొల్లంకు స్పెషల్ ట్రైన్!

అయోధ్య-జనక్‌పూర్ మధ్య నేరుగా రైలు.. మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేతుల మీదుగా ప్రారంభం!

ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. కాళ్లపై పడి వేడుకున్నా కనికరించని అధికారులు.. వైరల్ వీడియో!

ఒంటరిగా ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ఇండియాలో 7 అద్భుతమైన ప్రాంతాలు.. మహిళలకు కూడా సేఫ్

Big Stories

Advertisement
×