Srinu Vaitla:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న మహేష్ బాబు (Mahesh Babu) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన.. తన స్టార్డంతో పాన్ ఇండియా స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. అటు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. సరే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు రాబట్టగలిగే స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ‘ఎస్ఎస్ఎంబి – 29’ అనే వర్కింగ్ టైటిల్ తో ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల కావడానికి మరో రెండు సంవత్సరాల సమయం పట్టేటట్టు కనిపిస్తోంది.
భారీ అంచనాలు.. కానీ ఆగడు ఫ్లాప్..
ఇకపోతే క్లాస్, మాస్ చిత్రాలతో తిరుగులేని హీరోగా పేరు సొంతం చేసుకున్న మహేష్ బాబుకి ఓవర్ మాస్ అనేది సెట్ అవ్వదని, రియలైజ్ అయ్యామని డైరెక్టర్ శ్రీనువైట్ల (Director Srinu Vaitla) కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ‘ఆగడు’ సినిమా డిజాస్టర్ అవ్వడానికి గల కారణాలు కూడా తెలిపారు. అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ఆగడు’. ‘దూకుడు’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చేసిన చిత్రం కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
అటు ట్రైలర్, పాటలు, మహేష్ బాబు డైలాగ్స్ , కామెడీ ఇలా అన్నీ కూడా అంచనాలు సృష్టించాయి. ఇక 2014లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది. ఇక ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి మహేష్ బాబు ఫ్యాన్స్ కారణమని నిర్మాత సి. కళ్యాణ్ అప్పట్లో కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకసారి ఈ సినిమా డిజాస్టర్ పై డైరెక్టర్ శ్రీనువైట్ల స్పందించారు.
మహేష్ కి ఆ పాత్ర సెట్ అవ్వదని అప్పుడే రియలైజ్ అయ్యాం – శ్రీను వైట్ల
మంచు విష్ణు ఢీ సినిమా రీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనువైట్ల ఆగడు సినిమా గురించి మాట్లాడుతూ.. “మహేష్ బాబును మాసీగా ప్రజెంట్ చేయాలని ఉద్దేశంతోనే కొంచెం నేను ఓవర్డోస్ పెంచాను. అందులో ఇంకా కొంచెం ఎక్కువ మాస్ కి వెళ్ళిపోయాము. దూకుడులో క్యారెక్టర్ చాలా సెటిల్ గా ఉంటుంది. కానీ ఆగడు లో మాత్రం చాలా లౌడ్ గా ఉంటుంది. రూరల్ లో మహేష్ బాబును ప్రజెంట్ చేయాలని ఆలోచన చేశాను.కానీ అది వర్కౌట్ కాలేదు.
పైగా దూకుడు, బాద్షా సినిమాల తర్వాత నా మీద అంచనాలు ఎక్కువగా ఉండడం.. అటు అనుకోకుండా దూకుడు కాంబినేషన్ రిపీట్ అవ్వడం వంటి కారణాలవల్ల అంచనాలను అందుకోలేకపోయామేమో అని అనిపించింది. ఒక రకంగా చెప్పాలి అంటే మహేష్ బాబుకు అంత మాస్ సెట్ అవ్వదని, అప్పుడు రియలైజ్ అయ్యాము”.. అంటూ తెలిపారు శ్రీనువైట్ల.
ALSO READ:NTR Dammu Movie: ‘షోలే’లో అమితాబ్ లాంటి పాత్ర అన్నారు.. దెబ్బకు కెరీర్ క్లోజ్, వేణు అసహనం