Thug Life Collection: కన్నడ భాషా వివాదం కమల్ హాసన్ (Kamal Haasan) ‘థగ్ లైఫ్’ మూవీని దెబ్బ కొట్టిందా? అంటే దెబ్బ కొట్టిందనే అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు.. ఎందుకంటే భారీ అంచనాలతో విడుదలైన థగ్ లైఫ్ మూవీకి మొదటి రోజు అనుకున్న దాని కంటే తక్కువ వసూళ్లు రావడంతో చాలామంది కమల్ హాసన్ తప్పు చేశారు అనే భావనలో మునిగిపోయారు. కన్నడ భాష తమిళం నుండి పుట్టింది అని చెప్పి వివాదానికి తెర లేపి క్షమాపణలు చెప్పమని కోరినా కూడా వినకుండా తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్లి కన్నడ ఇండస్ట్రీలో సినిమాని విడుదల కాకుండా చేసుకున్నారు. ఫలితంగా కన్నడలో సినిమా విడుదల కాకపోవడంతో ఈ సినిమాకి భారీ దెబ్బ తగిలింది. మరి థగ్ లైఫ్ ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో వచ్చాయి. అనేది ఇప్పుడు చూద్దాం..
థగ్ లైఫ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..
మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్, త్రిష (Trisha), శింబు(Simbu), ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించిన థగ్ లైఫ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న విడుదలైంది. రూ.225 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా రూ.210 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయిందని ట్రేడ్ పండితులు చెప్పారు. ఇక ఈ సినిమా ఏపీ, నైజాం లో కలిసి రూ.5కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.2 నుండి రూ.3 కోట్ల గ్రాస్, తమిళంలో ఏకంగా రూ.15 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసింది. అయితే ఈ సినిమా అడ్వాన్స్డ్ బుకింగ్స్ లో దాదాపు రూ.13.89 కోట్ల నికర వసూలు రాబట్టిందని ఓ నివేదిక పేర్కొంది.
మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన మణిరత్నం..
ఇక థగ్ లైఫ్ మూవీ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఏకంగా రూ.35 నుండి రూ.40 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కమల్ హాసన్ ఇంతకుముందు నటించిన సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే చాలా తక్కువ అంటున్నారు సినీ విశేషకులు. ఎందుకంటే భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన కమల్ హాసన్ ఇండియన్ 2, విక్రమ్ వంటి సినిమాలు తక్కువ బడ్జెట్ తో వచ్చి మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ కన్నడ భాష వివాదంలో చిక్కుకోక పోయి ఉంటే థగ్ లైఫ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువగా ఉండేవని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కమల్ హాసన్ నోటి దూల కారణంగా నిర్మాతలకు కలెక్షన్స్ విషయంలో భారీ షాక్ అయితే తగిలింది. ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మణిరత్నం తన మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారు. ఈ విషయాలు కూడా అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.
also read:Shazahn Padamsee: ఘనంగా రామ్ చరణ్ బ్యూటీ పెళ్లి.. ఫొటోస్ వైరల్!