Indian Railways Refund Rules: దేశ వ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది రైల్వే ప్రయాణం చేస్తారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది రైల్వే ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఫుడ్ నుంచి వాష్ రూమ్ సౌకర్యం వరకు అన్ని వసతులు ఉండటంతో హ్యాపీగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. రైల్వే ప్రయాణం కోసం చాలా మంది ముందగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. కొంత మంది ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే.. మరికొంత మంది రైల్వే స్టేషన్ కౌంటర్లలో టికెట్లు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అనివార్య కారణాలతో ప్రయాణాలు రద్దు అవుతాయి. లేదంటే, వాయిదా పడతాయి. ఆ సమయంలో టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారు. అయితే, రైలు బయల్దేరే సమయాన్ని బట్టి డబ్బులు రీఫండ్ అయ్యే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో రీఫండ్ అనేది ఉండదు. కానీ, కొన్ని సమయాల్లో పూర్తి స్థాయిలో రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
పూర్తి స్థాయి రీఫండ్ ఎప్పుడు వస్తుందంటే?
కొన్నిసార్లు రైళ్లు పలు కారణాలతో ఆలస్యంగా నడుస్తాయి. మరికొన్ని సందర్భాల్లో రైళ్లు రద్దు అవుతాయి. ఇండియన్ రైల్వే టికెట్ రీఫండ్ రూల్స్ ప్రకారం రైలు 3 గంటలు, అంతకంటే ఎక్కువు ఆలస్యం అయితే, పూర్తి మొత్తాన్ని రీఫండ్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైలు రద్దయినా కూడా పూర్తి మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే, ప్రయాణీకుడు టీడీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతడి అకౌంట్ లోకి రీఫండ్ వస్తుంది.
Read Also: ఇక ట్రైన్ టికెట్ పై పేరు, డేట్ మార్చుకోవచ్చు, కొత్త రూల్ తెచ్చిన ఇండియన్ రైల్వే
టీడీఆర్ ను ఎలా ఫైల్ చేయాలంటే?
టీడీఆర్ ఫైల్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది..
⦿ రైలు 3 గంటలు, అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే, మీరు టీడీఆర్ ను ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పూర్తి మొత్తంలో అమౌంట్ పొందే అవకాశం ఉంటుంది.
⦿ ముందుగా మీరు IRCTC అధికారిక వెబ్ సైట్ https://www.irctc.co.in/nget/train లోకి వెళ్లాలి.
⦿ వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఐడీ, పాస్ వర్డ్ సాయంతో లాగిన్ కావాలి.
⦿ ఆ తర్వాత ‘మై అకౌంట్’ సెక్షన్ లోకి వెళ్లి ‘మై ట్రాన్సాక్షన్’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
⦿ అనంతరం ‘ఫైల్ టీడీఆర్’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
⦿ అప్పుడు మీరు బుక్ చేసుకున్న టికెట్ వివరాలు వస్తాయి.
⦿ ఆ తర్వాత రీఫండ్ క్లెయిమ్ ను రిక్వెస్ట్ చేయాలి.
⦿ రైల్వే సంస్థ మీ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ అకౌంట్ లోకి డబ్బులు తిరిగి వస్తాయి.
ఆఫ్ లైన్ ద్వారా టికెట్ రీఫండ్ పొందేందుకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్లి టీడీఆర్ ఫారమ్ నింపి అక్కడి అధికారులకు సమర్పించాలి. వాళ్లు మీకు రీఫండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
Read Also: అరకు అందాలు చూడాలనుకుంటున్నారా? అద్దాల కోచ్ వచ్చేస్తోంది!