BigTV English
Advertisement

3D Printed Train Station: జపాన్ 6 గంటల్లో 3D-ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ను ఎలా నిర్మించింది!

3D Printed Train Station: జపాన్ 6 గంటల్లో 3D-ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ను ఎలా నిర్మించింది!

ప్రపంచంలోనే తొలిసారి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ను నిర్మించింది జపాన్. కేవలం 6 గంటల్లో 108 చదరపు అడుగులు విస్తీర్ణంలో దీనిని నిర్మించింది. జపాన్‌లో జనాభా పరంగా మూడో అతిపెద్ద నగరమైన ఒసాకా నుంచి 60 మైళ్ల దూరంలోని దక్షిణ వకయామ ప్రావిన్స్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించారు. ఈ స్టేషన్ ను వెస్ట్‌ జపాన్‌ రైల్వే(జేఆర్‌ వెస్ట్‌) సంస్థ నిర్మించింది.


పాత స్టేషన్ ను కూల్చేసి కొత్త స్టేషన్ ఏర్పాటు

ఇప్పటి వరకు ఇక్కడ ఇక్కడ చెక్కతో నిర్మించిన రైల్వే కాంప్లెక్స్ ఉండేది. గతం వచ్చిన తీవ్ర తుఫాన్ ధాటికి ఆ రైల్వే స్టేషన్ చాలా వరకు ధ్వంసం అయ్యింది. ప్రయాణీకుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త రైల్వే స్టేషన్ ను నిర్మించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. సెరెండిక్స్ అనే నిర్మాణ సంస్థ సహకారంతో వెస్ట్ జపాన్ రైల్వే సంస్థ ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించింది.


3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో నిర్మాణం

సెరెండిక్స్ అనే నిర్మాణ సంస్థకు 3D ప్రింటింగ్ టెక్నాలజీలో మంచి అనుభవం ఉంది. ఈ కొత్త టెక్నాలజీ సాయంతో కేవలం 6 గంటల్లోనే ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించారు అధికారులు. వాస్తవానికి జపాన్ లో ప్రస్తుతం పని చేసే సామర్థ్యం కలిగిన యువత సంఖ్య తగ్గుతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా నిర్మాణాలను సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, శ్రామిక శక్తిని తక్కువగా ఉపయోగించుకుంటూ పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే 3D టెక్నాలజీపై అక్కడి ప్రభుత్వం బాగా ఫోకస్ పెట్టింది. ఈ సాంకేతికతతో తక్కువ మంది కార్మికులతో గంటల వ్యవధిలోనే పెద్ద పెద్ద నిర్మాణాలను చేపట్టే అవకాశం ఉంటుంది.

ఇంతకీ 3D టెక్నాలజీ అంటే ఏంటి?

3D టెక్నాలజీ ప్రకారం ఆయా నిర్మాణాలకు సంబంధించిన విడి భాగాలను ముందుగానే తయారు చేస్తారు. వాటన్నింటిని నిర్మాణ స్థానికి తీసుకెళ్తారు. ఒకదానిపై మరొకదాన్ని జాగ్రత్తగా కూర్చోబెట్టి బిగిస్తారు. గంటల వ్యవధిలోనే నిర్మాణాలను పూర్తి చేస్తారు. ఆయా విడి భాగాల డిజైన్, తయారీ అనేది కాస్త శ్రమతో కూడిన వ్యవహారం. అయినప్పటికీ సంప్రదాయ పద్దతిలో కంటే చాలా ఈజీ. ఈ ప్రాజెక్టు సంబంధించి వెస్ట్ జపాన్ రైల్వేతో కలిసి సెరెండిక్స్ సంస్థ, విడి భాగాలను ముద్రించడం, వాటిని కాంక్రీటుతో తయారు చేయడానికి కేవలం ఏడు రోజుల సమయం తీసుకుంది.  ఈ రైల్వే స్టేషన్ సంప్రదాయ పద్దతిలో నిర్మిస్తే రెండు నెలలకు పైగా సమయం పట్టేది. కానీ 3D టెక్నాలజీ సాయంతో కేవలం 6 గంటల్లోనే కొత్త స్టేషన్ ను నిర్మించారు. నిర్మాణ వ్యయం కూడా సంప్రదాయ పద్దతితో పోల్చితే ఈ టెక్నాలజీతో సుమారు రెండు రెట్లు తగ్గినట్ల  వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ అధికారులు తెలిపారు.

Read Also: సముద్రం పక్క నుంచి వెళ్లే ఈ రైల్ రూట్స్ ఇండియాలో ఎక్కడున్నాయో తెలుసా?

కీలక పర్యాటక ప్రదేశాలను కలుపుతూ..    

ఇక ఈ రైల్వే స్టేషన్ రెండు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలైన ఒసాకా, నారా ప్రిఫెక్చర్లకు సరిహద్దులో ఉంటుంది. గంటకు సుమారు మూడు రైళ్లు ఇక్కడి నుంచి నడుస్తాయి. రోజుకు 530 మందికి పైగా ప్రయాణీకులు ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగిస్తారు.

Read Also: ఏంటీ.. ఈ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు 600 రైళ్లు రాకపోకలు చేస్తాయా?

Related News

Train Food: రైలులో వెజ్ బిర్యానీ కొన్న ప్రయాణికుడు.. రూ.25 వేలు చెల్లించిన రైల్వే, ఎందుకంటే?

Lower Currency Countries: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!

Monorail Derails: ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు.. మరి ప్రయాణికులు?

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Big Stories

×