Vijay Devarkonda: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా సినిమా రెట్రో.. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెత్తుతున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు జరుగుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ రౌడీ బాయ్ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు.. ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఎంత రష్మీక సినిమా చూస్తే ..
రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన సూర్య, విజయ్ దేవరకొండ పై యాంకర్ సుమ ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగారు.. విజయ్ దేవరకొండ ని సుమ 90స్లోకి వెళ్తే మీరు ఎవరిని కలవాలని ఉంది అని విజయ్ దేవరకొండ ని అడగగా.. విజయ్ అందుకు సమాధానంగా.. ముందుగా ఆ బ్రిటిష్ వాళ్ళని కొట్టాలని ఉంది. రీసెంట్ గా చావా సినిమా చూశాను. ఆ సినిమా చూసినప్పటి నుంచి ఆ ఔరంగజేబ్ ని ఇంకా ఎక్కువగా కొట్టాలనిపిస్తుంది.. నేను ఎవరిని కలవాలని అనుకోవడం లేదు కానీ, ఎక్కువగా కొట్టాలని మాత్రమే ఉంది. మనమంతా కలవడాలు ఏమీ ఉండవు, కొట్టేయడమే అంటూ విజయ్ దేవరకొండ ఆన్సర్స్ చెప్పారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎంత నీ హీరోయిన్ రష్మిక చావా సినిమాలో నటిస్తే మాత్రం ఇంతలా కోపంగా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
ఒకవేళ వెనక్కి వెళితే..
అంతేకాకుండా సుమ విజయ్ దేవరకొండ ని 90’s లోకి వెళితే ఏ హీరోయిన్ తో మీకు నటించాలని ఉంది అని అడగగా.. విజయ్ దేవరకొండ సిమ్రాన్, సోనాలి బింద్రే తో పాటు జ్యోతికతో యాక్ట్ చేయాలని ఉంది. కానీ సూర్య ఆల్రెడీ జ్యోతిక ను పెళ్లి చేసేసుకున్నాడు కాబట్టి సిమ్రాన్, సోనాలి బింద్రే తో యాక్ట్ చేయాలని ఉంది అంటూ విజయ్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. అంతేకాకుండా 90’s లో ఒకవేళ వెనక్కి వెళితే మీరు ఇంకా ఏం కొనాలని అనుకుంటున్నారు అని అడగగా.. నాకు పాత వస్తువులు ఏమీ కొనాలని లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు మనం కూర్చొని ఉన్నా ఈ ల్యాండ్ అంతా కూడా కొనేయాలని ఉంది అని విజయ్ బదులిచ్చారు. విజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..