BigTV English

Vande Bharat Express: కొత్తగా మరో నాలుగు వందేభారత్ రైళ్లు, సికింద్రాబాద్‌ నుంచి కూడా..

Vande Bharat Express: కొత్తగా మరో నాలుగు వందేభారత్ రైళ్లు, సికింద్రాబాద్‌ నుంచి కూడా..

Vande Bharat Express Trains: భారతీయ రైల్వే సంస్థ నెమ్మదిగా వందేభారత్ సేవలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ప్రయాణీకులను వేగంగా తమ గమ్య స్థానాలకు చేర్చేలా సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. అందులో భాగంగానే పూణె నుంచి నాలుగు అదనపు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం, పూణె నుంచి రెండు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. మరో నాలుగు రైళ్లను చేర్చడంతో ప్రయాణీకులకు మెరుగైన సేవలు లభించనున్నాయి. కొత్త రైళ్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నాయి.


ప్రస్తుతం అందుబాటులో రెండు వందేభారత్ రైళ్లు

ప్రస్తుతం పూణె- హుబ్బల్లి, పూణె -కొల్హాపూర్,  ముంబై-సోలాపూర్ (పుణె మీదుగా) రూట్లలో రెండు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. నాలుగు అదనపు రైళ్లను ప్రవేశపెట్టిన తర్వాత  ఈ మార్గాల్లో ప్రయాణం మరింత సులభతరం అవుతుంది.


కొత్త వందేభారత్ ఏ రూట్లలో నడుస్తాయంటే?

పూణె నుంచి మరో 4 వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాని అధికారులు నిర్ణయించారు. ఈ రైళ్లు..  పూణె నుంచి షెగావ్, పూణె నుంచి వడోదర, పూణె నుంచి సికింద్రాబాద్, మరో రైలు పూణె నుంచి బెలగావి రూట్లలో నడపాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ రైళ్లు వీలైనంత త్వరగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది. ఈ నాలుగు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే  పూణె నుంచి ఇతర ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మరింత పెరగనుంది. మొత్తంగా పూణె నుంచి 6 వందేభారత్ రైళ్లు తమ సేవలను అందించనున్నాయి.

వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్ల ధరల వివరాలు  

⦿ పూణె -కొల్హాపూర్ రూట్‌ లో వన్‌ వే టికెట్ ధర రూ.560, ప్రత్యేక కోచ్‌ కు రూ.1,135 ఉంటుంది. రైల్వే షెడ్యూల్ ప్రకారం, ఈ రైలు బుధవారం, శుక్రవారం, ఆదివారం మాత్రమే నడుస్తుంది.

⦿ పూణె-హుబ్బల్లి మార్గంలో స్టాండర్డ్ సీటుకు రూ. 1,530,  ప్రత్యేక కోచ్‌ కు రూ. 2,780గా టికెట్ ధర నిర్ణయించారు.

⦿ ఇతర రూట్లకు సంబంధించి ఇంకా టికెట్ ధరలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తున్నది.

Read Also: సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఏపీకి 5 వేల స్పెషల్ బస్సులు!

2024లో 30కి పైగా వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వందేభారత్ రైళ్లను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024లో 30కి పైగా  వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. 2024 చివరి నాటికి మొత్తం వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్ల సంఖ్య దేశ వ్యాప్తంగా 136కి చేరుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాలు, ప్రాంతాలను వందేభారత్ రైళ్లు కవర్ చేస్తున్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. తొలుత న్యూఢిల్లీ -శ్రీనగర్ రూట్ లో తొలి వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత 10 స్లీపర్ రైళ్లను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: జనవరి 1 నుంచి మారనున్న రైల్వే టైమ్ టేబుల్.. వెంటనే చెక్ చేసుకోండి!

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×