Chandrababu on Nitish Kumar: టీమిండియాఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి.. ఈ తెలుగు తేజం పేరు క్రికెట్ చరిత్రలో చాలా ఏండ్లు గుర్తుంటది. ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్ర సిరీస్ లోనే అసాధారణ బ్యాటింగ్ తో ఈ తెలుగు తేజం సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి భారత స్టార్ బ్యాటర్లంతా విఫలమైన వేళ.. నితీష్ కుమార్ రెడ్డి మాత్రం పట్టుదలగా క్రీజ్ లో నిలబడ్డాడు.
Also Read: Nitish Kumar Reddy: సెంచరీతో రెచ్చిపోయిన తెలుగోడు…కన్నీళ్లు పెట్టుకున్న నితీష్ తండ్రి !
ఆసీస్ పేస్ బౌలింగ్ పదునుకు తన బ్యాట్ తో విరుగుడు మంత్రం రచించాడు. ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి సహచరుడు వాషింగ్టన్ సుందర్ తో కలిసి 171 బంతులలో 105 పరుగులు సాధించి భారత జట్టును ఫాలో ఆన్ గండం నుంచి తప్పించాడు. తన తండ్రి ముత్యాల రెడ్డి ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తూ ఉండగా తొలి అంతర్జాతీయ శతకాన్ని సాధించాడు. కొడుకు శతకంతో చెలరేగగానే తండ్రి ముత్యాల రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారిగా తను పడిన కష్టాలని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు.
ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇది హైలైట్ గా మారింది. నితీష్ ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేయడంతో కొడుకు సెంచరీని చూసిన ముత్యాల రెడ్డి ఆనంద భాష్పాలతో అభినందిస్తూ ప్రేక్షకులతో పాటు చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. సెంచరీ పూర్తి చేశాక బ్యాట్ తో పుష్ప స్టైల్ లో “తగ్గేదేలే” అంటూ ఓ స్టిల్ ఇచ్చాడు. దీంతో నితీష్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని గాజువాక సమీపంలో ఉన్న ఓ చిన్న అద్దె ఇంట్లో నుండి ప్రారంభమైన నితీష్ కెరీర్ నేడు ఆస్ట్రేలియాలోని మేల్ బోర్న్ వేదికగా జేజేలు అందుకునే వరకు వచ్చింది.
నితీష్ తండ్రి తన కొడుకు కెరీర్ కోసం ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్నే వదిలేశాడు. నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ లో ఉద్యోగం చేసేవాడు. ఇక నితీష్ ఐదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. తన తండ్రి పనిచేస్తున్న హిందుస్థాన్ జింక్ కంపెనీ గ్రౌండ్ లో ప్లాస్టిక్ బాల్ తో తన ఆటను ప్రారంభించాడు. ఆ తర్వాత తన తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్ ని కెరీర్ గా ఎంచుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ముత్యాల రెడ్డి పనిచేస్తున్న కంపెనీ యూనిట్ క్లోజ్ అయింది.
దీంతో గుజరాత్ లోని ఉదయపూర్ కి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ కొడుకు ఖరీదు కోసం అతడు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అప్పటినుండి నితీష్ కెరీర్ కోసం అతడు ఎంతగా శ్రమించాడో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ నితీష్ కుటుంబానికి సొంత ఇల్లు లేదు. ముత్యాల రెడ్డి త్యాగానికి నేడు సరైన విజయాన్ని అందించాడు నితీష్ కుమార్.
Also Read: IND vs AUS: మైదానంలో కండోమ్ బెలూన్ కలకలం.. వీడియో వైరల్
మెల్ బోర్న్ లో జరుగుతున్న టెస్టులో కీలక సమయంలో సెంచరీ చేసిన నితీష్ పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా సోషల్ మీడియా వేదికగా అభినందించారు. నితీష్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని.. భారత జట్టులో కొనసాగి కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా పై సెంచరీ చేసినన్నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా 25 లక్షల నగదు ప్రకటిస్తున్నట్లు… ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ ప్రకటన చేశారు. ఈ బహుమానాన్ని త్వరలోనే చంద్రబాబు చేతుల మీదుగా అందజేస్తామని కూడా వెల్లడించారు.
బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024 లో ఆస్ట్రేలియాతో మెల్బోర్నలో జరుగుతున్న క్రికెట్ నాలుగవ టెస్టు మ్యాచ్ లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితిష్ కుమార్ రెడ్డికి అభినందనలు. టెస్టు మ్యాచ్ లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత… pic.twitter.com/93QcoWeTOx
— N Chandrababu Naidu (@ncbn) December 28, 2024