Walnuts For Skin: వాల్ నట్‌లను పోషకాల నిధి అని కూడా అంటారు. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడంలో కూడా వాల్ నట్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. చర్మానికి కూడా ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తినడం వల్ల మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి.
అందమైన , మెరిసే చర్మం ఉండాలని ప్రతి ఒక్కరి కోరిక. దీని కోసం రకరకాల ప్రొడక్ట్స్ కూడా వాడతారు. కానీ వీటిని వాడటం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలోనే వాల్ నట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. వాల్ నట్స్ పోషకాలు సమృద్దిగా ఉండే సూపర్ ఫుడ్. ఇందులో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు , విటమిన్ ఇ, జింక్, విటమిన్ బి వంటి పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా , యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.
మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం రకరకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటాము. కానీ డ్రై ఫ్రూట్ తినడం మరిచిపోతుంటాము. వీటి ప్రత్యేకతలు చాలా మందికి తెలియవు. చిన్నగా కనిపించే ఈ డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించడమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తాయి. డ్రై ప్రూట్స్ లో ఒకటైన వాల్ నట్స్‌ను నానబెట్టి కూడా తినవచ్చు. వాల్ నట్స్ నానబెట్టి తినడం వల్ల చర్మానికి ఎలాంటి మేలు జరుగుతుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాల్ నట్స్ తినడం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు:
ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు , వాల్ నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుల నుండి హైడ్రేట్ చేస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది.
విటమిన్ ఇతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ , ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా చర్మాన్ని రక్షిస్తుంది. ఇది ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Also Read: చుండ్రు సమస్యకు ఈ ఆయిల్‌తో.. శాశ్వత పరిష్కారం
విటమిన్ బి కాంప్లెక్స్ కూడా వాల్ నట్స్‌లో ఉంటుంది. ఇది చర్మ కణాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫలితంగా చర్మం సహజ మెరుపును ఇస్తుంది.
జింక్ చర్మాన్ని రిపేర్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మొటిమలను తగ్గించడంలో దోహదం చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలను కలిగించే నూనెల ఉత్పత్తిని కూడా నియంత్రిస్తుంది.