Indian Railways: భారతీయ రైల్వే రంగంలో మరో విప్లవాత్మక ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని రైల్వే లైన్ కు శ్రీకారం చుట్టబోతోంది భారత ప్రభుత్వం. ముంబై నుంచి నేరుగా దుబాయ్(UAE)కి కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించాలని భావిస్తోంది. ఈ రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తే ఇరు దేశాల నడుమ ప్రయాణం మరింత సులభ తరం కానుంది. దుబాయ్, ముంబై మధ్య 1,200 మైళ్ల (సుమారు 2,000 కి.మీ) దూరం ఉంటుంది. ఈ పూర్తి మార్గాన్ని అండర్ వాటర్ లో నిర్మించాలని ప్రతిపాదన చేస్తోంది. నీటి అడుగున ప్రయాణించడం.. సంప్రదాయ రైలు ప్రయాణంతో పోల్చితే పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రయాణంలో ప్రజలు నీటి అడుగున ఉండే అద్భుతమైన ప్రపంచాన్ని చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ, క్లాస్ట్రోఫోబియా ఉన్న వారికి ఇదో భయంకరమైన అనుభవాన్ని అందిస్తుంది.
అండర్ వాటర్ ప్రాజెక్టుకు ప్రతిపాదించింది ఎవరంటే?
భారత్ నుంచి దుబాయ్ మధ్య సరికొత్త రైల్వే రవాణా సౌకర్యాన్ని నెలకొల్పేందుకు UAE నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడతాయని వెల్లడించింది.
Read Also: రాత్రి 10 తర్వాత రైల్లో చేయకూడని పనులు ఇవే, లేదంటే ఇత్తడైపోద్ది!
భారత్- దుబాయ్ అండర్ వాటర్ రైల్వే లైన్ ప్రత్యేకతలు
భారత్- దుబాయ్ దేశాల మధ్య అండర్ వాటర్ రైల్వే లైన్ కు సంబంధించిన కీలక వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ తాజా నివేదికల ప్రకారం, ఇరు దేశాల నడుమ అండర్ వాటర్ లో నడిచే ఈ రైలు గంటకు 600 నుండి 1000 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
⦿ ముంబై నుంచి దుబాయ్ ప్రయాణం కేవలం 2 గంటల్లో పూర్తవుతుంది.
⦿ నీటి అడుగు భాగంలో నిర్మించే ఈ రైల్వే ప్రాజెక్టు అత్యంత ఖర్చుతో కూడుకున్నది. ఈ ప్రాజెక్టు కోసం బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం.
⦿ ఈ రైలు ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడమే కాకుండా, దుబాయ్ నుంచి భారత్ కు ముడి చమురు, ఇతర వస్తువులను మరింత త్వరగా రవాణా చేయడానికి ఉపయోగపడనుంది.
⦿ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలో దీనికి ఆమోదం లభిస్తే, 2030 నాటికి దీనిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి.
⦿ ఈ రైలు విమాన సేవలకు గట్టి పోటీని ఇవ్వనుంది. ఈ రైలు ప్రారంభమైన తర్వాత, రెండు దేశాల మధ్య ప్రయాణం చాలా సులభంగా మారనుంది. ప్రజలు భారత్ నుంచి దుబాయ్ కి తక్కువ ఖర్చుతో, అత్యంత వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో ఇరు దేశాలు కీలక నిర్ణయం తీసకునే అవకాశం ఉంది.
Read Also: పట్టాలు ఎక్కబోతున్న ఫస్ట్ హైడ్రోజన్ రైలు, అసలు విషయం చెప్పిన రైల్వే అధికారులు!