BigTV English
Advertisement

Pastor Praveen Case: పాస్టర్ మృతి కేసు.. మాజీ ఎంపీ హర్ష కుమార్‌‌కు పోలీసులు నోటీసులు

Pastor Praveen Case:  పాస్టర్ మృతి కేసు.. మాజీ ఎంపీ హర్ష కుమార్‌‌కు పోలీసులు నోటీసులు

Pastor Praveen Kumar Case: పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే, నిన్న పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదం వలన జరగలేదని.. ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే అని.. ఇందులో ప్రభుత్వ హస్తం ఉందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించిన విషయం తెలిసింద. సోమవారంఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలను విజయవాడలోనే చంపేశారు. పోలీసులకు నేను సవాల్ విసురుతున్నా. నేను హెల్మెట్ పెట్టుకుని అదే వేగంతో ప్రవీణ్ పడిన చోటే పడతాను. నాకు దెబ్బలు తగిలినా సరే, ప్రాణం పోయినా సరే’ అని హర్షకుమార్ సవాల్ చేశారు. ప్రవీణ్ మృతిపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు


ALSO READ: CISF Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పోలీస్ ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే గడువు..

మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి: పోలీసులు


అయితే, ఇదే అంశంపై కాసేపటి క్రితమే మాజీ ఎంపీ హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు పంపారు. రాజానగరం పోలీస్ స్టేషన్ నుంచి క్రైమ్ నెంబర్ 136/2025 పేరుతో నోటీసులు పంపగా.. అండర్ సెక్షన్ 194 బీఎన్ఎస్ఎస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  ‘ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై హర్షకుమార్ మీ వద్ద ఏమైనా సమాచారం ఇవ్వమని గతంలో ఒకసారి అడిగాం. మరోసారి అడుగుతున్నాం. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే సీసీ ఫొటోస్ కానీ.. సీసీ ఫుటేజీ వీడియోలు.. ఇంకెమైనా ఆధారాలు ఉంటే రేపు సాయంత్రం 5 గంటలకు రాజానగరం పోలీస్ స్టేషన్ కు రావాలి’ అని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

మాజీ ఎంపీ హర్ష కుమార్ ఏం అన్నారంటే..?

రాజనగరం పోలీసులు ఇచ్చిన నోటీసులకు హర్ష కుమార్ స్పందించారు. ‘మీరు నాకు నోటీసులు ఇవ్వడం కాదు. నేనే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు నాకు సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది’ అని హర్ష కుమార్ పోలీసులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ALSO READ: Nagpur News: సీక్రెట్‌గా భర్త వాట్సాప్ మెసేజ్‌లు చూసిన భార్య.. వెంటనే పోలీసులకు కాల్, ఇంతకీ ఆమె ఏం చూసింది?

ALSO READ: RCF Ltd Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే జీతం అక్షరాల రూ.46,300

Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×