BigTV English

Rashmi Gautam: ఇంటి నుండి తరిమేయకండి ప్లీజ్.. హెచ్‌సీయూ వ్యవహారంపై ప్రభుత్వానికి రష్మీ రిక్వెస్ట్

Rashmi Gautam: ఇంటి నుండి తరిమేయకండి ప్లీజ్.. హెచ్‌సీయూ వ్యవహారంపై ప్రభుత్వానికి రష్మీ రిక్వెస్ట్

Rashmi Gautam: ప్రస్తుతం హైదరాబాద్‌లో హెచ్‌సీయూ ల్యాండ్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వమే ఒక పచ్చని భూమిని ధ్వంసం చేయాలని చూడడం కరెక్ట్ కాదంటూ యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు దీనిపై తీవ్రమైన పోరాటం మొదలుపెట్టారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. హెచ్‌సీయూ అడవులను ధ్వంసం చేయవద్దని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ కూడా యాడ్ అయ్యింది. యానిమల్ కేర్ విషయంలో ఎప్పుడూ ముందుండే రష్మీ.. ఇప్పుడు కూడా వాటి గురించే మాట్లాడుతూ వీడియో షేర్ చేసింది.


సౌకర్యంగా కూర్చొని మాట్లాడుతున్నాను

‘‘అందరికీ నమస్కారం. ఈ వీడియోను నేను పోస్ట్ చేసిన తర్వాత నన్ను చాలామంది విమర్శించవచ్చు. కానీ ఈ వీడియోను ఎలాంటి రాజకీయ విమర్శల కోసం గానీ, ఏపీ, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి విరుద్ధంగా గానీ చేయడం లేదు. హెచ్‌సీయూలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. చాలామంది సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆన్ హెచ్‌సీయూ అని పోస్టులు కూడా పెడుతున్నారు. నేను ప్రస్తుతం నా అపార్ట్మెంట్‌లో సౌకర్యంగా కూర్చొని ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను. కానీ ఈ అపార్ట్మెంట్‌ను కట్టేటప్పుడు ఎన్నో చెట్లను, జంతువులను చంపడం జరిగే ఉంటుందని నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చింది రష్మీ గౌతమ్.


ఆర్తనాదాలు విన్నాను

‘‘నేను ఇంట్లో కూర్చొని వీడియో చేస్తూ ఏది కరెక్ట్, ఏది కాదు అని మాట్లాడడం చాలా ఈజీ. ప్రస్తుతం ఈ ఇష్యూ ఎందుకు జరుగుతుంది, లీగల్‌గా దాని పరిణామాలు ఏంటి అనే విషయాలపై నాకు అవగాహన లేదు. కానీ ఒక మామూలు మనిషిగా నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ వీడియో చూసిన తర్వాత, అక్కడ పక్షుల ఆర్తనాదాలు విన్న తర్వాత నాకు బాధగా అనిపించింది. పక్షులు, నెమలులు మాత్రమే కాదు.. మరెన్నో జంతువులు కూడా అక్కడ జీవిస్తున్నాయి. ఇది మనం ఆలోచించాల్సిన సమయం. వాటికి తిరిగి ఇవ్వాల్సిన సమయం అని నాకు అనిపిస్తుంది’’ అంటూ ఆ వీడియోలు తనను చాలా కదిలించాయని చెప్పుకొచ్చింది రష్మీ.

Also Read: అక్కినేని కొత్త కోడలికి లక్కీ ఛాన్స్.. ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్‌తోనే.?

ఇంటి నుండి తరిమేస్తున్నాం

‘‘ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆ పక్షులను, జంతువులను వాటి ఇంటి నుండి బయటికి తరిమేయడం కరెక్ట్ కాదు. మళ్లీ ఆ జంతువులకు అండగా నిలవడానికే మీరే మాకు ఉన్న ఆధారం. ఆ పశు పక్షులను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మీ తరువాతి నిర్ణయాలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. ఇంకా చాలామంది ఈ విషయంపై స్పందిస్తారని అనుకుంటున్నాను. ఏదో ఒక విధంగా ప్రభుత్వానికి ఈ విషయం తెలిసి పశు పక్షులను దృష్టిలో పెట్టుకొని వాటిని సురక్షితంగా ఉంచి తరువాతి స్టెప్ తీసుకుంటారని కోరుకుంటున్నాం’’ అంటూ హెచ్‌సీయూ విషయంపై స్పందించింది రష్మీ గౌతమ్ (Rashmi Gautam). తాజాగా ప్రకాశ్ రాజ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×