Varun Tej: గత కొంతకాలంగా తండ్రీ కొడుకులు.. ఒకే సినిమాలో నటించి, స్క్రీన్ పై అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్వర్గీయ నందమూరి తారక రామారావు (SrNTR)- బాలకృష్ణ (Balakrishna)కలసి ప్రేక్షకులను అలరించగా.. అటు దివంగత నటుడు కృష్ణ (Krishna) సినిమాలో మహేష్ బాబు(Mahesh Babu) నటించి అలరించారు. అంతేకాదు మోహన్ బాబు (Mohanbabu)సినిమాలలో ఆయన వారసులు సందడి చేసిన విషయం తెలిసిందే. ఇటు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వంటి హీరోలు కూడా తమ కొడుకుల సినిమాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఇప్పుడు వారి బాటలోనే నాగబాబు(Nagababu ) కూడా నడవబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ (Varun Tej) స్పష్టం చేశారు.
మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi)దర్శకత్వంలో వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటించిన ఇండో కొరియన్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ మూవీ కొరియన్ కనకరాజు(Korean kanakaraju). ఆగస్టు 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే తన తదుపరి ప్రాజెక్టు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను తన సోదరీ నిహారిక (Niharika) పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పై నిర్మిస్తున్న ‘బరి’ సినిమాలో తన తండ్రి నాగబాబు కనిపించబోతున్నారు అని వరుణ్ తెలిపారు.
ఇకపోతే తొలిసారి వీరిద్దరూ బరి సినిమాలో కనిపించబోతున్నారు అని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యదు వంశీ దర్శకత్వంలో స్పోర్ట్స్ బాగ్ డ్రాప్ లో బరి అనే టైటిల్ తో రాబోతోంది. వరుణ్ తేజ్ కాలు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇకపోతే ఈ సినిమాలో తొలిసారి వరుణ్ తేజ్ – నాగబాబు కలిసి నటించబోతున్నారని.. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ కూడా ఉంటాయని వరుణ్ తేజ్ తెలిపారు. మొత్తానికి అయితే వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్.. సినిమాపై అంచనాలు పెంచేశాయి.
also read:రూ.3 కోట్ల స్కామ్ లో సల్మాన్ ఖాన్,ఆయన సోదరి?
ఇకపోతే నాగబాబు నటుడిగా ఎన్నో సినిమాలలో నటించారు . ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో చిరంజీవి , పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ , సాయి ధరంతేజ్ ఇలా అందరి హీరోలతో కూడా ఏదో ఒక సినిమాలో కలిసి నటించాడు. కానీ తన సొంత కొడుకు వరుణ్ తేజ్ తో మాత్రం ఆయన ఇప్పటివరకు నటించలేదు. నిజానికి నాగబాబు మెయిన్ లీడ్ పోషించిన ‘హ్యాండ్స్ అప్’ సినిమాలో మాత్రం వరుణ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అయితే నాగబాబు వరుణ్ కాంబినేషన్ సీన్స్ లేవు. మొదటిసారి వీరిద్దరూ కలిసి బరి సినిమాలో నటించబోతున్నారని వరుణ్ తెలపడంతో.. మరి ఈ సినిమా వీరిద్దరి కి ఎలాంటి విజయాన్ని అందించబోతోంది తెలియాల్సి ఉంది.
వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా విషయానికొస్తే.. సత్య కీలక పాత్ర పోషించగా.. రితిక నాయక్ హీరోయిన్గా నటించింది. ఇక భారీ అంచనాల మధ్య ఆగస్టు 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.