E-Paper
Advertisement

ఛార్జింగ్ కేబుల్స్ మురికిగా మారాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!

ఛార్జింగ్ కేబుల్స్ మురికిగా మారాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
Advertisement

Charging Cable Cleaning Tips: నేటి ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య భాగమైపోయింది. నిరంతరం మన చేతిలో ఉండే మొబైల్‌‌కు ఛార్జింగ్ పెట్టుకోవడం, రకరకాల ఫోన్ కేసులు వాడటం, ఇలా ఎన్నో విధాలుగా దానిని ముస్తాబు చేస్తుంటాం. అయితే చాలామంది ఫోన్‌ను చూసుకున్నంత జాగ్రత్తగా దానికి ఎనర్జీ ఇచ్చే ఛార్జర్ కేబుల్స్‌ను అస్సలు పట్టించుకోరు.

నిజానికి ఛార్జింగ్ వైర్లను సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే.. తెల్లటి కేబుళ్లు చేతిలోని జిడ్డు, నిత్యం చుట్టూ ఉండే దుమ్ము, గాలిలోని తేమ వల్ల చాలా త్వరగా కాంతిహీనంగా, నల్లగా మారిపోతుంటాయి. కేవలం చూసేందుకు అసహ్యంగా ఉండటమే కాకుండా.. వీటిపై పేరుకుపోయే మురికి వల్ల వైర్లు త్వరగా పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే కొన్ని సులువైన చిట్కాలతో వీటిని తిరిగి కొత్తవాటిలా మెరిపించవచ్చు. అదెగాలో చూసేద్దాం రండి..

Advertisement

⇒ ఇంట్లో సులభంగా లభించే వస్తువులతోనే వైర్లపై ఉన్న మొండి మురికిని వదిలించవచ్చు. మనం రోజూ వాడే తెల్లటి టూత్‌పేస్ట్‌ను వైర్‌పై సమానంగా రాసి, పాత బ్రష్‌తో మెల్లగా రుద్ది తడి గుడ్డతో తుడిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే వంట సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసి అప్లై చేయడం వల్ల పేరుకుపోయిన జిడ్డు త్వరగా వదిలిపోతుంది. ఈ విధానాలు వైర్ రబ్బరుకు ఎలాంటి నష్టం కలిగించకుండా మురికిని శుభ్రం చేస్తాయి.

Also Read: సేల్ మొదలవ్వకముందే లీక్ అయిన OnePlus 15 ప్రైస్.. ఇంత తక్కువకి వస్తుందని తెలిస్తే!

Advertisement

⇒ మరింత వేగంగా ఫలితం కావాలనుకునేవారు ఆల్కహాల్ ఆధారిత ద్రవాలను ఉపయోగించవచ్చు. హ్యాండ్ శానిటైజర్ లేదా రబ్బింగ్ ఆల్కహాల్‌ను మెత్తటి దూదిపై వేసి వైర్‌ను తుడిస్తే నిమిషాల్లో మురికి మాయమవుతుంది. మేకప్ రిమూవర్ కూడా వైర్లపై ఉన్న నూనె జిడ్డును తొలగించడానికి బాగా పనిచేస్తుంది. అసిటోన్ లేని నెయిల్ పాలిష్ రిమూవర్‌ను కూడా అతి తక్కువ పరిమాణంలో వాడుకోవచ్చు. అయితే ఈ ద్రవాలను వాడేటప్పుడు ఛార్జింగ్ పిన్లు లేదా పోర్టులలోకి తడి వెళ్లకుండా జాగ్రత్త పడటం ఎంతో అవసరం.

⇒ కేబుల్స్ నల్లగా మారకుండా ఉండటానికి మార్కెట్లో లభించే స్పైరల్ కేబుల్ ప్రొటెక్టర్లు అద్భుతమైన పరిష్కారం. వీటిని వైర్ చుట్టూ తొడగడం వల్ల దుమ్ము, జిడ్డు నేరుగా కేబుల్‌కు తగలవు. అంతేకాకుండా.. ఇవి వైర్లు వంగిపోకుండా, లోపలి భాగాలు తెగిపోకుండా కాపాడతాయి. రోజులో ఎక్కువగా ఛార్జింగ్ పెట్టుకునే వాళ్లు ఇలాంటి రక్షణ తొడుగులను ఉపయోగించడం వల్ల కేబుల్ జీవితకాలం కూడా పెరుగుతుంది.

⇒ మనం పాటించే చిన్న చిన్న అలవాట్లే వైర్లను శుభ్రంగా ఉంచుతాయి. భోజనం చేసిన వెంటనే లేదా చేతులకు నూనె, క్రీమ్‌లు ఉన్నప్పుడు ఛార్జింగ్ వైర్‌ను తాకకూడదు. ఛార్జింగ్ పూర్తయిన తర్వాత వైర్‌ను నేలపై పడేయకుండా, ఏదైనా హుక్ లేదా టేబుల్‌పై పెట్టుకోవాలి. లేదంటే నేలపై ఉండే దుమ్ము త్వరగా వైర్‌కు పట్టుకుంటుంది. అలాగే వైర్లను గట్టిగా మెలిపెట్టకుండా కేబుల్ క్లిప్‌లను ఉపయోగించి భద్రపరుచుకోవడం మంచిది.

⇒ ఛార్జర్ కేబుల్‌కు మురికి బాగా పేరుకుపోయే వరకు వేచి చూడకుండా క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి. వారానికి ఒకసారి శానిటైజర్ లేదా డ్రై టిష్యూతో కేబుల్‌ను మెల్లగా తుడవటం వల్ల అది తెల్లగా మారుతుంది. అలాగే వైర్‌ను ఎప్పుడూ పొడిగా ఉండే ప్రాంతాల్లోనే ఉంచాలి. తేమ ఉన్న చోట ఉంచితే మురికి త్వరగా పట్టుకోవడమే కాకుండా లోపలి రాగి తీగలు పాడైపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. ఛార్జింగ్ వైర్లు ఎప్పుడూ కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి.

Also Read: క్వాలిటీకే కట్టుబడిన యాపిల్.. భారత్‌లో రూ.83,000 కోట్ల చారిత్రాత్మక మైలురాయి!

Tags

Related News

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026..ఈ 5 మోడల్స్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్ !

చిన్న టీవీలతో విసిగిపోయారా? ఈ ప్రొజెక్టర్ ఉంటే..ఇల్లే థియేటర్ అయిపోద్ది!

క్వాలిటీకే కట్టుబడిన యాపిల్.. భారత్‌లో రూ.83,000 కోట్ల చారిత్రాత్మక మైలురాయి!

BSNL మరో పిచ్చేక్కించే ప్లాన్.. రూ.1,499తో 300 రోజులు ఫుల్ హ్యాపీ.. ఇది చాలా చౌక గురూ!

ఓరి దేవుడా.. రూ.169 కే 90 రోజుల వ్యాలిడిటీనా.. ఇది పక్కా సామాన్యుల ప్లాన్!

సేల్ మొదలవ్వకముందే లీక్ అయిన OnePlus 15 ప్రైస్.. ఇంత తక్కువకి వస్తుందని తెలిస్తే!

మీ ఫోన్ డేటా సేఫ్‌గా ఉందనుకుంటున్నారా? అయితే ఈ నిజం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×