Gundeninda GudiGantalu Today episode May 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా వాళ్ళ నాన్న సంవత్సరికం కోసం బాలును పిలుస్తారు. తీసుకోవాలనుకున్న కావాలనుకున్న బాలు వస్తాడు కానీ అప్పటికే పార్వతి తన అల్లుడు తన కొడుకు చేయని విరగొట్టాడని అందరికీ చెప్తూ ఉంటుంది అది విన్న బాలు రెచ్చిపోతాడు. మరోసారి శివ పై దాడి చేస్తాడు. మీనా బాలుని కంట్రోల్ చేసి అక్కడి నుంచి పంపిస్తుంది. ఇక మీనా ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ బాలు చేసిన నిర్వాహకం గురించి అందరికీ చెప్తుంది. నా పుట్టింటి వాళ్ల మీద ఎందుకు ఇంత పగ పెంచుకున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. సత్యం ఎంత చెప్పినా కూడా బాలు వినకపోవడంతో సత్యం సీరియస్ అవుతాడు. తనను ఇంటికి పిలిచి మరీ అవమానిస్తున్నారని బాలు మండిపడుతాడు. శివ చేసిన తప్పును చెప్పలేక పోవడమే తన తప్పుగా అవుతుందని, దాంతో మీనాతో కూడా దూరం పెరుగుతూ వస్తోందని, రోజురోజుకు మీనా తనను నిందితుడిలాగా చూస్తోందని బాధపడుతూ ఉంటాడు. ఇక బాలు మీనాను పుట్టింటిలోనే వదిలేసి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చే సరికి సత్యం కంగారు పడుతూ ఉంటాడు. అసలే అందరిపై ఈ మధ్య చిర్రు బుర్రులాడుతున్న బాలు అక్కడికి వెళ్లి ఎలాంటి గొడవ చేశాడోనని కంగారులో ఉంటాడు. అదే సమయంలో బాలు ఇంటికి తిరిగి వస్తాడు. అంతకంటే ముందే మీనా ఇంటికి వచ్చి ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. మీనా పుట్టింటి నుంచి పుట్టెడు దుఃఖం తో ఇంటికి వస్తుంది. అక్కడ ఏం జరిగిందన్న విషయం సత్యంతో చెప్తుంది.. బాలు వచ్చే సరికి అక్కడ ఏం చేశావని ప్రశ్నిస్తాడు. అందుకు బాలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముంది మీ కోడలు మీనా చెప్పే ఉంటుంది కదా అని అంటాడు. ఇలా తిక్క తిక్కగా సమాధానం ఇస్తూన్నావేంటని సత్యం బాs మండి పడుతాడు. నిన్ను నేను ఎందుకు పంపించాను నువ్వు ఎందుకు వెళ్లావు? ఆ పని చేసుకొని రావాలి కానీ అక్కడ ఎవరేం మాట్లాడిన నువ్వు పట్టించుకోకుండా రావాలి అంతేకానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావా ఇదేనా నీకు నేను నేర్పించిన సంస్కారం అని సత్యం బాలుని దారుణంగా తిడతాడు.
సరిపోయింది వాడిని ఎందుకంటారు అక్కడ ఏదో తప్పు జరగకపోతే వాడి ఎందుకు కొడతాడు అని ప్రభావతి కొడుకుని వెనకేసుకొని వస్తుంది. ప్రభావతి మాటలకు సీరియస్ అయిన మీనా అక్కడ ఏమైనా జరగని కానీ ఈరోజు ఏంటి అనేది తెలుసు కదా ఈ మనిషికి మళ్లీ ఎందుకు అక్కడికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఎంత చెప్పినా మారవా? మీనా ను ఇంతగా ఏడిపిస్తావా? నువ్విక నాతో మాట్లాడల్సిన అవసరం లేదు అని సత్యం తేల్చి చెప్పేస్తాడు.. నువ్వు ఎప్పుడైతే ఈ గొడవలు కోపాలు తగ్గించుకుంటావో అప్పుడే నేను నీతో మాట్లాడతాను అని సత్యం అంటాడు. బాలు ఎంతగా సత్యం నీ పతిమలాడిన కూడా నువ్వు మారేంతవరకు నేను ఇంతే అని వెళ్ళిపోతాడు..
రోహిణి ప్రభావతీలు మాత్రం ఏదో జరిగింది. బాలుకి కోపం రాకుండా ఉంటే ఇలా కొట్టడు ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటారు. బాలు మీనా దగ్గరికి వెళ్తాడు. నిన్ను నేను ఏమి అనలేదు కదా ఏం జరిగినా వెళ్లి నువ్వు మా నాన్న దగ్గర చెప్తావా ఇప్పుడు మా నాన్న నాతో మాట్లాడనని చెప్పాడు దానికి కారణం నువ్వే కదూ అని మీనా పై సీరియస్ అవుతాడు. నీకు అసలు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నేను చెప్పట్లేదు. అంతే తప్ప నీ తమ్ముడిని కొట్టడానికి నాకేంటి సరదా కాదు చేతి దూల అంతకన్నా కాదు అని మీ నాతో అంటాడు..
సత్యం ప్రభావతిని నోరుమూసుకోమని, సంధు దొరికితే దూరిపోతావని మండిపడుతాడు. ఇక మీనా కూడా ధీటుగానే బదులిస్తుంది. అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదని, ఊరికే మా ఇంటి వాళ్లపై ఆడిపోసుకోవడం మానేయండి అంటూ మీనా గట్టిగా సమాధానం చెబుతుంది. బాలు మరోసారి మీ నాన్నను ఏడిపించడంతో సత్యం గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. గదిలోకి వెళ్లిన బాలు ఫోన్లో శివ చేసిన దొంగతనం వీడియో చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ ఫోన్ ని పక్కన పెట్టి స్నానానికి వెళ్తాడు అయితే ఆ ఫోన్లో ఏం చూసాడు అబ్బా ఈయన ఇంత సీరియస్ అయ్యాడు అని మీనా పట్టుకుంటుంది. అందులో ఉన్న శివ దొంగతన వీడియో బయట పడుతుందా? బాలుని మీనాక్షిస్తుందా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాలి.