Indian Railway Export: ఇండియన్ రైల్వేను ఆ దేశం రారమ్మని అంటోంది. అలా ఇలా కాదు.. ప్లీజ్ వెల్ కమ్ అంటూ స్వాగతం పలుకుతోంది. ఇది ఇండియన్ రైల్వే సత్తా అని యావత్ ప్రపంచం అంటోంది. ఇంతకు ఇంతలా మన రైల్వేను ఆ దేశం ఎందుకు మెచ్చుకుంటుందో తెలుసుకుందాం.
రైలు ఇంజిన్లు అంటే పాత రకం సాంకేతికత అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఇవే దేశం అభివృద్ధికి దారితీసే మార్గాలు. ముఖ్యంగా భారత్ తయారుచేసిన లోకోమోటివ్‌లు ప్రపంచ దేశాలకు వెళ్తుండటమే అందుకు నిదర్శనం. ఇదిగో, బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (BLW), వారణాసి లో తయారైన పది అత్యాధునిక డీజిల్ ఇంజిన్లు మొజాంబిక్ దేశానికి ఎగుమతయ్యాయి. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు.. భారతీయ ఇంజినీరింగ్‌కు గ్లోబల్ గుర్తింపు దక్కిందని చెబుతున్నారు రైల్వే విశ్లేషకులు.
మొజాంబిక్ రైలు పట్టాలపై భారత్ ముద్ర
మనదేశంలో తయారు చేసి, ప్రపంచం కోసం అందించాలన్న మేక్ ఇన్ ఇండియా భావన మరోసారి నిజమవుతోంది. అంతర్జాతీయ రవాణా, మౌలిక సదుపాయాల రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న RITES సంస్థ, తాజాగా ప్రపంచ కనెక్టివిటీకి మరో మెట్టు ఎక్కించింది. బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (BLW), వారణాసి తయారుచేసిన 10 అత్యాధునిక లోకోమోటివ్‌లు మొజాంబిక్ దేశానికి ఎగుమతయ్యాయి. దీని మొత్తం విలువ రూ. 310 కోట్ల ($37.68 మిలియన్లు) ఎగుమతి ఒప్పందంలో భాగం.
ఇంజిన్లు కాదు.. ఇది దేశం ప్రతిష్ఠ
ఈ ఇంజిన్లు డీజిల్ ఆధారంగా నడుస్తాయి. మొజాంబిక్‌లో ఉన్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా రూపొందించబడ్డాయి. వేడిగా ఉండే ప్రదేశాల్లో పనితీరు తగ్గకుండా.. అధికంగా పని చేయగలిగేలా వీటిని మోడరన్ టెక్నాలజీతో తయారు చేశారు. తక్కువ నిర్వహణతో ఎక్కువ పనితీరు కలిగిన ఈ లోకోమోటివ్‌లు, అక్కడి ప్రజలకు ప్రయోజనకరంగా మారబోతున్నాయి.
మేడ్ ఇన్ ఇండియా.. కానీ ప్రపంచం కోసం
ఈ ఇంజిన్లు పూర్తిగా మన దేశంలో తయారయ్యాయి. దీని ద్వారా దేశంలో ఉన్న పరిశ్రమల నైపుణ్యం, కార్మికుల శ్రమ, ఇంజినీరింగ్ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే స్ఫూర్తితో మన దేశం నుంచి ఇంకో ఏడాది మరిన్ని ఇంజిన్లు ఆ దేశానికి వెళ్లనున్నాయి. ఇలా చూస్తుంటే.. ప్రపంచం మన దేశ తయారీ సామర్థ్యాన్ని గౌరవంగా స్వీకరిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది.
ఆఫ్రికాలో భారత నైపుణ్యానికి ఆదరణ
ఈ ఒప్పందంతో భారతదేశం, ఆఫ్రికా మధ్య సాంకేతిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాక, వాణిజ్య సంబంధాలకు ఇది పెట్టుబడిదారులకు ఒక సానుకూల సంకేతంగా నిలుస్తోంది. ఇండియన్ రైల్వే తయారీ ఉత్పత్తులు నమ్మకమైనవని మరోసారి ప్రూవ్ చేసుకున్నాయి.
ఇది స్టార్ట్ మాత్రమే.. ఇక నుంచి ప్రపంచం మనదే!
ఇలా భారతదేశం నుంచి తయారైన లోకోమోటివ్‌లు ఇతర దేశాలకు చేరుతుండటం, మన పరిశ్రమల భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉందో చెబుతుంది. ఇది కేవలం ప్రాజెక్టు కాదు, దేశ గర్వానికి మరో మెట్టుగా చెప్పవచ్చు. భారతీయ రైల్వే, ఇప్పుడు ఇక ఆ దేశాలకూ గమ్యంగా మారుతోందని అంటున్నారు రైల్వే అధికారులు.