Social Media Stunt: ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కోరిక కొంతమంది యువతలో జ్వరంలా పాకుతోంది. లైక్స్, ఫాలోయింగ్, షేర్‌లు, వ్యూస్ కోసం ఏమిచేసినా చాలని, ఎంత ప్రమాదం ఉన్నా పట్టించుకోకుండా వీడియోలు చేయడం చూస్తే భయమే వేస్తోంది. రీసెంట్‌గా ఓ యువకుడు తన బైక్‌పై వెళ్లుతూ బయట రోడ్డుపై నడుస్తున్న బైక్ మీదే పెట్రోల్ క్యాన్ తీసుకొని బైక్‌కు పెట్రోల్ పోశాడు. ఇది ఒక సామాన్య వీడియో కాదు. ఇది పూర్తిగా ప్రాణాలతో ఆడుకునే పని. కానీ అతనికి మాత్రం వైరల్ కావడమే లక్ష్యం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా, వెర్రి తగ్గించుకో బ్రదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఓపెన్ ఛాలెంజ్ పేరిట ఓపెన్ ప్రమాదం!
ఈ సంఘటనపై తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ట్వీట్ చేస్తూ చాలా సీరియస్‌గా స్పందించారు. ఓపెన్ ఛాలెంజ్ అంట!? ఫేమస్ అయ్యేందుకు ఇవేం పిచ్చిపనులు అంటూ ఆ యువకుడి చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే వెర్రి పట్టి, సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇలాంటి వీడియోలతో పిల్లలకు, యువతకు ఏం నేర్పిస్తున్నారు? ఒక సారి ఆలోచించండి అంటూ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు.
వైరల్ కోసం ‘లైఫ్’ను రిస్క్‌లో పెడతారా?
బైక్ నడుపుతూ రెండు చేతుల్లో ఒక చేతితో స్టీరింగ్, మరో చేతితో పెట్రోల్ పోయడం అంటే ప్రమాదానికి తలకెత్తిచూపినట్టే. ఎక్కడా చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆ యువకుడికి కాకపోయినా పక్క నుంచి వెళ్లే వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పైగా ఇది రహదారి మీద జరిగిందన్న విషయం మరింత శోచనీయం. ఇదేమైనా ఫ్యాషనా? ఇలా ప్రాణాలతో ఆడుకుంటూ సోషల్ మీడియా స్టార్లవ్వాలనుకోవడం ఎంత ఖరీదైన పని అంటున్నారు మేధావులు.
వైరల్ ఛాలెంజ్ పేరు చెప్పుకొని వెధవ చేష్టలు!
ఈ తరహా ఛాలెంజ్‌లకు ఏ దిశగా దిగజారుతున్నామో ఓసారి ఆలోచించాలని నెటిజన్స్ అంటున్నారు. ఓపెన్ ఛాలెంజ్, డేర్ ఛాలెంజ్, ఫెయిల్ మీ ఇఫ్ యు కన్ లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టుకొని తమ వింత చేష్టలను జనం ముందు ఆరబోత పెడుతున్నారని కొందరు వాపోతున్నారు. వీటిని చూసిన చిన్నవాళ్లు, ఇన్‌స్టా, షార్ట్ వీడియో యాప్‌లలో పెరిగిపోతున్న యూత్ ఇవే ఆదర్శంగా తీసుకుంటున్నారన్నది వారి ఆవేదన. దీని ఫలితం? మరికొందరు అదే పిచ్చి పని మరింత ప్రమాదకరంగా మళ్లీ చంపే విధంగా అనుకరిస్తారట.
ప్రముఖుల స్పందన.. ఎలాగైనా ఆపాలి!
ఈ వీడియోపై ప్రజలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటివి చూసి చిన్న పిల్లలు ఫాలో అవుతారు, అది పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని పలువురు ట్వీట్ చేస్తున్నారు. నిజంగా చూస్తే ఇది కేవలం ఒక్క వ్యక్తి తప్పు కాదు.. ఇలాంటి వీడియోల్ని ప్రోత్సహించే సోషల్ మీడియా అల్గారిథంల సమస్య కూడా ఉంది. మనం చూసి ‘వావ్’ అన్న ఒక్క లైక్ వల్ల ఇంకో తరం యువత ప్రాణాలతో చెలగాటం ఆడే పరిస్థితి కనిపిస్తోంది.
సజ్జనార్ హెచ్చరిక – ఇప్పటికైనా ఆలోచించండి!
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ విభాగం ఎన్నో క్యాంపెయిన్లు చేసి ఫాలో రూల్స్ లాంటి చైతన్యాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఇలా మళ్లీ యువత వైరల్ పిచ్చిలో పడిపోతే, సజ్జనార్ వంటి అధికారి హెచ్చరికలు మరింత ప్రాధాన్యం పొందుతాయి. ఆయన చెప్పినట్టే ఫేమస్ అవ్వడం కోసం చేసే వీడియో.. ఒక్కసారి ప్రాణం పోతే ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
'ఓపెన్ ఛాలెంజ్' అంట!? ఫేమస్ అయ్యేందుకు ఇవేం పిచ్చి పనులు.
సోషల్ మీడియా వైరల్ వెర్రి పట్టి ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో ఆలోచించకుండా దిక్కుమాలిన వీడియోలు చేస్తున్నారు.
ఇలాంటి ప్రమాదకర వీడియోలతో ఏం సందేశం ఇస్తున్నారు మీరు. సమాజానికి ఏం నేర్పిస్తున్నారు. ఆలోచించండి. pic.twitter.com/G3FNIDfzjh
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 8, 2025
సామాజిక బాధ్యత ఎక్కడా?
ఇలాంటి వీడియోలు చేసే వ్యక్తులు సాధారణ యువకులు కాదు.. తమను సోషల్ మీడియా ఇన్‌ఫ్లూఎన్సర్స్ అని చెప్పుకుంటారు. అంటే వారిని అనుసరించే యూత్ ఎక్కువగా ఉంటారు. అలాంటి వారు ఈ విధంగా ప్రవర్తిస్తే, అది నేరుగా సమాజంపై దుష్ప్రభావం చూపుతుంది. ప్రతీ ఇన్‌ఫ్లూఎన్సర్‌కు ఇది పెద్ద బాధ్యత, వైరల్ కావాలనే కోరికతో ఏ పని చేసినా, అది ముందు ప్రజల భద్రతపై ప్రభావం చూపుతుందా అనే ఆలోచన ఉండాలని మరికొందరు సూచిస్తున్నారు.
Also Read: Amaravati Future City: అమరావతిలో మరో అద్భుత ప్రాజెక్ట్.. ఆ నగరాలకు ఇక పండగే!
వైరల్ కావాలంటే విలువైన కంటెంట్ చేయండి
ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ కావడం పెద్ద విషయమే కాదు. అసలు సంపూర్ణమైన వ్యక్తిత్వం, మంచి అభిప్రాయాలు, భద్రతకు ప్రాధాన్యత ఇస్తేనే వైరల్ కావచ్చు. కానీ ప్రమాదకర చేష్టలతో రోగమొచ్చినట్టుగా లైక్స్ రావడమే ముఖ్యం అనుకుంటే అది వ్యక్తిగతంగా మాత్రమే కాక సమాజానికి కూడా ప్రమాదం. ఇప్పటికైనా మారండి, సోషల్ మీడియాని ఓ బాధ్యతగా చూసుకోండని నెటిజన్స్ సలహా ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా ఇలాంటి వెర్రి వైరల్ పిచ్చిగాళ్లు మారండి అంటూ కొందరు సలహా ఇస్తున్నారు.