BigTV English

Super Vasuki Train: 295 వ్యాగన్లు, 3.5 కిలో మీటర్లు, దేశంలో అత్యంత పొడవైన రైలు ఇదే!

Super Vasuki Train: 295 వ్యాగన్లు, 3.5 కిలో మీటర్లు, దేశంలో అత్యంత పొడవైన రైలు ఇదే!

Longest Train of India: భారతీయ రైల్వే సంస్థ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఎన్నో వింతలు విశేషాలను కలిగి ఉన్నాయి. పొడవైన రైల్వే ఫ్లాట్ ఫారమ్, పాస్ పోర్టు ఉంటేనే లోపలికి అడుగు పెట్టనిచ్చే రైల్వే స్టేషన్, దెయ్యాల భయంతో మూతపడ్డ స్టేషన్.. ఒకటేమిటీ చెప్పుకుంటూ వెళ్తే, ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి దేశంలో అత్యంత పొడవైన రైలు ‘సూపర్ వాసుకి’. ఈ రైళ్లో ఏకంగా 295 వ్యాగన్లు ఉన్నాయి. పొడవు ఏకంగా 3.5 కిలో మీటర్లు ఉంటుంది. ఈ రైలుకు ఏకంగా 6 ఇంజిన్లు ఉంటాయి. ఈ రైలు వెళ్తుంటే వ్యాగన్లను లెక్కబెట్టడం అంత సులువు కాదు, కళ్లు గిర గిరా తిరుగుతాయి. గూడ్స్ రవాణాకు వినియోగించే ఈ రైలు రైల్వే క్రాసింగ్ దాటాలంటే చాలా టైమ్ తీసుకుంటుంది.


ఒకేసారి 27 వేల టన్నుల బొగ్గు రవాణా

రైలు ‘సూపర్ వాసుకి’ రైలును గూడ్స్ రవాణాకు వినియోగిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లోని గనుల నుంచి సేకరించిన బొగ్గును విద్యుత్ తయారీ కేంద్రాలకు తరలిస్తుంది. ఈ రైలు ఎక్కువగా చత్తీస్ గఢ్ లోని కోర్బా నుంచి రాజ్‌ నంద్‌ గావ్‌ నడుమ బొగ్గును రవాణా చేస్తుంది. కోర్బా నుంచి రాజ్‌ నంద్‌ గావ్ కు చేరుకోవడానికి ఏకంగా 11.20 గంటలు పడుతుంది. ఒక్కో స్టేషన్‌ ను క్రాస్ చేయడానికి సుమారు 4 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ రైలు ప్రయాణిస్తుంటే పాములా కనిపిస్తుంది. అందుకే ఈ రైలుకు శివుని మెడలో ఉన్న వాసుకి సర్పం పేరు పెట్టారు.


దేశంలో ఇదే పొడవైన గూడ్స్ రైలు

భారతీయ రైల్వే సంస్థ ఇప్పటి వరకు నడిపించిన అత్యంత పొడవైన గూడ్స్ రైలు ఇదేనని రైల్వేశాఖ వెల్లడించింది. రైలు ‘సూపర్ వాసుకి’ రైలు తీసుకొచ్చిన బొగ్గుతో 3,000 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం ఏకంగా ఒక రోజంతా నడుస్తుందని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి సాధారణ గూడ్స్ రైలు 90 వ్యాగన్లను కలిగి ఉంటుంది. ఇది 9 వేల టన్నుల బొగ్గును రవాణా చేస్తుంది. కానీ, సూపర్ వాసుకి 295 వ్యాగన్లు కలిగి ఉండి, ఒకేసారి 27 వేల టన్నుల బొగ్గు రవాణా చేస్తుంది.

రోజు రోజకు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న భారతీయ రైల్వే

ఇక భారతీయ రైల్వే రోజు రోజుకు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే  వందేభారత్ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. తొలుత 8 కోచ్ లతో ప్రారంభం అయిన ఈ రైళ్లు ఇప్పుడు 20కి చేరుకున్నాయి. త్వరలోనే ఈ సంఖ్య 24కు చేరబోతోంది. త్వరలోనే వందేభారత్ స్లీపర్, వందేభారత్ మెట్రో రైళ్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. వందేభారత్ పార్శిల్ రైళ్లను కూడా తయారు చేసే పనిలో పడింది రైల్వే సంస్థ. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 130కి పైగా వందేభారత్ రైళ్లు ప్రజలకు సేవలను అందిస్తున్నాయి. మొత్తం 13 వేల రైళ్లు ప్రతి రోజూ 2 నుంచి 3 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి.

Read Also: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి, దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

Sunrise Express: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Big Stories

×