Indian Railways: జమ్మూకాశ్మీర్ కు రైల్వే కనెక్టివిటీని మరింత మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. త్వరలోనే జమ్మూ నుంచి నేరుగా శ్రీనగర్ రైల్వే లైన్ ప్రారంభించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రైల్వే లైన్ పూర్తి కాగా, భద్రతా పరమైన పరీక్షలు కూడా కంప్లీట్ అయ్యాయి. ట్రయల్ రన్స్ కూడా సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రైల్వే సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూలోని శ్రీ మాతా వైష్ణో దేవి కత్రాకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొత్త రైల్వే సర్వీసులను ప్రారంభించింది. ఈ నిర్ణయంతో జమ్మూ కాశ్మీర్ కు వచ్చే పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
కత్రాకు వచ్చే కొత్త రైళ్లలు ఏవంటే?
⦿ శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా – గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
తొలుత ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వరకు కొత్త ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. 15067/15068 నెంబర్ గల శ్రమ్ కథ కత్రా ఎక్స్‌ప్రెస్ ఇరు ప్రాంతాల నడుమ వారానికి ఒకసారి నడవనున్నాయి. నిర్మాణంలో ఉన్న కొత్త రైల్వే లైన్ పూర్తయిన తర్వాత ఈ రైళ్లను కత్రా ద్వారా శ్రీనగర్ వరకు విస్తారించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రైలు గోరఖ్ పూర్ నుంచి కాశ్మీర్ లోయకు ప్రత్యక్ష రైలు సౌకర్యాన్ని అందించనుంది. ఉత్తరప్రదేశ్ తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
⦿ న్యూఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా ఎక్స్ ప్రెస్
దేశ రాజధాని న్యూ ఢిల్లీ నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వరకు మరో ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 04049/04050 నంబర్లతో కూడిన రైళ్లు వారానికి రెండుసార్లు అంటే, సోమ, శనివారాల్లో నడవనున్నాయి. ఈ రైళ్లు నవంబర్ 27 వరకు నడుస్తాయి. ఇతర రైళ్లపై భారాన్ని తగ్గించేందుకు రైల్వే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
పండుగలు, ప్రత్యేక రోజులలో మెరుగైన సేవలు
ఇక దేశంలోని ప్రధాన పండుగలు, ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో భారతీయ రైల్వే సంస్థ అదనపు సేవలను అందించాలి నిర్ణయించింది. దీపావళి, ఛత్ పూజ లాంటి పర్వదినాలు, సంత్ నిరంకారి వార్షిక సమాగం లాంటి ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.
జమ్మూకాశ్మీర్ కు మరింత రైల్వే కనెక్టివిటీ
శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా- శ్రీనగర్ రైలు మార్గం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పర్యాటకుల సంఖ్య పెరగడంతో కాశ్మీర్ లోయలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. అదే సమయంలో ఆర్థిక పురగతి సాధించే అవకాశం ఉంది. తీర్థయాత్ర కేంద్రాలకు మెరుగైన కనెక్టివిటీ అందించడమే కాకుండా, జమ్మూ- కాశ్మీర్‌లో పర్యాటకరంగం, ఆర్థిక కార్యకలాపాలను కూడా మెరుగుపడనున్నాయి.
Read Also: సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దేశంతో చూడాల్సిన బెస్ట్ 5 ప్లేసెస్ ఇవే!