Manchu Family :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మంచు ఫ్యామిలీ (Manchu Family)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కానీ గత ఏడాది చివర్లో ఈ కుటుంబంలో గొడవలు రోడ్డుకు ఎక్కి.. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఏడాది చివరికి గొడవలు సమిసిపోయాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ ఏడాది మళ్ళీ సంక్రాంతి సందర్భంగా తిరుపతిలో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకోవడంతో ఇప్పట్లో ఈ గొడవ తేలేలా లేదని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ మంచు మనోజ్ (Manchu Manoj) జల్ పల్లి లో ఉన్న తన తండ్రి మోహన్ బాబు ఇంటి వద్ద బైఠాయించడంతో మళ్లీ వివాదం మొదటి కొచ్చింది. అయితే ఇలాంటి సమయంలో తాజాగా మోహన్ బాబుకు ఎల్బీనగర్ కోర్టులో చుక్కెదురైందని చెప్పవచ్చు.
ఎల్బీనగర్ కోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు..
అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్ విషయంలో జరిగిన గొడవలపై జర్నలిస్టులు కలగజేసుకోగా.. వారిపై దాడి చేసిన విషయం తెలిసిందే. దాంతో జర్నలిస్టులు మోహన్ బాబు వల్ల ప్రాణహాని ఉందంటూ కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయం కాస్త కోర్టుకు వెళ్ళింది. కానీ అప్పుడు కోర్టు మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ తీర్పును ఎల్బీనగర్ కోర్టులో.. కోర్టును తప్పుదోవ పట్టించారని మంచు మనోజ్ న్యాయవాది సాక్షాలు కోర్టులో సమర్పించారు. దీంతో తప్పిదం చేసిన క్లర్క్ కి కోర్టు మెమో జారీ చేసింది. మొత్తానికైతే తప్పుడు సాక్షాలు చూపించి కోర్టు నుండి అనుకూలంగా తీర్పు తెచ్చుకున్న మోహన్ బాబుకు ఇప్పుడు మళ్లీ చుక్కెదురైందని చెప్పవచ్చు.
Renu Desai : రేణూ దేశాయ్ రెండో పెళ్లి ఆగిపోవడానికి కారణం..?
జలపల్లి లో మోహన్ బాబు ఇంటిముందు ధర్నాకు దిగిన మంచు మనోజ్..
ఈరోజు ఉదయం జల్ పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నాకు దిగిన మంచు మనోజ్.. తనకు జరిగిన అన్యాయం గురించి మీడియాతో చెప్పుకొచ్చారు. ఏప్రిల్ ఒకటిన మా పాప పుట్టినరోజు కోసం నేను జైపూర్ వెళ్ళాను. అయితే అదే రోజు మా ఇంట్లో విధ్వంసం సృష్టించారు. ఈ గొడవలను కావాలనే ఫ్యామిలీకి గొడవగా మార్చి మమ్మల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు. మాది ఆస్తి గొడవ కాదు.. స్టూడెంట్స్ విషయాలలో స్టార్ట్ అయిన గొడవ ఇది. నా ఇంట్లో జరిగిన బీభత్సంపై పోలీసులను అడిగితే.. మీరు ఇక్కడ ఉండడం లేదు కదా అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇప్పటివరకు మూడు ఎఫ్ఐఆర్లు నమోదైనా.. ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు. అన్ని ఆధారాలు ఉన్నా ఎందుకు పోలీసులు మాకు సహకరించడం లేదు. నేను ఊర్లో ఉన్నప్పుడు ఏం చేయడం లేదు. కానీ ఊరు దాటిన వెంటనే విష్ణు ప్లానింగ్ తో ఇల్లు ధ్వంసం చేశాడు. కన్నప్ప పోటీగా భైరవ సినిమా రిలీజ్ చేస్తున్నానని , నాపై కోపం. కూర్చుని మాట్లాడదామంటే విష్ణు ముందుకు రావడం లేదు. విష్ణు కావాలని నా కెరియర్ నాశనం చేస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్.