BigTV English

Thumb Ring: బొటన వేలికి ఉంగరం ధరిస్తే.. ఎన్ని లాభాలుంటాయో తెలుసా ?

Thumb Ring: బొటన వేలికి ఉంగరం ధరిస్తే.. ఎన్ని లాభాలుంటాయో తెలుసా ?

Thumb Ring: బొటనవేళ్లపై ఉంగరాలు ధరించడం గురించి అనేక నమ్మకాలు ఉన్నాయి. ఆయుర్వేదం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆక్యుప్రెషర్ ఆధారంగా ఉన్నాయి . ఈ నమ్మకాల వెనుక ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ.. చాలా మంది ఇప్పటికీ వారి సంప్రదాయాలు , నమ్మకాలను అనుసరిస్తారు. ఇదిలా ఉంటే.. ఆయుర్వేదం, జ్యోతిష్యశాస్త్రం ఆధారంగా బొటన వేళ్లకు ఉంగరాలు ధరిస్తే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


శక్తి సమతుల్యంగా ఉంటుంది:
శరీరంలో శక్తి ప్రవాహానికి బొటనవేలు ప్రధాన కేంద్రంగా పరిగణించబడుతుంది. ఆయుర్వేదం, పురాతన యోగా పద్ధతులలో.. బొటనవేలుపై ఉంగరం ధరించడం వల్ల శరీరంలో శక్తి సమతుల్యత కాపాడబడుతుందని అంతే కాకుండా అంతర్గత శాంతి కూడా లభిస్తుందని నమ్ముతారు.

సానుకూల ఆలోచన, ఆత్మవిశ్వాసం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బొటనవేలు సూర్యగ్రహాన్ని సూచిస్తుంది. దానిపై ఉంగరం ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతే కాకుండా సానుకూల ఆలోచనను ప్రోత్సహిస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని కూడా తగ్గించగలుగుతుందని చెబుతారు.


వైవాహిక జీవితం:
సాంప్రదాయకంగా బొటన వేలుపై ఉంగరం ధరించడం వల్ల వైవాహిక జీవితంలో సమతుల్యత కొనసాగుతుందని.. అంతే కాకుండా భార్యాభర్తల మధ్య సంబంధంలో స్థిరత్వం వస్తుందని, పరస్పర అవగాహన కూడా పెరుగుతుందని నమ్ముతారు. ఇది ముఖ్యంగా పురుషులకు చాలా మేలు చేస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు:
ఆక్యుప్రెషర్ , రిఫ్లెక్సాలజీ ప్రకారం.. బొటనవేలుపై ఉంగరం ధరించడం వల్ల శరీరంలోని వివిధ భాగాలకు శక్తి ప్రవాహం మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇది జీర్ణవ్యవస్థ, గుండె , ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.

సంపద, శ్రేయస్సు పెరుగుదల:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బొటనవేలిపై ఉంగరం ధరించడం వల్ల సంపద, శ్రేయస్సు, అదృష్టం పెరుగుతాయి. ఇది ప్రత్యేకంగా వాణిజ్యం లేదా వ్యాపారంలో ఉన్నవారికి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.

ఈ విషయాలు జ్యోతిష్యశాస్త్రం, సంప్రదాయాలపై ఆధారపడి ఉన్నప్పటికీ, వ్యక్తిగత అనుభవాల వల్ల కూడా మారవచ్చు.

మహిళలు ఎన్ని ఉంగరాలు ధరించాలి  ?

మహిళలు మూడు ఉంగరాలను ధరించడం శుభ ప్రదంగా పరిగణించబడుతుంది. కానీ ఒక చేతులకు 3 ఉంగరాలు ధరించకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి.. ఒక చేతికి రెండు ఉంగరాలు, మరో వైపు ఒకటి ధరించాలి. ఈ విధంగా ఉంగరాన్ని ధరించడం సరైనదిగా పరిగణించబడుతుంది. దీని కారణంగా.. మీరు ఎప్పటికీ రత్న దోషాన్ని లేదా గ్రహ దోషాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

Also Read: ఆరోగ్యానికి మంచివని బాదం ఎక్కువగా తింటున్నారా ? పొరపాటున కూడా అలా చేయొద్దు !

పురుషులు ఎన్ని ఉంగరాలు ధరించాలి  ?
రత్నశాస్త్రం ప్రకారం.. పురుషులు తమ చేతికి ఒకటి లేదా గరిష్టంగా రెండు ఉంగరాలను మాత్రమే ధరించాలి. దీంతో.. మీ పని తొందరగా పూర్తవుతుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. అంతే కాకుండా మీరు చాలా పురోగతి సాధిస్తారు. కానీ.. రెండు కంటే ఎక్కువ ఉంగరాలు ఒకే చేతికి ధరించినప్పుడు.. మీరు చేసే పనులు చెడిపోతాయి. అంతే కాకుండా మీరు ఏ పనిలోనైనా వైఫల్యాన్ని ఎదుర్కోవలసి రావచ్చు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×