BigTV English

Virat Kohli: కోహ్లీపై ట్రోలింగ్… ఐపీఎల్ వద్దు టెస్టులు ఆడుకో అంటూ!

Virat Kohli: కోహ్లీపై ట్రోలింగ్… ఐపీఎల్ వద్దు టెస్టులు ఆడుకో అంటూ!

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో భాగంగా శుక్రవారం రోజు చెపక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది ఆర్సిబి. ఈ మ్యాచ్ లో ఏకంగా 50 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో వరుసగా రెండు మ్యాచ్ లలో గెలిచిన ఆర్సిబి టేబుల్ టాపర్ గా నిలిచింది. తమ హోమ్ గ్రౌండ్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన సీఎస్కే ని.. ఆర్సిబి పూర్తిగా డామినేట్ చేసింది.


 

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాలలో అదరగొట్టింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటిదార్ 32 బంతులలో 51 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో రెచ్చిపోయాడు. మరోవైపు ఫీల్ సాల్ట్ 16 బంతులలో 32 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సిబి ఇన్నింగ్స్ ని సాల్ట్, విరాట్ కోహ్లీ ప్రారంభించారు.


అయితే ఓవైపు సాల్ట్ సీఎస్కే బౌలర్ల పై విరుచుకుపడుతుంటే.. విరాట్ కోహ్లీ మాత్రం ఆడలేక ఇబ్బంది పడ్డాడు. ఆఖరిలో కాస్త దూకుడు పెంచే ప్రయత్నం చేసినప్పటికీ అది పెద్దగా ప్రయోజనం ఇవ్వలేదు. మొత్తానికి ఈ మ్యాచ్ లో 30 బంతులు ఆడిన కోహ్లీ 31 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి మ్యాచ్ లో 59 పరుగులతో ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లీ.. ఇక ఫామ్ లోకి వచ్చాడని అంతా భావించారు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం బంతిని టచ్ చేయడానికి భయపడ్డట్టు కనిపించాడు.

బంతిని అంచనా వేయడంలో లెక్క తప్పాడు. యార్కర్లు ఆడలేకపోయాడు. చెన్నై బౌలర్ పతిరానా వేసిన ఓ బంతి విరాట్ హెల్మెట్ కి కూడా తగిలింది. అంటే విరాట్ కోహ్లీ ఎంత ఇబ్బంది పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. చెన్నై ప్లేయర్లు క్యాచులు మిస్ చేయడం వల్ల కూడా కోహ్లీకి లైఫ్ వచ్చింది. అలాగే ఓసారి రన్ అవుట్ నుండి కూడా తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఇన్నింగ్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెళ్ళువెత్తుతున్నాయి.

టి-20 లో టెస్ట్ ఇన్నింగ్ ఆడాడని ఎద్దేవా చేస్తున్నారు. చాలా షార్ట్స్ కనెక్ట్ చేయలేకపోయాడని, ఈ ఇన్నింగ్స్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డక్ అవుట్ అయినా సంతోషిస్తామని.. మరో బ్యాటర్ వచ్చి రన్స్ చేస్తారని అంటున్నారు. విరాట్ కోహ్లీ సెల్ఫిష్ ప్లేయర్ అంటూ మండిపడుతున్నారు. అయితే కోహ్లీ అభిమానులు మాత్రం పిచ్ కఠినంగా ఉందని, అక్కడ వేగంగా ఆడడం కష్టమని రిప్లై ఇస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్ తో చెన్నై పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ నీ అధిగమించాడు విరాట్ కోహ్లీ. మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ ఉండగా.. ఇప్పుడు శిఖర్ ధావన్ రెండవ స్థానానికి దిగజారాడు. మూడవ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. ఈ మ్యాచ్ లో 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. రచిన్ రవీంద్ర {41} మినహా మిగిలిన ప్లేయర్లు విఫలం అయ్యారు. చివర్లో మహేంద్రసింగ్ ధోని 15 బంతులలో 34 పరుగులు చేసి అడపాదడప బౌండరీలు కొడుతూ అభిమానులను ఖుషి చేశాడు.

 

ఇక ఈ మ్యాచ్ లో గెలుపుతో ఆర్సిబి కెప్టెన్ రజత్ పటిదార్ అరుదైన ఘనతను అందుకున్నాడు. విరాట్ కోహ్లీ వల్ల కూడా కానీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. చెపాక్ వేదికగా గత 17 ఏళ్లలో ఆర్సిబి ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఆర్సిబి విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ గెలిచిందే లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రజత్ పటిదార్ కేప్టెన్సీలోని ఆర్సిబి.. చెన్నైని వారి సొంతం మైదానంలో ఓడించింది. ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రజత్ పటిదార్ కి లభించింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×