BigTV English

Richest Railway Station: దేశంలో రిచెస్ట్ రైల్వే స్టేషన్ ఇదే, టాప్ 5లో తెలుగు స్టేషన్ కూడా..

Richest Railway Station: దేశంలో రిచెస్ట్ రైల్వే స్టేషన్ ఇదే, టాప్ 5లో తెలుగు స్టేషన్ కూడా..

India’s Highest Earing Railway Stations: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా, చైనా, రష్యా తర్వాత స్థానంలో ఇండియన్ రైల్వే ఉంది. దేశ వ్యాప్తంగా సుమారు లక్ష కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు ఉన్నాయి. నిత్యం 22 వేలకు పైగా రైళ్లు సేవలను అందిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 7,308 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక భారతీయ రైల్వే సంస్థకు టికెట్ల అమ్మకంతో పాటు సరుకు రవాణా ద్వారా భారీగా ఆదాయం పొందుతోంది. రైల్వే స్టేషన్ల ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తున్నది. రైల్వే స్టేషన్లలోని షాపులు, యాడ్స్, ఫ్లాట్ ఫారమ్ టికెట్స్, క్లాక్ రూమ్ లు, వెయిటింగ్ హాళ్ల ద్వారా ఆదాయం పొందుతోంది. అయితే, దేశ వ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందే రైల్వే స్టేషన్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..


దేశంలో ఎక్కువ ఆదాయాన్ని పొందే రైల్వే స్టేషన్లు

1.న్యూఢిల్లీ రైల్వే స్టేషన్


దేశంలో అత్యధిక ఆదాయం సంపాదించే రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. 2023-24 ఆర్థిక సంసవత్సరంలో ఈ స్టేషన్ ఏకంగా ఈ రైల్వే స్టేషన్ రూ. 3,337 కోట్లు సంపాదించింది. రైల్వేశాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆదాయంతో పాటు అధిక రద్దీ ఉన్న స్టేషన్లలోనూ ఈ స్టేషన్ తొలి స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి నుంచి 39,362,272  మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగించారు.

2.హౌరా రైల్వే స్టేషన్

అత్యధిక ఆదాయం సంపాదించే రెండో రైల్వే స్టేషన్ గా బెంగాల్ లోని హౌరా రైల్వే స్టేషన్ గుర్తింపు తెచ్చుకుంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ రైల్వే స్టేషన్ రూ. 1,692 కోట్లు ఆదాయాన్ని సంపాదించింది. అత్యధిక రద్దీ ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 2023-24లో ఈ రైల్వే స్టేషన్ నుంచి ఏకంగా 61,329,319 మంది ప్రయాణీకులు జర్నీ చేశారు.

3.చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దేశంలో అత్యధిక ఆదాయం పొందే రైల్వే స్టేషన్లలో మూడో స్థానంలో నిలిచింది. ఈ రైల్వే స్టేషన్ గత ఏడాది రూ.1,299 కోట్లు సంపాదించింది. ఈ స్టేషన్ నుంచి 30,599,837 మంది రాకపోకలు సాగించారు.

4.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్   

అత్యధిక ఆదాయం సంపాదించే రైల్వే స్టేషన్లలో తెలంగాణ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగో స్థానంలో నిలిచింది.  2023-24లో ఈ రైల్వే స్టేషన్ రూ. 1,276 ఆదాయాన్ని అందుకుంది. ఇక్కడి నుంచి ఏకంగా 27,776,937 కోట్ల మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగించారు.

Read Also: స్టీమ్.. డీజిల్.. ఎలక్ట్రిక్.. వీటిలో ఏ రైల్ ఇంజిన్ వేగం ఎక్కువ, ఎంత స్పీడుతో దూసుకెళ్తాయ్?

5.నిజాముద్దీన్ రైల్వే స్టేషన్

ఎక్కువ ఆదాయం పొందే ఐదో రైల్వే స్టేషన్ గా ఢిల్లీలోని హర్జత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,227 కోట్లు సంపాదించింది. ఇక్కడి నుంచి 14,537,687 మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించినట్లు రైల్వే లెక్కలు వెల్లడిస్తున్నాయి.

Read Also: ఫారిన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇక హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లొచ్చు!

Tags

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×