E-Paper
Advertisement

రెండు పెళ్లిళ్లు.. కేసులు.. క్యాన్సర్‌..ప్రదీప్ రావత్ పర్సనల్ లైఫ్ తెలుసా?

రెండు పెళ్లిళ్లు.. కేసులు.. క్యాన్సర్‌..ప్రదీప్ రావత్ పర్సనల్ లైఫ్ తెలుసా?
Advertisement

Pradeep Rawat:హీరోకి దీటుగా  విలన్ ఉన్నప్పుడే హీరో బలం ఏంటో తెలుస్తుంది .అలాంటి పవర్ ఫుల్ విలన్ అంటే చాలామందికి గుర్తొచ్చే పేరు ప్రదీప్ సింగ్ రావత్ .
ముఖ్యంగా సై సినిమాలో ప్రదీప్ రావత్ ఇచ్చిన పర్ఫామెన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ .వెండితెరపై అంత భీకరంగా కనిపించిన విలన్ ఆ తర్వాత తెలుగు సినిమాలలో ఇప్పటివరకు మరొకరు లేరంటే ఆశ్చర్యం లేదు. ఇక ఆ తర్వాత గజినీ, చత్రపతి, స్టాలిన్ వంటి ఎన్నో సినిమాలలో తనదైన విలనిజంతో ఆకట్టుకున్న ప్రదీప్ సింగ్ రావత్ నిన్న అంటే ఆగస్టు 4 కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ప్రదీప్ సింగ్ రావత్ యొక్క వ్యక్తిగత జీవిత విశేషాలపై ఇప్పుడు నెట్టింట్లో తెగ చర్చ జరుగుతోంది .మరి ఆ విశేషాలు ఏంటో మనము ఒకసారి చూద్దాం.

మహాభారత్‌తో గుర్తింపు… ‘సై’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర

21 జనవరి 1952 మధ్యప్రదేశ్ ,జబల్‌పూర్ లో జన్మించిన ప్రదీప్ రావత్ మనకు సై సినిమాతోనే పరిచయం కానీ ఆయన 1980లోనే హిందీ సినిమాల్లోకి అడుగు పెట్టాడు.ముఖ్యంగా ఐత్‌బార్ తో అనే సినిమా తో కెరీర్ మొదలెట్టిన ప్రదీప్ సింగ్ రావత్ ఆ తర్వాత బిఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన మహాభారత్ సీరియల్ తో మంచి క్రేజ్ సంపాదించాడు.అందులో చేసిన అశ్వద్ధామ పాత్ర ప్రదీప్ రావత్ కి ఎనలేని పేరు సంపాదించి పెట్టింది.
ఇక తెలుగులో జక్కన్న దర్శకత్వంలో వచ్చిన సై సినిమా గురించి చెప్పక్కర్లేదు అందులో చేసిన బిక్ష యాదవ పాత్ర ఇప్పటికీ విలన్ పాత్రలకి ఒక కేరాఫ్ .
ఆ తర్వాత భద్ర, స్టాలిన్, దేశముదురు, లక్ష్యం ,అదుర్స్, గోలీమార్, నాయక్, అల్లుడు శీను, వాల్తేరు వీరయ్య ,టైగర్ నాగేశ్వరరావు ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు 150 సినిమాలకు పైగా నటించాడంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతగా పాతుకు పోయాడో అర్థమవుతుంది .

బ్లడ్ క్యాన్సర్‌తో నాలుగేళ్ల పోరాటం

Advertisement

అయితే ఇలా వరుస సినిమాలు చేసుకుపోతున్న ప్రదీప్ సింగ్ రావత్ కి 2022లో బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు తేలింది.అప్పట్నుంచి చికిత్స తీసుకుంటున్న ప్రదీప్ సింగ్ రావత్ ఆరోగ్యం గత నెల రోజులుగా విషమించడంతో కోకిలబెన్ ఆస్పత్రికి తరలించారు.ఇక చికిత్స జరుగుతుండగానే నిన్న అంటే ఆగస్టు 4న కన్నుమూశారు.

మొదటి వివాహం 

వ్యక్తిగత జీవితానికి వస్తే ఎన్నో సమస్యలని ఎదుర్కొన్నారు.మొదటి పెళ్లి జరిగిన కొద్ది నెలల్లోనే భార్యాభర్తల మధ్య విబేధాలు రావడంతో ఆ బంధం తెగిపోయింది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రదీప్ సింగ్ రావత్.తన కుటుంబంపై పోలీసులకు తప్పుడు ఆరోపణలు చేస్తూ కంప్లైంట్ ఇచ్చారని అయితే అదే సమయంలో తన భార్య గర్భవతిగా ఉందని దాంతో పరిస్థితులు మరింత సంక్లిష్టం గా మారాయని మనసులో మాటను బయటపెట్టాడు. చివరకు కేసులు, వివాదాల తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నామంటూ తెలిపాడు .

‘స్టాలిన్’ సినిమా సెట్లో మొదలైన ప్రేమ

Advertisement

అయితే మొదటి పెళ్లి పెటాకులు అయిన తర్వాత చాలా కాలం ఒంటరిగా ఉన్న ప్రదీప్ రావత్ కి దక్షిణాదికి చెందిన కళ్యాణి అనే మహిళతో పరిచయం ఏర్పడింది.
స్టాలిన్ సినిమా షూటింగ్ సమయంలో కళ్యాణి కారుకు సమస్య రావడంతో ప్రదీప్ రావత్ తన కారులో డ్రాప్ చేశాడని ఆ పరిచయమే క్రమంగా ప్రేమగా మారి కొన్ని నెలల తర్వాత అంటే 2006 లో వీరి వివాహం జరిగిందని సమాచారం .ఇక రెండో పెళ్లి జరిగిన తర్వాత ఆ జంటకి విక్రమాదిత్య అనే కొడుకు పుట్టాడు.అయితే ఎంత బిజీగా ఉన్నా తన ఆలోచనలు అన్నీ కుటుంబం చుట్టే తిరుగుతూ ఉండేవని ఆయన శ్రేయోభిలాషులు చెబుతుంటారు.

దాదాపు 150 సినిమాల్లో

ఇక ప్రదీప్ సింగ్ రావత్ కెరియర్ విషయానికి వస్తే హిందీ తెలుగు, తమిళం, కన్నడ ,మలయాళం ..ఇలా పాన్ ఇండియా భాషల్లో నటించిన ఆయన ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేయడంవిశేషం.ఒకరంగా విలన్ పాత్రలకి ప్రదీప్ సింగ్ ఒక కేరాఫ్ అయిపోయాడు.ఇక 150 సినిమాల్లో నటించిన ప్రదీప్ సింగ్ ఆస్తి దాదాపుగా 45 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా .ఏదేమైనా వెండితెరపై విలన్ గా వెలుగు వెలిగిన ప్రదీప్ రావత్ ఇలా అనారోగ్యంతో పోరాడుతూ కన్నుమూయడం ఇండస్ట్రీకి పెద్ద లోటు అని చెప్పక తప్పదు

Also read :కన్నుమూసిన ఛత్రపతి విలన్ ..ఇండస్ట్రీలో విషాదం !

Tags

Related News

డైలాగ్ చేంజెస్ తో సెన్సార్ పూర్తి చేసుకున్న కొరియన్ కనకరాజు.. రన్ టైమ్ లాక్!

రాజకీయాలపై అక్కినేని కోడలు హాట్ కామెంట్స్!

జిమ్ వర్కౌట్స్ తో ఆశ్చర్యపరుస్తున్న స్టార్ హీరో తల్లి.. ఎవరంటే?

ప్రదీప్ రావత్ జీవితంలో భయంకరమైన రోజు అదే!

తేజెస్వి మదివాడ రియల్ స్టోరీ.. కన్నీళ్లు తెప్పించే ట్విస్టులు..

రాంబాయి గ్లామర్ డోస్ పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో

Big Stories

Advertisement
×