Amritsar Blast: కాసేపటి క్రితం అమృత్‌సర్‌లో పేలుడు సంభవించింది. మజితా రోడ్డు సమీపంలో కొన్ని పేలుడు పదార్థాలను ఓ వ్యక్తి తిరిగి వెలికి తీస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ పేలుడులో ఆ వ్యక్తి మృతిచెందాడు. చనిపోయిన వ్యక్తిని ఉగ్రవాద సంస్థకు చెందినవాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆ వ్యక్తి కొన్ని పేలుడు పదార్థాలను తిరిగి వెలికి తీస్తుండగా పేలుడు సంభవించిదని పోలీసులు పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకునేందుకు ఆ వ్యక్తి ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. ఉగ్రవాదానికి సంబంధించిన వ్యక్తి అమృత్‌సర్ ఏరియాలో బాంబు పెట్టేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Court Jobs: అద్భుతమైన అవకాశం.. భారీగా కోర్టు ఉద్యోగాలు.. ఏడో తరగతి నుంచి అర్హత స్టార్ట్..
పేలుడు పదార్థాల నమూనాలను సేకరించడానికి ఫోరెన్సిక్స సైన్స్ లాబొరేటరీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని పోలీసులు చెప్పారు. స్థఆనికులు భారీ పేలుడు శబ్ధం రావడంతో భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Gold Mining: మన తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు.. రూ.లక్షల కోట్ల నిల్వలు గుర్తింపు