Indian Railways: భారతీయ రైల్వే ద్వారా రోజూ లక్షలాది మంది ప్రయాణీకులు తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరమైన ప్రయాణం చేస్తారు. అయితే, రైల్వే ప్రయాణీకులు సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో టికెట్ కన్ఫర్మేషన్ ఒకటి. ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, వెయిటింగ్ లిస్టులోకి వెళ్తుంది. టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? లేదా? అని చాలా మంది టెన్షన్ పడుతుంటారు. ఇక పండుగలు, ప్రత్యేక రద్దీ సీజన్లలో వెయిటింగ్ లిస్ట్ 500 దాటినప్పుడు టెన్షన్ ఇంకా పెరుగుతుంది. టికెట్ కన్ఫర్మేషన్ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
టికెట్ కన్ఫర్మేషన్ ఎలా చేస్తారంటే?
వెయిటింగ్ లిస్టు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు టికెట్ కన్ఫర్మేషన్ అనేది సాధ్యం కాదు. టికెట్ కన్ఫర్మేషన్ కు సంబంధించి భారతీయ రైల్వే నిర్దిష్ట పద్దతిని పాటిస్తుంది. టికెట్ క్యాన్సిలేషన్, రిజర్వేషన్ కోటా, రైల్వే ఎమర్జెన్సీ కోటా సహా పలు పద్దతులను పాటిస్తుంది. ఇంతకీ టికెట్ కన్ఫర్మ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. సాధారణంగా ఒక స్లీపర్ కోచ్ లో 72 సీట్లు ఉన్నట్లైతే, వాటిలో సుమారు 21% మంది ప్రయాణీకులు ప్రయాణ సమయానికి టికెట్లు రద్దు చేసుకుంటారు. అంటే, దాదాపు 15 సీట్లు అందుబాటులోకి వస్తాయి. మరో 4 నుంచి 5 శాతం సీట్లు ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. అటు రైల్వే ఎమర్జెన్సీలోనూ కొన్ని సీట్లు అందుబాటులో ఉంటాయి. అవన్నీ పూర్తి కాకపోతే, మరికొన్ని వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తంగా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారికి స్లీపర్ కోచ్ లో దాదాపు 18 సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: పైసా ఖర్చులేకుండా ఏడాదిగా ట్రైన్ లో ఫ్రీ జర్నీ, ప్రయాణీకుడి తెలివికి రైల్వే అధికారుల షాక్!
ఈజీగా టికెట్ కన్ఫర్మ్ కావాలంటే?
ఇక వెయిటింగ్ టికెట్ కన్ఫర్మేషన్ కావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. వీటి ద్వారా టికెట్ కన్ఫర్మేషన్ అవకాశాలు పెరుగుతాయి.
⦿ ముందుగానే మీ ప్రయాణ తేదీ కన్ఫర్మ్ అయితే, వీలైనంత త్వరగా టికెట్లను బుక్ చేసుకోవడం మంచిది.
⦿ మీరు ఎంత త్వరగా టికెట్ బుక్ చేసుకుంటే, వెయిటింగ్ లిస్ట్ అంత తక్కువగా ఉంటుంది. ఈజీగా టికెట్ కన్ఫర్మ్ అవుతుంది.
⦿ వీలున్నంత వరకు తక్కువ రద్దీ ఉన్న రూట్లను సెలెక్ట్ చేసుకోవాలి. ఈజీగా టికెట్ కన్ఫర్మ్ అవుతుంది.
⦿ మీ ప్రయాణ తేదీ మార్పునకు ఏమాత్రం అవకాశం ఉన్నా, ప్రత్యామ్నాయ తేదీల్లో టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.
⦿ రైల్వే అధికారిక వెబ్ సైట్ /మొబైల్ యాప్ ద్వారా మీ వెయిటింగ్ లిస్ట్ స్టేటస్ ను చెక్ చేస్తూ ఉండాలి.
చివరి క్షణంలో టికెట్ కన్ఫర్మ్ కావలేదని ఇబ్బంది పడేకంటే.. ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ఇకపై వీలైనంత టికెట్లు పొందేందుకు ప్రయత్నించండి.
Read Also: భారతీయ రైల్వేలో మరో కలికితురాయి, పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
Read Also: దేశంలో రిచెస్ట్ రైల్వే స్టేషన్ ఇదే, టాప్ 5లో తెలుగు స్టేషన్ కూడా..