రైల్వే ద్వారా డబ్బులు సంపాదించుకోవాలంటే IRCTC ఏజెంట్ గా మారితే సరిపోతుంది. రైల్వే అనుమతితో టికెట్ల బుకింగ్ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. కస్టమర్ల కోసం రైలు టికెట్లను బుక్ చేయడం ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ఏజెంట్లు ప్రిన్సిపల్ సర్వీస్ ప్రొవైడర్స్ (PSPలు) అని పిలిచే అధీకృత కంపెనీల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇంతకీ IRCTC ఏజెంట్‌గా ఎలా చేరాలి? డబ్బు ఎలా సంపాదించాలి? నెలకు ఎంత సంపాదించవచ్చు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
IRCTC ఏజెంట్‌గా ఎలా చేరాలి?
IRCTC ఏజెంట్ గా మారడానికి PSP ద్వారా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే IRCTC నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ఇన కల్పించదు. eRail, PayPoint India, CSC లాంటి PSPలను IRCTC ఆమోదించింది. IRCTC ఏజెంట్ కోసం అప్లై చేసుకునే విధానం చాలా ఈజీగా ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
భారతీయ పౌరులు ఎవరైనా IRCTC ఏజెంట్‌గా మారేందుకు అవకాశం ఉంది. PAN కార్డ్, ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID ఉండాలి. లేటెస్ట్ ఫోటో, బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరం. ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్ లేదంటే స్మార్ట్ ఫోన్ ఉండాలి. PSPలు దుకాణం లేదంటే కార్యాలయ సెటప్ ను అడిగే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ లేదంటే యాప్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి.
eRail (erail.in), PayPoint India (paypointindia.com), CSC (registration.csccloud.in) వంటి PSPని ఎంచుకోవాలి PSP వెబ్ సైట్ కు వెళ్లాలి. అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి. పేరు, చిరునామా సహా అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. PAN కార్డ్, ఆధార్ కార్డ్, ఫోటో, బ్యాంక్ వివరాల స్కాన్ చేసిన కాపీలను అప్ లోడ్ చేయాలి. OTPతో మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ను కన్ఫార్మ్ చేయాలి.
ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీజు: ₹3,000–₹5,000 ఉంటుంది.
ఇయర్లీ రెన్యువల్ ఫీజు: ₹1,000–₹2,000.
సెక్యూరిటీ డిపాజిట్: ₹5,000–₹10,000 (కొన్నిసార్లు తిరిగి ఇస్తారు).
కొన్ని PSPలు శిక్షణ, సాఫ్ట్ వేర్ కోసం అదనంగా రూ. 500-1000 వసూలు చేస్తారు. UPI, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. టిక్కెట్లను బుకింగ్ చేయడానికి, రద్దు చేయడానికి IRCTC ఏజెంట్ పోర్టల్‌ను ఎలా ఉపయోగించాలో నేర్పడానికి కొన్ని PSPలు చిన్న ఆన్ లైన్ లేదంటే ఆఫ్ లైన్ ట్రైనింగ్ ఇస్తాయి. PSP ఆమోదం తర్వాత బుకింగ్ ప్రారంభించడానికి మీకు IRCTC ఏజెంట్ ID, లాగిన్ వివరాలు, డిజిటల్ వాలెట్ లభిస్తుంది. ఆ తర్వాత PSP యాప్ లేదంటే సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. కస్టమర్లకు టికెట్ బుక్ చేయాలి. మీ వాలెట్‌కు డబ్బు యాడ్ చేయబడుతుంది. ఏజెంట్ ID ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి.
IRCTC ఏజెంట్‌గా, మీరు బుక్ చేసే ప్రతి టికెట్‌పై కమీషన్లు సంపాదించడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. మీరు కస్టమర్ల నుంచి తక్కువ మొత్తంలో అదనపు రుసుము వసూలు చేయవచ్చు. టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకోవడం వంటి ఇతర సేవలను అందించవచ్చు. IRCTC సర్వీస్ రుసుముతో పాటు కస్టమర్లకు అదనపు రుసుము (సాధారణంగా బుకింగ్‌కు ₹20–₹40) వసూలు చేయవచ్చు. కస్టమర్లు కార్డ్ లేదంటే UPI ద్వారా చెల్లిస్తే, లావాదేవీపై 1% వరకు అదనంగా సంపాదించవచ్చు.ఎక్కువ సంపాదించడానికి IRCTC టూరిజం ప్యాకేజీలు, బస్సు టిక్కెట్లు, హోటళ్లను బుక్ చేయాలి. ప్యాకేజీ ఖర్చులో 4–5% లాభం వస్తుంది. ప్రత్యేక రైళ్లు, గ్రూప్ బుకింగ్‌లు అధిక కమీషన్‌లను అందిస్తాయి.
AC తరగతులు (1వ AC, 2వ AC, 3వ AC, చైర్ కార్) టికెట్లు బుక్ చేస్తే, ఒక్కోదానిపై రూ. 40 పొందే అవకాశం ఉంటుంది. నాన్-AC తరగతులు (స్లీపర్, సెకండ్ సిట్టింగ్, జనరల్) టికెట్లను రూ. 20, తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లకు రూ.20, 40 పొందే అవకాశం ఉంటుంది. టూరిజం ప్యాకేజీలు/స్పెషల్ రైళ్ల ప్యాకేజీ విలువలో 4–5% కమిషన్ పొందవచ్చు.
Read Also: IRCTC ఇంటర్నేషనల్ టూర్స్, ఏకంగా విమానంలో ఎగిరిపోవచ్చు!