భారతీయ రైల్వే పరిధిలోని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) క్రేజీ టూర్ ప్యాకేజీలను తీసుకొస్తుంది. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే టూరిస్టులు ఎన్నో అద్భుతమైన టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. తరచుగా అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను కూడా తీసుకొస్తుంది. ఇబ్బంది లేని ప్రపంచ అనుభవాలను కోరుకునే భారతీయ ప్రయాణికుల కోసం ముంబై నుంచి ప్రారంభం అయ్యే అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. కొత్తగా ప్రారంభించబడిన ప్రయాణ ప్యాకేజీలు ప్రముఖ అంతర్జాతీయ గమ్యస్థానాలను కవర్ చేస్తాయని IRCTC తెలిపింది. ఈ టూర్లు అక్టోబర్, డిసెంబర్ 2025 మధ్య అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
⦿ జపాన్: ఈ టూర్ అక్టోబర్ 5 నుంచి 14 వరకు కొనసాగుంది.
⦿ భూటాన్: ఈ పర్యటన అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 వరకు ఉంటుంది.
⦿ థాయిలాండ్ – ఫుకెట్ & క్రాబీ: ఈ టూర్ నవంబర్ 3 నుంచి 9 వరకు ఉంటుంది.
⦿ ఆస్ట్రేలియా: ఈ టూర్ నవంబర్ 11 నుంచి 22 వరకు కొనసాగుతుంది.
⦿ శ్రీ రామాయణ యాత్ర – శ్రీలంక: ఈ అంతర్జాతీయ పర్యటన నవంబర్ 24 నుంచి 30 వరకు ఉంటుంది.
⦿ వియత్నాం: వియత్నాంలోని ప్రముఖ ప్రదేశాలను దర్శించేలా ప్లాన్ చేసిన ఈ యాత్ర నవంబర్ 10 నుంచి 17 వరకు కొనసాగుతుంది.
⦿ మిస్టికల్ నేపాల్: ఈ యాత్ర డిసెంబర్ 23 నుంచి 28 వరకు ఉంటుంది. అయితే, ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడే నిర్ణయం తీసుకోమని IRCTC అధికారులు వెల్లడించారు.
Read Also: రైల్వే టికెట్లపై వీరికి 100 శాతం డిస్కౌంట్, కారణం ఏంటంటే?
ఇక ఈ పర్యటనకు సంబంధించి విమాన ఛార్జీలు, వసతి, భోజనాలు, గైడెడ్ సందర్శన ఛార్జీలు, స్థానిక రవాణా, వీసా/పర్మిట్, ప్రయాణ బీమాను IRCTC భరిస్తుంది. “ఈ ప్యాకేజీల ద్వారా విదేశాలకు వెళ్లాలనుకునే ప్రయాణీకులకు కల నెరవేరనుంది. సౌకర్యవంతంగా ఈ యాత్రలు చేసేలా ఈ ప్యాకేజీలను రూపొందించాం. ఈ యాత్రల ద్వారా ప్రయాణీకులు జీవితాంతం మర్చిపోలేని అనుభూతలను పొందే అవకాశం ఉంది” అని ముంబైలోని IRCTC వెస్ట్ జోన్ గ్రూప్ జనరల్ మేనేజర్ శ్రీ గౌరవ్ ఝా వెల్లడించారు. ఇక IRCTC అంతర్జాతీయ ప్రయాణ ప్యాకేజీలకు ఎక్కువ డిమాండ్ ఉందని, ప్రయాణీకులు వీలైనంత త్వరగా టికెట్ బుక్ చేసుకోవాలన్నారు. ఆయా ప్యాకేజీల ధరలను కూడా రీజనబుల్ గా ఉంచినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం భారతీయ రైల్వే అధికారిక వెబ్ సైట్ చూడాలన్నారు. అక్కడే టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు.
Read Also: చర్లపల్లి నుంచి 22 ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో రైల్వే గుడ్ న్యూస్!