BigTV English

Suriya vs Karthi : ఢిల్లీ వర్సెస్ రోలెక్స్ కాదు… కంగువా వర్సెస్ రుద్రంగ నేత్ర

Suriya vs Karthi : ఢిల్లీ వర్సెస్ రోలెక్స్ కాదు… కంగువా వర్సెస్ రుద్రంగ నేత్ర

Suriya vs Karthi : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీలోని ఇద్దరు హీరోలు ఉంటే, వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో ఎప్పుడు కనిపిస్తారా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్. గత కొంతకాలం నుంచి కోలీవుడ్ సెలబ్రిటీ బ్రదర్స్ సూర్య (Suriya), కార్తీ (Karthi) విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు తెరపై ఒకే ఫ్రేమ్ లో కన్పిస్తారు ? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమిళ తంబీల కల తాజాగా రిలీజ్ అయిన ‘కంగువ’ (Kanguva)తో తీరింది.


‘ఖైదీ’ సినిమాలో ఢిల్లీ వర్సెస్ రోలెక్స్ ల క్రాస్ ఓవర్ ఉండబోతోంది అని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్తలన్నీ నిజం కాదని తాజాగా ‘కంగువ’ (Kanguva) మూవీతో తెలిసిపోయింది. థియేటర్లలో కార్తీ ‘కంగు’ స్క్రీన్ పై సడన్ సర్ప్రైజ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. మరి ‘కంగువ’ మూవీలో కార్తీ పోషించిన పాత్ర ఏంటో తెలుసుకుందాం పదండి.

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువ’ (Kanguva) ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ పీరియాడికి ఫ్యాంటసీ మూవీ గురించి సూర్య అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కంగువా’ సినిమాలో కార్తీ రుద్రంగా నేత్ర అనే పాత్రను పోషించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. గత కొన్ని రోజుల నుంచి ‘కంగువా’ సినిమాలో అతను కనిపించే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ ఈ విషయం గురించి మేకర్స్ గాని, కార్తీ గాని స్పందించలేదు. కానీ ఇప్పుడు అఫీషియల్ గా థియేటర్లలో కార్తీ ‘కంగువా’ సినిమాలో రెండు టైమ్ లైన్ లలో కనిపించడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘కంగువా’ సినిమాలో అతని డ్యూయల్ లుక్స్ దర్శనం ఇస్తున్నాయి.


కార్తీ (Karthi) పూర్వకాలంలోని టైం లైన్ లో భయంకరమైన రాక్షసావతారంలో కనిపిస్తున్నాడు. అతని క్రూరమైన లుక్ చూస్తే కొంచం రోలెక్స్ లాగా కనిపిస్తున్నాడు. తలపై విచిత్రమైన పచ్చబొట్టుతో భయంకరమైన లుక్ తో దర్శనమిచ్చాడు. అలాగే మరోవైపు ప్రస్తుత టైం లైన్లో కార్తీ కాస్త విభిన్నంగా కనిపించింది. ఈ పాత్రలో కూడా అతను తలపై విచిత్రమైన టాటూను వేయించుకొని, అధునాతనంగా కనిపిస్తాడు. కాకపోతే ఆ లుక్ లో కార్తీ స్టైలిష్ లుక్ లో కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి పాత్రలో నటించాడు.

అయితే సినిమా రిలీజ్ కు ఒక రోజు ముందు కూడా కార్తీ చిత్ర బృందానికి స్పెషల్ విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ అందులో ఎక్కడా చిన్న హింట్ కూడా వదల్లేదు. మరి ఆయన ఈ సినిమాలో సూర్యకు సపోర్ట్ గా కనిపించారా? లేదా విలన్ బాబి డియోల్ కు సపోర్ట్ గా చేశారా? అనేది తెలియాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే. ‘కంగువా’ (Kanguva) సినిమాకు ప్రస్తుతం థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కుతోంది. మరి కార్తీ స్పెషల్ అప్పియరెన్స్ ఈ మూవీ సక్సెస్ కు ఎంత మాత్రం ఉపయోగపడుతుంది అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×