E-Paper
Advertisement

Tatkal OTP: అమల్లోకి కొత్త రూల్, తత్కాల్ బుకింగ్ కు ఇక ఓటీపీ చెప్పాల్సిందే!

Tatkal OTP: అమల్లోకి కొత్త రూల్, తత్కాల్ బుకింగ్ కు ఇక ఓటీపీ చెప్పాల్సిందే!
Advertisement

Indian Railway: దేశ వ్యాప్తంగా నడుస్తున్న 102 రాజధాని, శతాబ్ది ఎక్స్‌ ప్రెస్ రైళ్లకు సంబంధించి తత్కాల్ టికెట్లు బుకింగ్ కు సంబంధించి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. రైల్వే స్టేషన్ కౌంటర్ల నుంచి OTP ఆధారిత తత్కాల్ టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని దశలవారీగా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలయ్యింది. తత్కాల్ టికెటింగ్‌ ను పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోంది.

కొత్త విధానం తొలిసారిగా అమలు

తాజాగా అజ్మీర్‌కు సంబంధించిన రైలు నంబర్ 12015/12016, దురై-న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ ప్రెస్ కోసం OTP ఆధారిత తత్కాల్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మిహిర్ దేవ్ వెల్లడించారు. అటు డిసెంబర్ 4 నుంచి, ఈ సౌకర్యం అజ్మీర్ నుంచి ఆగి బయలుదేరే సబర్మతి-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ ప్రెస్ రైలు (నంబర్ 12957/12958)కు కూడా ప్రవేశపెట్టబడుతుందని వెల్లడించారు. ఈ సమాచారాన్ని రిజర్వేషన్ సెంటర్ విండోలో డిస్ ప్లే చేయడంతో పాటు, రిజర్వేషన్ సెంటర్, స్టేషన్‌ లో కూడా ప్రయాణీకులకు సమాచారాన్ని అందిస్తున్నారని వివరించారు.

ప్రయాణీకుడి మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిందే!

Advertisement

తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఇకపై ప్రయాణీకుడి మోబైల్ నెంబర్ ఇవ్వడం తప్పనిసరి. తత్కాల్ రిజర్వేషన్ రిక్వెస్ట్ ఫారమ్ లో మొబైల్ నంబర్ రాయడం తప్పనిసరి. తత్కాల్ రిజర్వేషన్ సమయంలో మొబైల్ నంబర్‌ కు OTP వస్తుంది. రిజర్వేషన్ కౌంటర్‌ లో పనిచేసే సిబ్బందికి ఓటీపీ అందించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రయాణీకుల తత్కాల్ టికెట్ జనరేట్ అవుతుంది.

Read Also: ఇకపై నాన్ ఏసీ ప్రయాణీకులకూ బెడ్ రోల్స్.. ఎప్పటి నుంచి అంటే?

తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ లింక్!  

Advertisement

ఈ ఏడాది జులై 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆన్ లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్లు తమ ఖాతాకు ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. ఆన్‌ లైన్‌ లో తత్కాల్ టికెట్లు బుక్ చెయ్యడం చాలా కష్టం. ఓపెన్ చేసిన ఒక్క నిమిషంలోనే టికెట్లన్నీ అయిపోతాయి. ఇందుకు కారణం ఏజెంట్లు, నకిలీ ఖాతాలే అనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. IRCTC లేదా SwaRail యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే. లేకపోతే టికెట్ బుక్ చెయ్యలేరు. అదే సమయంలో జులై 15 నుంచి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS), అధీకృత ఏజెంట్లు, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసే అన్ని తత్కాల్ టికెట్లకు కూడా ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ తప్పనిసరి చేసింది.

Read Also: గరీబ్ రథ్‌ తోపాటు ఈ రైళ్లు రద్దు.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×