Indian Railways: భారతీయ రైల్వేలో లోకో పైలెట్లు తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నట్లు తాజా విచారణలో తేలింది. ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వేలో లోకో పైలెట్ల పరిస్థితి మరింత అధ్వాహ్నంగా ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం లోకో పైలెట్ 11 గంటలకు మించి పని చేయడమని అడగకూడదు. కానీ, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లోకో పైలెట్లు ఏకంగా 13 నుంచి 15 గంటలు పని చేస్తున్నట్లు గుర్తించారు. ఇలా చేయడం ప్రయాణీకుల భద్రతకే పెను ముప్పుగా అధికారులు అభిప్రాయపడ్డారు.
గూడ్స్ రైలు లోకో పైలెట్ ఆరోపణలపై విచారణ
రీసెంట్ గా సికింద్రాబాద్ డిజవిజన్ కు చెందిన గూడ్స్ రైలు లోకో పైలట్ ఆర్ రవిశంకర్.. తనకు విశ్రాంతి కోసం తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ విధులకు హాజరు కావడానికి నిరాకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. “అతని పని గంటలను విశ్లేషించినప్పుడు, CMS నివేదిక ప్రకారం ఆయన 13:55 గంటలు పని చేసినట్లు తేలింది. డివిజన్ల వివరణతో పోల్చినప్పుడు 15 గంటలు చేసినట్లు వెల్లడైంది” అని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం వెల్లడించింది. “ఆర్ రవిశంకర్, LPG/GALA వాస్తవ పని గంటలు 14:26 గంటలు అనిగా తేలింది. CMSలో 14 గంటలకు పైగా పని చేసినట్లు నివేదించకుండా అతడి పని గంటల్లో 31 నిమిషాలు తగ్గించబడ్డాయి” అని వివరించింది.
మరోవైపు అధిక పని గంటలపై రైల్వే సంస్థ CMS నివేదికపై దర్యాప్తు ప్రారంభించింది. “SCRలో 13:55 గంటల నుంచి 14:00 గంటల మధ్య పనిచేసే లోకో పైలెట్లు 620 మంది ఉన్నారు. మొత్తం 620 కేసులలో 545 కేసులు SC విభాగానికి చెందినవి. వారి పని గంటలు గమనించినప్పుడు ఎక్కువ గంటల పని చేయాలని బలవంతం పెడుతున్నట్లు అర్థం అవుతోంది” అని వెల్లడించింది.
Read Also: పహల్ గామ్ లో ఉగ్రదాడి.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!
డేటా ట్యాంపర్ చేస్తే కఠిన చర్యలు!
అధిక పనిగటంలకు సంబంధించి SCR పరిశీలనలో విజయవాడ డివిజన్‌లో 42 కేసులు, గుంతకల్‌లో 26, గుంటూరు, నాందేడ్ లో మూడు కేసులు, హైదరాబాద్ డివిజన్‌లో ఒకటి కేసు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ LPG పని గంటలు 13:55 నుంచి 14:00 గంటల మధ్య ఉన్నట్లు తేలచారు. నిజంగా ఇలా చేయడం దారుణం. వెంటనే లోకో పైలెట్లకు వర్కింగ్ అవర్స్ తగ్గించాలని SCR సర్క్యులర్ జారీ చేసింది. పని గంటలు పెంచడం వల్ల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకూడదని క్రూ లాబీ అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేయాలని సీనియర్ ఆఫీస్ బేరర్లను సౌత్ సెంట్రల్ రైల్వే ఆదేశించింది. “రైలు కార్యకలాపాలకు సంబంధించిన డేటాను తారుమారు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలి. తప్పు చేసిన ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలి” అని సౌత్ సెంట్రల్ రైల్వే జారీ చేసిన సర్క్యులర్ లో వెల్లడించారు.
Read Also: ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం అలర్ట్, కాశ్మీర్ రైల్వే లింక్ భద్రత కట్టుదిట్టం!