National Awards 2025 : ప్రముఖ బుల్లితెర నటీమణి రూపాలీ గంగూలీ (Rupali Ganguly) టెలివిజన్ పట్ల పక్షపాత వైఖరి చూపిస్తున్నారు అంటూ ఆరోపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. 2025 ఆగస్టు 1న 15 విభాగాలలో 2023కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ అవార్డ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డుల ప్రకటన తర్వాత బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ (Shahrukh Khan), రాణి ముఖర్జీ (Rani Mukherjee) వంటివారు వేడుకలు జరుపుకున్నారు. సంతోషంలో బాలీవుడ్ మునిగిపోయినప్పటికీ.. తమకు మాత్రం పెద్దగా గుర్తింపు లభించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు రూపాలీ గంగూలీ.
మాకు కూడా నేషనల్ అవార్డ్స్ కావాలి – రూపాలీ
ఈ మేరకు రూపాలీ గంగూలీ ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..” సినిమా నటీనటులు నుండీ కంటెంట్ క్రియేటర్ల వరకూ ఈ జాతీయ అవార్డులు అందిస్తున్నారు. కానీ టీవీ నటులకు మాత్రం ఏమీ లభించడం లేదు. అటు కోవిడ్ 19 మహమ్మారి సమయంలో కూడా మేము పని చేస్తూనే ఉన్నాము. ప్రభుత్వం మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను” అంటూ తెలిపింది రూపాలీ గంగూలీ. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి రూపాలీ గంగూలీ అభ్యర్థనను దృష్టిలో పెట్టుకొని నేషనల్ అవార్డ్స్ ప్రకటించే జ్యూరీ మెంబర్స్ వీరికి కూడా నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలి అని టీవీ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
రూపాలీ గంగూలీ కెరియర్..
హిందీ టెలివిజన్ రంగంలో పనిచేసే నటీమణిగా పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు భారతదేశంలోనే అత్యధిక పారితోషకం అందుకుంటున్న టెలివిజన్ నటీమణులలో ఒకరిగా పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. టీవీ రంగంలో విశేష సేవలు అందించినందుకుగానూ రెండు ఐటిఏ అవార్డులు, నాలుగు ఇండియన్ టెలీ అవార్డులతో పాటు అనేక ప్రశంసలు కూడా అందుకుంది.
చైల్డ్ ఆర్టిస్టుగా కెరియర్ మొదలు..
ప్రముఖ దర్శకుడు అనిల్ గంగూలీ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఏడేళ్ల వయసులోనే తన తండ్రి దర్శకత్వం వహించిన సాహెబ్ (1985)అనే సినిమాతో నటన రంగంలోకి అడుగు పెట్టింది. అంతేకాదు తన తండ్రి బెంగాలీ చిత్రం బాలిడాన్ లో కూడా నటించింది. అయితే ఈ సినిమా అక్కడ విజయం సాధించినా.. ఈమెకు మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు.
బుల్లితెరపై సత్తా చాటిన రూపాలీ..
ఇక తర్వాత సంజీవని : ఎ మెడికల్ బూన్ అనే వైద్య నాటక ధారావాహికలో డాక్టర్ సిమ్రాన్ చోప్రా పాత్రతో తన ప్రతిభను చాటుకుంది.2006లో బిగ్ బాస్ సీజన్ వన్ లో పాల్గొన్న ఈమె అక్కడ కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకోవడం గమనార్హం. అలా బుల్లితెర పైనే పలు సీరియల్స్ లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అక్కడ తమ ప్రతిభకు తగ్గ నేషనల్ అవార్డు రావాలి అని ఇప్పుడు ఆకాంక్షిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈమె కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం టీవీ రంగాన్ని కూడా ఆ జాబితాలోకి చేర్చుతుందేమో చూడాలి.
@TheRupali Maa your words are truly motivating! 💫 Your fans love you and appreciate your talent. Wishing you success and recognition, including the prestigious Padma Shri award 🙏🎉 May your dreams come true 🪄✨💐💎💫💝🥰🌹@AshwinKVerma @TheRupali #Anupamaa #RupaliGanguly pic.twitter.com/XXP8zvH3qA
— MD.Amrin Banu Rupalimaa 🪄💎💝🫡💐🥰🙏 (@Amrinbanu164274) August 4, 2025
also read: Hrithik Roshan: హృతిక్ రోషన్ రొమాంటిక్ సాంగ్.. హుక్ స్టెప్ తో అదరగొట్టేసిన తల్లి.. వీడియో వైరల్!