BigTV English

Switzerland Train Journey’s: అద్భుతమైన పనోరమిక్ రైలు ప్రయాణాలు, జీవితంలో ఒక్కసారైనా జర్నీచేయాల్సిందే!

Switzerland Train Journey’s:  అద్భుతమైన పనోరమిక్ రైలు ప్రయాణాలు, జీవితంలో ఒక్కసారైనా జర్నీచేయాల్సిందే!

Panoramic Train Journey’s: స్విట్జర్లాండ్ ను భూలోక స్వర్గంగా అభివర్ణిస్తుంటారు. అత్యంత అందమైన దేశాల్లో స్విట్జర్లాండ్ టాప్ లో ఉంటుంది. అంతేకాదు, అత్యంత సుందరమైన రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాల్లోనూ ఒకటిగా కొనసాగుతుంది. అత్యంత సుందరమైన రైలు మార్గాలు ప్రయాణీకులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కొండలు, కోనలు, అద్భుతమైన జలపాతాలు, చక్కటి పల్లెటూళ్లు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇక స్విట్జర్లాండ్ అనగానే ఐకానిక్ రైళ్లు గుర్తొస్తాయి. ప్రకృతి అందాలను తిలకించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పనోరమిక్ ప్రయాణాలు చూపరులను మైమరచిపోయేలా చేస్తాయి. స్విట్జర్లాండ్ లో పర్యాటకులను అత్యంత ఆకట్టుకనే 5 పనోరమిక్ రైలు ప్రయాణాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


స్విట్జర్లాండ్ లో టాప్ 5 పనోరమిక్ రైలు ప్రయాణాలు

⦿ గ్లేసియర్ ఎక్స్‌ ప్రెస్


గ్లేసియర్ ఎక్స్‌ ప్రెస్ ప్రపంచంలోని అత్యంత నెమ్మదిగా వెళ్లే పనోరమిక్ ఎక్స్‌ ప్రెస్ రైలుగా గుర్తింపు తెచ్చుకుంది.  ఇది జెర్మాట్ నుంచి సెయింట్ మోరిట్జ్ వరకు ప్రయాణిస్తుంది. సుమారు 8 గంటల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుంది.  ప్రకృతి అందాలు, కనువిందు చేసే లోయలు, ఆకట్టుకునే గ్రామాలు, అతిపెద్ద పర్వతాలు ఆహా అనిపిస్తాయి. ఈ ప్రయాణంలో రైలు 291 బిడ్జిలు, 91 టన్నెల్స్ ద్వారా వెళ్తుంది. ఈ రైలులో ఆన్‌ బోర్డ్ బార్,  అప్పటికప్పుడు తయారు చేసిన ఫుడ్ తింటూ ప్రయాణీకులు ఎంజాయ్ చేస్తారు.

⦿ బెర్నినా ఎక్స్‌ ప్రెస్

బెర్నినా ఎక్స్‌ ప్రెస్ సెయింట్ మోరిట్జ్ నుంచి  టిరానో వరకు వెళ్తుంది. ఈ ప్రయాణ ప్రాంతం స్విస్, ఇటాలియన్ సంస్కృతులను అందంగా మిళితం చేస్తుంది. మార్గమధ్యంలోని  చిన్న చిన్న పట్టణాలు ప్రయాణీకులను  మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ రైలు UNESCO వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేరింది. శీతాకాలంలో మంచుతో కప్పబడిన పర్వతాలు, వేసవిలో పచ్చని పొలాలు ఆకట్టుకుంటాయి. ఈ రైలు సముద్ర మట్టానికి 2,253 మీటర్ల ఎత్తులో ఉన్న బెర్నినా పాస్‌ గుండా వెళ్తుంది. ఇది ఐరోపాలో ఎత్తైన రైల్వే ప్రయాణం.

⦿ గోల్డెన్‌ పాస్ ఎక్స్‌ ప్రెస్

గోల్డెన్‌ పాస్ ఎక్స్‌ ప్రెస్  లూసర్న్‌, జెనీవాను కలుపుతుంది. మూడు గంటల పదిహేను నిమిషాల పాలు ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. స్విస్ ఆల్ప్స్ పర్వాతాలకు సంబంధించి మంచుతో కప్పబడిన శిఖరాల నుంచి జెనీవా ప్రాంతంలోని పచ్చని పచ్చిక బయళ్ల మీదుగా ఈ రైలు దూసుకెళ్తుంది. ప్రయాణీకులు ఆల్పైన్ దృశ్యాలు, అద్భుతమైన పట్టణాలు, విశాలమైన ద్రాక్ష తోటలను చూస్తూ ముందుకుసాగుతారు.

⦿ లుజెర్న్-ఇంటర్‌ లాకెన్ ఎక్స్‌ ప్రెస్

ఈ రైలు లూసర్న్, ఇంటర్‌ లాకెన్ వరకు ప్రయాణిస్తుంది. ఈ మార్గం అద్భుతమైన ప్రకృతి అందాలు, సుందరమైన సరస్సుల మీదుగా కొనసాగుతుంది. ఆకర్షణీయమైన స్విస్ పట్టణాలు, కనువిందు చేసే సరస్సులు,  పచ్చిక భూముల గుండా రైలు ప్రయాణం కొనసాగుతుంది. ఈగర్, మాంచ్, జంగ్‌ఫ్రా లాంటి ఐకానిక్ పర్వత శిఖరాలు ఆకట్టుకుంటాయి.

⦿ గోథార్డ్ పనోరమా ఎక్స్‌ ప్రెస్

గోతార్డ్ పనోరమా ఎక్స్‌ ప్రెస్ లుగానో నుంచి ఫ్లూలెన్ వరకు ప్రయాణిస్తుంది. ముందుగా రైలులో గోథార్డ్ మార్గంలో బయలుదేరారు. ఫ్లూలెన్ నుంచి లూసెర్న్ సరస్సు మీదుగా ప్రయాణీకులు చారిత్రాక స్టీమ్‌ బోట్ లేదంటే ఆధునిక ఓడలో ప్రయాణీన్ని కొనాసాగిస్తారు. ఈ ప్రయాణం లుగానోలో ఎండ్ అవుతుంది.

Read Also: పొగమంచుతో దారి కనిపించకపోయినా నో ప్రాబ్లం.. ‘కవచ్’ ఎలా పనిచేస్తుందో చూడండి!

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×