Kissik Talks:చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ (Nataraj Master) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ నిర్మాత ‘సాంబయ్య’ మూవీ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సత్యనారాయణ హోటల్లో వెయిటర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత సత్యనారాయణ సహాయంతో డిస్కో శాంతి నృత్య సంస్థలో చేరి, ఆ తర్వాత తన డాన్స్ తో అందర్నీ మెప్పించడమే కాకుండా హైదరాబాదులోని కొన్ని సంస్థలలో డ్యాన్స్ టీచర్ గా కూడా పనిచేశారు. ఇక డాన్స్ బేబీ డాన్స్ షోలో పాల్గొన్న ఈయన వీధి అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం పలు చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తూ బిజీగా మారిన నటరాజ్ మాస్టర్ తాజాగా బిగ్ టీవీ ఎక్స్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు.
లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో హోస్ట్ వర్ష (Varsha ) మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ 10 వచ్చేసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి ? మాస్టర్ అని ప్రశ్నించగా.. నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. “బిగ్ బాస్ సీజన్ 10లో ప్రాణాలు తీసే టాస్క్ లే పెడుతున్నారు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అగ్నిపరీక్ష మీద మీ ఒపీనియన్ ఏంటి ?అని వర్షా ప్రశ్నించగా.. “అసలు అగ్నిపరీక్ష మీద ఒపీనియనే లేదు”.. అంటూ మరో సంచలన కామెంట్లు చేశారు నటరాజ్ మాస్టర్. “అసలు ఏంటి ఆ ఆటలు ? ఒక మనిషిని పిలిచి అవమానించడం, ముఖం మీద నీళ్లు చల్లడం.. అంటూ అటు బిందు మాధవి కామనర్స్ తో ప్రవర్తించిన తీరుకు ఇండైరెక్టుగా కౌంటర్ ఇచ్చారు నటరాజ్ మాస్టర్. మీ గురించి కూడా మాటలు వినిపించాయి అంటూ వర్ష అడగగా.. “నేను నోరు విప్పితే టెలివిజన్ చరిత్ర బయటపడుతుంది” అంటూ తనదైన శైలిలో స్పందించారు. మొత్తానికైతే బిగ్ బాస్ మీద ,అగ్నిపరీక్ష మీద తన అభిప్రాయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు నటరాజ్ మాస్టర్.
also read:కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. వీడియో వైరల్!
2006లో వీధి అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈయన.. హైవే, సై , చక్రం , గొడవ వంటి చిత్రాలలో నటిస్తూనే.. మరొకవైపు ఆ చిత్రాలలోని కొన్ని పాటలకు కొరియోగ్రఫీ అందించారు ఏది ఏమైనా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేస్తూ విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు నటరాజ్ మాస్టర్.
1982 ఏప్రిల్ 16న ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జన్మించిన నటరాజ్ .. పదవ తరగతి వరకు అక్కడే చదువును పూర్తి చేశారు. 1998లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సత్తా చాటడానికి హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ సెటిల్ అవ్వడానికి కెరియర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఒకవైపు అవకాశాల వేట మొదలు పెట్టినా.. మరొకవైపు బ్రతుకుతెరువు కోసం హోటల్లో వెయిటర్ గా కూడా పనిచేశారు.