BigTV English

Hydrogen Train Ticket: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది, టికెట్ ధర ఎంతో తెలుసా?

Hydrogen Train Ticket: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది, టికెట్ ధర ఎంతో తెలుసా?

Indian Railways: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అప్ డేట్ చెందుతోంది. ఇప్పటికే వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, మరికొద్ది రోజుల్లోనే జీరో కర్బన ఉద్గారాలతో కూడిన హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రాబోతోంది. 2030 నాటి ఈ రైలు పట్టాలు ఎక్కబోతోంది. పూర్తిగా నీటితో నడిచే ఈ రైలుకు సంబంధించిన ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అదే సమయంలో హైడ్రోజన్ ప్లాంట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ – పానిపట్ మార్గంలో దాదాపు 90 కిలోమీటర్ల పరిధిలో సర్వీసులు అందిస్తుంది. ఈ ఇంజిన్‌ లో ఒక రౌండ్ ట్రిప్ కోసం 360 కిలోల హైడ్రోజన్ నింపబడుతుంది.


హైడ్రోజన్ రైలు ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయంటే?

హైడ్రోజన్ రైలు ట్రయల్స్ కొనసగుతున్న నేపథ్యంలో ప్రయాణీకులు ఈ రైలు ఛార్జీలు ఎలా ఉండవచ్చు? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. అధికారిక ఛార్జీలు ఇంకా ప్రకటించబడనప్పటికీ, అంతర్జాతీయంగా ఉన్న ఛార్జీల ఆధారంగా అంచనాలు వేస్తున్నారు. సామాన్య ప్రయాణీకులకు కూడా ఈ రైలు సేవలు అందుబాటులో ఉండేలా ఇండియన్ రైల్వే జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఛార్జీలను సరసమైనవిగా ఉంచాలని భావిస్తోంది. అయితే, అధునాతన సాంకేతికత, మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా దీని ధర ప్రామాణిక స్లీపర్ క్లాస్ ఛార్జీల కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


విదేశాల్లో ఈ రైలు ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?

హైడ్రోజన్‌తో నడిచే రైళ్లు ఇప్పటికే జర్మనీ, చైనా, జపాన్, ఫ్రాన్స్, స్వీడన్, అమెరికా లాంటి దేశాలలో నడుస్తున్నాయి. అధునాతన సాంకేతికత పరంగా జర్మనీ ముందుంది. జర్మనీలో ఈ రైలు ఛార్జీలు కిలో మీటర్ కు రూ. 7-రూ. 10 మధ్య ఉంటాయి. ఇది రూట్, టైమ్, క్లాస్ ను బట్టి ఉంటుంది. చైనా 2019లో హైడ్రోజన్ రైలు అందుబాటులోకి వచ్చింది. కానీ, తక్కువ ప్రయాణికుల సంఖ్య, అధిక ఖర్చుల కారణంగా 2024లో దీనిని నిలిపివేసింది. అక్కడ కిలో మీటరుకు రూ. 5-రూ. 7 వరకు ఛార్జీలు ఉండేవి. జపాన్‌ లోని యోకోహామా- కవాసకి మధ్య 2022 నుండి హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. ఇక్కడ ఛార్జీలు కిలోమీటరుకు రూ. 10-రూ. 15 వరకు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని రెడ్‌ ల్యాండ్స్, శాన్ బెర్నార్డినో మధ్య హైడ్రోజన్ రైలు కార్యకలాపాలను అమెరికా ప్రారంభించింది. ఇక్కడ కిలోమీటరుకు రూ. 12-రూ. 15గా ఉంది. ఇండియాలోనూ కిలో మీటర్ కు రూ. 5 నుంచి 10 వరకు ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

హైడ్రోజన్ రైలు ట్రయల్స్ సక్సెస్

హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైందని రైల్వే మంత్రిత్వ ఇప్పటికే వెల్లడించింది. హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్, దాని సహాయక మౌలిక సదుపాయాల రూపకల్పనకు ప్రపంచ భద్రతా సంస్థల నుంచి అవసరమైన అనుమతులు లభించాయి. హైడ్రోజన్ ఇంధన వ్యవస్థలతో ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) రైళ్ల రెట్రోఫిట్టింగ్ పనిని ఇండియన్ రైల్వేస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం చెన్నైలోని ICFలో ఒక మోడల్ డెవలప్ చేస్తున్నారు.  దేశంలో మొత్తం 35 హైడ్రోజన్ తో నడిచే రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వం భావిసతోంది. ఒక్కో రైలుకు దాదాపు రూ.80 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అదనంగా రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

Read Also: బుల్లెట్ రైలు వచ్చేస్తోంది, అదిరిపోయే విషయం చెప్పిన వైష్ణవ్!

Related News

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. ఒకే ట్రిప్‌లో సింగపూర్, మలేసియా చూసే ఛాన్స్!

Railway Station Closed: ఆ రైల్వే స్టేషన్ మూసివేత.. జనాలు లేక కాదు, ఉద్యోగులు లేక!

Bullet train India: బుల్లెట్ ట్రైన్ టైమ్ వచ్చేసింది.. ఇక మిగిలింది అదొక్కటే.. సిద్ధం కండి!

Big Stories

×