Open Pores On Face: చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ చర్మ సమస్య ఓపెన్ పోర్స్. చర్మంపై చిన్న చిన్న రంధ్రాలలా కనిపించే వీటివల్ల ముఖం నిస్తేజంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ముఖ రంధ్రాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. అయితే.. ఈ పోర్స్ పెద్దవిగా మారడానికి గల కారణాలు, వాటిని తగ్గించుకోవడానికి కొన్ని రకాల చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓపెన్ పోర్స్ అంటే ఏమిటి ?
మన చర్మంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలను పోర్స్ అంటారు. వీటి ద్వారా చర్మం శ్వాస తీసుకుంటుంది. వీటి ద్వారానే నూనె (సీబమ్) చెమట బయటకు వస్తాయి. కొన్ని కారణాల వల్ల ఈ పోర్స్ పెద్దవిగా మారి స్పష్టంగా కనిపిస్తాయి. వీటినే ఓపెన్ పోర్స్ అని అంటారు. ఇవి ఎక్కువగా ముక్కు, నుదురు, బుగ్గలు, గడ్డంపై కనిపిస్తాయి.
ఓపెన్ పోర్స్ పెద్దవిగా మారడానికి కారణాలు:
అధిక సీబమ్ ఉత్పత్తి : జిడ్డు చర్మం ఉన్నవారిలో సీబమ్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సీబమ్ పోర్స్ లోపల పేరుకుపోయి, పోర్స్ ను సాగిపోయేలా చేసి పెద్దవిగా కనిపిస్తుంది. ఇది ఓపెన్ పోర్స్ కు ప్రధాన కారణం.
వంశపారంపర్యం : కొంత మంది ముఖంపై పోర్స్ పెద్దవిగా ఉండటం సాధారణం. మీ తల్లిదండ్రులకు ఓపెన్ పోర్స్ ఉంటే.. మీకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సూర్యరశ్మి ప్రభావం: సూర్యరశ్మిలోని యూవీ కిరణాలు చర్మంపై ఉండే కొల్లాజెన్ , ఎలాస్టిన్‌ను దెబ్బతీస్తాయి. ఇవి చర్మాన్ని సాగదీసి, పోర్స్ ను పెద్దవిగా కనిపించేలా చేస్తాయి.
వయస్సు పెరగడం : వయస్సు పెరిగే కొద్దీ చర్మం తన స్థితి స్థాపకతను కోల్పోతుంది. చర్మం వదులుగా మారడం వల్ల పోర్స్ పెద్దవిగా కనిపిస్తాయి.
మృత కణాలు పేరుకుపోవడం : చర్మంపై మృత కణాలు, దుమ్ము, ధూళి పేరుకుపోయి పోర్స్ మూసుకుపోతాయి. దీంతో అవి ఇన్ఫ్లమేషన్ కు గురై, పెద్దవిగా కనిపిస్తాయి.
హార్మోన్ల మార్పులు : టీనేజ్ లో లేదా గర్భధారణ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పులు సీబమ్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది ఓపెన్ పోర్స్ సమస్యకు దారితీస్తుంది.
స్కిన్ కేర్ : ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, నాణ్యత లేని మేకప్ వాడటం, మేకప్‌తో పడుకోవడం వంటివి ఈ సమస్యను మరింత పెంచుతాయి. ముఖాన్ని కూడా డ్యామేజ్ చేస్తాయి.
Also Read: పుదీనా టీ తాగితే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు !
నివారణ చిట్కాలు:
రోజుకు రెండుసార్లు ముఖం కడగండి: క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ప్రతి రోజు మాయిశ్చరైజర్ వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఎక్స్ఫోలియేషన్: వారానికి ఒకటి లేదా రెండుసార్లు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి.
సన్ స్క్రీన్ వాడకం: ప్రతిరోజూ సన్ స్క్రీన్ వాడటం వల్ల సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు.
రేటినాయిడ్స్: డెర్మటాలజిస్ట్ సలహా మేరకు విటమిన్ A ఉత్పన్నాలైన రేటినాయిడ్స్ వాడటం వల్ల పోర్స్ తగ్గుతాయి.
హైడ్రేషన్: శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అంతే కాకుండా ఎక్కువ నీళ్లు తాగాలి.