Rajdhani Express: గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడానికి విమాన ప్రయాణమే బెస్ట్ అని చాలామంది భావిస్తుంటారు. అయితే కొందరు ప్రయాణికులు ఇందుకు భిన్నంగా సమయం కంటే ప్రయాణంలో లభించే అనుభూతి, ఆహ్లాదకరమైన వాతావరణమే అత్యంత ముఖ్యమని అభిప్రాయపడుతుంటారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మల్హార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియో ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. ముంబై నుంచి న్యూఢిల్లీ వరకు ‘తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్’ (12951) ఫస్ట్ ఏసీ కోచ్‌లో తను చేసిన ప్రయాణ అనుభవాన్ని, అందులో లభించిన సౌకర్యాలను ఓ వీడియో రూపంలో ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం ఇది అందరి దృష్టి ఆకర్షిస్తోంది.
ఈ ప్రయాణం కోసం క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి మల్హార్ సుమారు రూ. 5,300 చెల్లించారు. విమాన టికెట్ దీనికంటే తక్కువ ధరకే లభించే అవకాశం ఉన్నప్పటికీ తాను మాత్రం ప్రత్యేకంగా రైలు ప్రయాణాన్నే ఎంచుకున్నట్లు మల్హార్ వీడియో ప్రారంభంలో చెప్పారు. ఇక రైలు ఎక్కిన వెంటనే సిబ్బంది మంచినీటి బాటిల్ అందించారు. సాధారణ కోచ్‌లతో పోలిస్తే ఫస్ట్ ఏసీలో శుభ్రమైన, విశాలమైన బాత్‌రూమ్ సౌకర్యం ఉందని ఆయన చూపించారు. రైలు బయలుదేరిన కొద్దిసేపటికే స్నాక్స్.. ప్యాంట్రీ కార్‌లో తాజాగా తయారు చేసిన వేడి టీని అందజేశారు. ఆ తర్వాత కోచ్ గ్యాలరీలో కొద్దిసేపు నడుస్తూ బయటి దృశ్యాలను మల్హార్ చూపించారు. ఆ సమయంలో రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు వీడియోలో పేర్కొన్నారు.
ఈ ప్రయాణంలో ప్రధాన ఆకర్షణ అతడికి అందిన ఆహారమే అని చెప్పవచ్చు. రాత్రి భోజనానికి ముందు ప్యాంట్రీ కార్‌లో తయారు చేసిన వేడి సూప్‌ను వడ్డించారు. దీని రుచి ఎంతో బాగుందని మల్హార్ చెప్పారు. భోజనంలో శాఖాహారంతో పాటు కాంటినెంటల్ ఆప్షన్‌ను కూడా ఆయన ఎంచుకున్నారు. ఆ వంటకాలు చాలా రుచిగా ఉన్నాయని చివరగా ఐస్‌క్రీమ్‌ను కూడా అందించారని తెలిపారు. రాత్రి రైలు వడోదర జంక్షన్‌కు చేరుకున్న సమయంలో ఆయన తన బెర్త్‌పై పడుకుని నిద్రపోయారు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో మార్నింగ్ టీతో ఆయన నిద్రలేచారు. ‘హాయిగా నిద్రపోయి లేవగానే స్నాక్స్, పానీయాలు సిద్ధంగా ఉండటమే రైలు ప్రయాణం ప్రత్యేకత’ అని సరదాగా వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత ఉదయం అల్పాహారంలో వేడి కార్న్‌ఫ్లేక్స్, ఉప్మా, పోహా, వెజిటబుల్ కట్‌లెట్స్ వడ్డించారని మల్హార్ తెలిపారు. ఢిల్లీ చేరుకోవడానికి ముందు మరోసారి టీ ఇచ్చారని.. ఉదయం 8:35 గంటల సమయానికి రైలు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకుందని స్పష్టం చేశారు. మెుత్తంగా ముంబై టూ ఢిల్లీ ప్రయాణం ఎంతో అద్భుతంగా సుఖవంతంగా సాగిందని మల్హార్ స్పష్టం చేశారు. విమాన ప్రయాణానికి మించిన సౌకర్యాలు తనకు లభించాయని.. రాజధాని ఎక్స్ ప్రెస్ ఫస్ట్ ఏసీ కోచ్‌లో ప్రయాణం ఎప్పటికీ తనకు గుర్తుండిపోతుందని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: సౌత్ బిహార్‌లా ఏపీ.. రీ-పోలింగ్ పెట్టాల్సిందే.. వైఎస్ షర్మిల సంచలన డిమాండ్!
మల్హార్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ‘అసలైన ప్రయాణ మజా రైలులోనే ఉంది. గత నెలలోనే నేను కూడా ఈ రైలులో ప్రయాణించాను. నిజంగా 5-స్టార్ అనుభవం లభించింది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘రూ. 5,300 చెల్లించినప్పుడు ఆ మాత్రం రుచికరమైన భోజనం ఉండాల్సిందే కదా’ అని మరికొందరు కామెంట్ చేశారు. అయితే ఇంకొందరు నెటిజన్లు మాత్రం విమాన ప్రయాణమే మేలని అభిప్రాయపడ్డారు. అయితే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం, చెక్-ఇన్, సెక్యూరిటీ చెకప్‌లకు పట్టే సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే రైలు ప్రయాణమే ప్రశాంతంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.
?utm_source=ig_embed&ig_rid=Ar7uWR8zPvrYWslhTkOqnH0
Also Read: శాలరీ అకౌంట్ vs సేవింగ్స్ అకౌంట్.. రెండింటికీ తేడా ఏంటి? ఏ ఖాతా వల్ల ఎక్కువ లాభం?