Hyperloop Train Test Track: గత దశాబ్ద కాలంగా భారతీయ రైల్వే సంస్థ శరవేగంగా తన ముఖచిత్రాన్ని మార్చుకుంటున్నది. దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయ రైళ్లకు భిన్నంగా సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన వందేభారత్ రైళ్లు ఇండియన్ రైల్వేకు ఫేస్ గా మారిపోయాయి. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వస్తున్నాయి. త్వరలో వందేభారత్ స్లీపర్ రైలు కూడా అందుబాటులోకి రాబోతోంది. మరోవైపు హైడ్రోజన్ రైలు సైతం పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరో కీలక విషయాన్ని వెల్లడించారు.
హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ నిర్మిస్తున్న ఐఐటీ మద్రాస్ విద్యార్థులు
ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ రైల్వే లో అత్యాధునిక హైపర్ లూప్ ట్రైన్ తయారీ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో IIT మద్రాస్ విద్యార్థులు 410 మీటర్ల పొడవైన హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను రూపొందించారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా హైపర్ లూప్ ట్రైన్ టెస్ట్ ట్రాక్ వీడియోను షేర్ చేశారు. “భారత తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ (410 మీటర్లు) పూర్తయింది. టీమ్ రైల్వేస్, IIT-మద్రాస్ కలిసలి ఈ ట్రాక్ ను నిర్మించారు” అని రాసుకొచ్చారు. ఐఐటీ మద్రాస్ బృందం, ఇంక్యుబేటెడ్ స్టార్టప్ TuTr సంయుక్తంగా ఇండియన్ ఫస్ట్ వాక్యూమ్ రైలును డెవలప్ చేస్తున్నాయి.
Watch: Bharat’s first Hyperloop test track (410 meters) completed.
👍 Team Railways, IIT-Madras’ Avishkar Hyperloop team and TuTr (incubated startup)
📍At IIT-M discovery campus, Thaiyur pic.twitter.com/jjMxkTdvAd
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 5, 2024
ఆవిష్కార్ ప్రాజెక్టు కోసం ఐఐటీ మద్రాస్, TuTr
ఐఐటీ మద్రాస్ బృందం హైపర్ లూప్ రైలు రూపకపల్పన కోసం చేపట్టిన ఆవిష్కార్ ప్రాజెక్టులో కీలక భూమిక పోషిస్తున్నది. టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్ 2012లో ఈ కాన్సెప్ట్ గురించి బయటి ప్రపంచానికి వెల్లడించారు. దాన్ని బేస్ గా చేసుకుని భారతీయ రైల్వే సంస్థ, ఐఐటీ మద్రాస్ బృందం ఆవిష్కార్ హైపర్ లూప్ కోసం పని చేస్తున్నారు. ఈ టీమ్ లో IIT మద్రాస్ కు చెందిన 76 అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో టెక్నాలజీని పరిశీలించనున్నారు. ఇందుకోసం 11.5 కిలోమీటర్ల ట్రాక్‌ను నిర్మించనున్నారు. అవసరమైన పరీక్షలు పూర్తయిన తర్వాత, మిగిలిన 100 కిలోమీటర్ల మార్గాన్ని కవర్ చేయడానికి రెండవ దశ ప్రారంభించబడుతుంది.
Read Also: రైల్వే అదిరిపోయే ఆఫర్.. ఉచిత ఆహారం, డబ్బులు కూడా వాపస్!
గంటకు 1100 కి.మీ ప్రయాణించనున్న హైపర్ లూప్ ట్రైన్
హైపర్ లూప్ రైలు గరిష్ట వేగం గంటకు 1100 కిలో మీటర్లుగా ప్రతిపాదించబడింది. సెకెనుకు 100 మీటర్లు దూసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇండియన్ ఫస్ట్ హైపర్ లూప్ రైలు గురించి..
దేశంలొ తొలి హైపర్ లూప్ రైలు ముంబై – పూణే మధ్య నడవనున్నట్లు తెలుస్తున్నది.ఈ రైలు తో ముంబై- పూణే మధ్య ప్రయాణ సమయం కేవలం 25 నిమిషాలకు తగ్గించే అవకాశం ఉందని అధకారులు వెల్లడించారు. అయితే, ఈ అల్ట్రా మోడరన్ రవాణా ప్రణాళిక ఇంకా పూర్తి కాలేదు.
Read Also: చార్ట్ ప్రిపేర్ అయినా కన్ఫార్మ్ టికెట్ దొరుకుతుంది సింపుల్‌గా ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు!