BigTV English

Tollywood Heroines: ఈ ఏడాది ఫ్యాన్స్ ను నిరాశపరిచిన హీరోయిన్స్ వీళ్ళే..!

Tollywood Heroines:  ఈ ఏడాది ఫ్యాన్స్ ను నిరాశపరిచిన హీరోయిన్స్ వీళ్ళే..!
Advertisement

Tollywood Heroines..ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్స్ లేదా హీరోలు ఎవరైనా సరే అభిమానులకు అందుబాటులో ఉండడం కోసం ఏదో ఒక రకంగా స్క్రీన్ ప్రజెంట్స్ ఇస్తూ ఉంటారు. అయితే అందుబాటులో ఉండడం కోసం ఇచ్చే స్క్రీన్ ప్రజెంట్స్ వేరు. కానీ బిగ్ స్క్రీన్ మీద హీరోయిన్ గా మెప్పించడం వేరు. అలా బిగ్ స్క్రీన్ మీద ఏడాది కొంతమంది హీరోయిన్లు కనిపించక, తమ అభిమానులను పూర్తిస్థాయిలో నిరాశపరిచారు.


నయనతార..

ఏడాది ఈమెకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేనంత అగ్రెసివ్ గా కనిపిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లిగా , నార్త్ లో ఎంట్రీ మూవీతో వెయ్యి కోట్లు తెచ్చుకున్న ఈమె అన్ని విధాలుగా లైఫ్ లో సక్సెస్ అయింది. దీనికి తోడు ఈమె పెళ్లి వీడియో ఇటీవల విడుదలయ్యింది. అయితే ఇందుకు సంబంధించి ధనుష్ కొన్ని సెకండ్ల క్లిప్ కి పరిమిషన్ ఇవ్వకపోవడంతో అసలు రచ్చ బయటపడింది. ఇన్ని విధాలుగా లైమ్ లైట్ లో ఉన్న ఈమె ఏడాది మాత్రం ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేదు.


త్రిష..

తన అంద చందాలతో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న బ్యూటీ త్రిష. ఈమె ఈ ఏడాది విజయ్ హీరోగా నటించిన గోట్ సినిమాలో ఒక పాటలో మాత్రమే స్టెప్పులేసింది. అంతేకానీ పూర్తిస్థాయి సినిమాను థియేటర్లలో విడుదల చేయలేదు. ఇక ప్రస్తుతం చిరంజీవికి జోడిగా విశ్వంభర సినిమాలో నటిస్తోంది.

సమంత:

ఒకరకంగా చెప్పాలి అంటే సమంత ఏడాది డిజిటల్ పరంగా సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేసింది. కానీ సినిమా ను మాత్రం రిలీజ్ చేయలేదు. 2025 లో కూడా ఈమె సినిమాలు ఉంటాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ. మరి ఈమె తదుపరి సినిమాల గురించి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టు వస్తే తప్ప ఫలానా టైంలో ఈమె వస్తుంది అని చెప్పవచ్చు.

పూజా హెగ్డే..
తాజాగా జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈమె తెలుగు ఇండస్ట్రీకి దూరంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 2025లో దేవా అనే బాలీవుడ్ మూవీ తో పాటు తమిళ్లో సూర్య 44వ చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఇక 2024లో మిస్ అయినా వచ్చే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతోంది ఈ ముద్దుగుమ్మ.

అనుష్క..
లేడీ లక్ అనుష్క కూడా ఏడాది స్క్రీన్ మీద మెప్పించలేకపోయింది.ఈమె నటించిన ఘాటి, కథనార్ టీజర్లను ఈమె బర్తడే సందర్భంగా విడుదల చేశారు. 2025లో ఏకంగా రెండు సినిమాలతో మెప్పిస్తాననే కాన్ఫిడెంట్ ఈమెలో కనిపిస్తోంది. కానీ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు.

ఇక ఇలా ఈ ఐదు మంది స్టార్ హీరోయిన్లు ఏడాది తమ సినిమాలను విడుదల చేయకుండా అభిమానులను పూర్తిస్థాయిలో నిరాశపరిచారు. మరి వచ్చే ఏడాది అయిన మీరు తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి.

Related News

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Big Stories

×